AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Swara Bhaskar: ‘ఈ డబుల్ స్టాండర్డ్స్ ఎందుకు మేడమ్’? ముస్లిం మత పెద్దను కలిసిన నటిపై నెటిజన్ల ఆగ్రహం

స్వర భాస్కర్ పలు సినిమాల్లో నటించింది. అయితే ఫహద్ అహ్మద్‌తో ఆమె మతాంతర వివాహం చేసుకున్న తర్వాత తరచూ ట్రోల్స్ బారిన పడుతోంది. ఇప్పుడు ఆమె ఏకంగా మౌలానా సజ్జాద్ నోమనిని కలిసి ఫొటోలు దిగడంపై నెటిజన్లు మండిపడుతున్నారు.

Swara Bhaskar: 'ఈ డబుల్ స్టాండర్డ్స్ ఎందుకు మేడమ్'? ముస్లిం మత పెద్దను కలిసిన నటిపై నెటిజన్ల ఆగ్రహం
Swara Bhaskar
Basha Shek
|

Updated on: Nov 18, 2024 | 7:28 PM

Share

బాలీవుడ్ ప్రముఖ నటి స్వర భాస్కర్ సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అవుతోంది. ఇటీవల ఆమె ముస్లిం మత గురువు మౌలానా సజ్జాద్ నోమానిని కలిశారు. స్వరాభాస్కర్ వెంట ఆమె భర్త ఫహద్ అహ్మద్ కూడా ఉన్నాడు. స్వరా భాస్కర్, మౌలానా సజ్జాద్ నోమానీ, ఫహద్ అహ్మద్‌ల ఫోటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. పైగా ఈ ఫొటోల్లో ఆమె పూర్తిగా ముస్లిం మహిళ తరహాలో తలపై దుపట్టా కప్పుకుని ఉంది. ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు స్వర భాస్కర్ ను ట్రోల్ చేస్తున్నారు. దీనికి ఒక బలమైన కారణం ఉంది. గతంలో బాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించిన నటి స్వరా భాస్కర్ ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడే మహిళగా పేరుంది. ఆడపిల్లల హక్కుల కోసం ఆమె తరచూ తన గళాన్ని వినిపించింది. మహిళల స్వేచ్ఛ, సమానత్వం తదితర అంశాలపై తరచూ సోషల్ మీడియాలోనూ పోస్టులు పెట్టింది. అయితే ఇప్పుడు మహిళా వ్యతిరేక మనస్తత్వం ఉన్న మౌలానా సజ్జాద్ నోమానితో కలిసి ఫొటోలు దిగడం, పైగా ముస్లిం మహిళ తరహాలో తలపై దుపట్టా కప్పుకొని ఉండడం చర్చనీయాంశమవుతోంది.

తాలిబన్ల సానుభూతిపరుడైన మౌలానా సజ్జాద్ నోమానీ గతంలో ఆడపిల్లలను చదివించకూడదని సందేశాలు ఇచ్చారు. ఆడ పిల్లలు చదువుకోవడం, ఉద్యోగాలు చేయడం తగదంటూ వ్యాఖ్యానించారు. అలాగే వివాహానికి ముందు డేటింగ్ లు, రిలేషన్ షిప్ లు పెట్టుకోకూడదని కామెంట్స్ ఇచ్చారు. అలాంటి వ్యక్తిని ఫెమినిస్ట్ భావాలున్న స్వర భాస్కర్ ఇప్పుడు కలిసింది. దీనిపై నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. ‘ అల్ట్రా ఫెమినిస్ట్ స్వర భాస్కర్. ఈ డబుల్ స్టాండర్డ్స్ ఎందుకు? చెప్పేది ఒకటి, చేసేది మరొకటి. ఆమె లాంటి కపట వ్యక్తి మరొకరు లేరంటూ నెటిజన్లు నటిపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ముస్లిం మత పెద్దతో స్వరా భాస్కర్ దంపతులు..

కాగా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో స్వర భాస్కర్ భర్త ఫహద్ అహ్మద్ ఎన్సీపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో స్వరా భాస్కర్ తో మౌలానా సజ్జాద్ నోమనిని కలిశాడు ఫహద్ అహ్మద్. అనంతరం ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. మరి నెటిజన్ల విమర్శలు, ట్రోల్స్ పై స్వర భాస్కర్ ఏమంటుందో చూడాలి.

ఎన్నికల కోసమేనా?

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..