AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jabardasth: గవర్నమెంట్ జాబ్ వదులుకుని మరీ జబర్దస్త్‌లోకి వచ్చిన స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా?

కంటెంట్ మీద కొన్ని విమర్శలున్నా జబర్దస్త్ కామెడీషో చాలామందికి లైఫ్ ఇచ్చింది. ఈ కామెడీ షోతో గుర్తింపు తెచ్చుకున్న సుడిగాలి సుధీర్, బలగం వేణు, రామ్ ప్రసాద్, గెటప్ శీను, రాకింగ్ రాకేష్, ధనాధన్ ధన్ రాజ్, జీవన్ తదితరులు ఇప్పుడు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటున్నారు.

Jabardasth: గవర్నమెంట్ జాబ్ వదులుకుని మరీ జబర్దస్త్‌లోకి వచ్చిన స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా?
Jabardasth Comedian
Basha Shek
|

Updated on: Nov 17, 2024 | 9:54 PM

Share

జబర్దస్త్ కామెడీ షో ద్వారా చాలామంది కమెడియన్లుగా పాపులర్ అయ్యారు. సినిమాల్లో అవకాశాలు సంపాదించుకుంటున్నారు. కొందరు హీరోలు, సహాయక నటులుగా, కమెడియన్లుగా రాణిస్తుంటే మరికొందరు నిర్మాతలుగా, డైరెక్టర్లుగా సత్తా చాటుతున్నారు. అలా జబర్దస్త్ కామెడీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో వెంకీ మంకీ ఒకరు. సుమారు పదేళ్లుగా ఈ కామెడీషోలో కొనసాగుతున్నాడీ స్టార్ కమెడియన్. తన పంచులు, ప్రాసలతో జనాలను కడుపుబ్బా నవ్విస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వెంకీ తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ నుకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ‘ నాకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉండాలని కోరుకునే వ్యక్తిని నేను. అందుకోసం మంచి ప్రభుత్వ ఉద్యోగం వచ్చినా వదులుకున్నాను. జబర్దస్త్ షోతో నా కల నెరవేరింది. నేను మాములుగా ఒక మిమిక్రీ ఆర్టిస్టును .. అక్కడక్కడా షోస్ చేస్తూ ఉండేవాడిని. అదే సమయంలో చమ్మక్ చంద్ర చూసి నన్ను జబర్దస్త్ కు ఇంట్రడ్యూస్ చేశాడు. కమెడియన్ గా నాకు అక్కడ ఒక మంచి గుర్తింపు వచ్చింది’

‘డైరెక్టర్ కావాలనే ఉద్దేశంతో  సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాను. స్క్రిప్ట్ రాయడంలో నాకు అంతో ఇంతో అనుభవం ఉంది . యాక్టింగ్ కూడా కొద్దిగా తెలుసు. అందువలన జబర్దస్త్ కామెడీ షోలో ఎక్కువ కాలం నిలదొక్కుకోగలిగాను. 10 ఏళ్లపాటు టీమ్ లీడర్ గా కొనసాగాను. నిజం చెప్పాలంటే  జబర్దస్త్ నాకు జీవితాన్ని ఇచ్చింది. ఈ కామెడీ షో  గురించి ఎవరేం మాట్లాడారనేది నాకు తెలియదు. నాకు అనవసరం కూడా.. కానీ ఆ కామెడీ షో నే మాకు కడుపు నింపి ఆదరించిందనే విషయాన్ని మరిచిపోకూడదు అనేది నా ఉద్దేశం’

ఇవి కూడా చదవండి

‘ఇటీవల చలాకీ చంటి అనారోగ్యం బారిన పడితే, అతని గురించి కొన్ని యూ ట్యూబ్ ఛానల్స్ ఇష్టం వచ్చినట్టుగా  ప్రచారం చేశాయి. ఆ మధ్య నాకు చిన్న ప్రమాదం జరిగితే కూడా అలాగే చేశారు. దీంతో మా కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు.  ఇలాంటి అబద్దపు వార్తలతో  మాకు అవకాశం ఇవ్వాలనుకున్నవాళ్లు ఆలోచిస్తారు. మేం నటించే స్థితిలో లేమనుకుని వేరే వాళ్లకు ఆ ఛాన్స్ ఇస్తారు. దయచేసి ఇలాంటి అబద్దపు ప్రచారాలు చేయకండి’ అని ఆయన రిక్వెస్ట్ చేశాడు వెంకీ.

కార్తీక పౌర్ణమి వేడుకల్లో జబర్దస్త్ వెంకీ ..

మెగాస్టార్ చిరంజీవితో జబర్దస్త్ వెంకీ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!
తిరుమలకు వెళ్లే ఆ నడక మార్గం మూసివేత!
తిరుమలకు వెళ్లే ఆ నడక మార్గం మూసివేత!
రిచా ఘోష్ ఆన్ డ్యూటీ.. జీతం, బోనస్ కలిపి ఎంతోస్తాయో తెలుసా ?
రిచా ఘోష్ ఆన్ డ్యూటీ.. జీతం, బోనస్ కలిపి ఎంతోస్తాయో తెలుసా ?
గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ