AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 8 Telugu: లవ్ స్టోరీ చెప్పి కన్నీళ్లు పెట్టించిన నిఖిల్.. అసలు రంగు బయటపెట్టిన మాజీ లవర్..

ఆరేళ్ల ప్రేమ.. కానీ మనస్పర్థలు.. విడిపోయామని నేను అనుకోవడం లేదు.. బిగ్ బాస్ షో అయిపోగానే వచ్చి నీ ముందుంటాను. నువ్వు కొట్టినా.. తిట్టినా పడతాను. కానీ నన్ను క్షమించు నువ్వే నా భార్యవి.. పిచ్చిలేస్తే నిన్ను లేపుకెళ్లిపోతా అంటూ తన లవ్ స్టోరీ చెబుతూ అందరి గుండెల్ని పిండేశాడు నిఖిల్. కానీ అతడి పేరు ప్రస్తావించకుండానే ఇన్ డైరెక్టుగా ఇచ్చిపడేసింది కావ్య శ్రీ..

Bigg Boss 8 Telugu: లవ్ స్టోరీ చెప్పి కన్నీళ్లు పెట్టించిన నిఖిల్.. అసలు రంగు బయటపెట్టిన మాజీ లవర్..
Nikhil
Rajitha Chanti
|

Updated on: Nov 18, 2024 | 6:59 AM

Share

బిగ్‏బాస్ సీజన్ 8లో కంటెస్టెంట్ నిఖిల్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. గోరింటాకు సీరియల్ ద్వారా చాలా పాపులర్ అయ్యాడు. అదే ధారావాహికలో తనతోపాటు జోడిగా నటించింది కావ్య శ్రీ. వీరిద్దరి జోడికి ప్రత్యేకంగా ఫ్యాన్ బేస్ ఉంది. ఇద్దరు కలిసి అనేక ఈవెంట్స్, షోలలో సందడి చేశారు. ఇద్దరు కలిసి యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేశారు. అప్పట్లో వీరి జోడి గురించి అనేక రూమర్స్ వినిపించాయి. ఇద్దరూ ప్రేమలో ఉన్నారని..త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనే టాక్ నడిచింది. అయితే అనుహ్యంగా వీరిద్దరు వేరయ్యారు. ఎప్పుడూ కలిసి కనిపించే నిఖిల్, కావ్య శ్రీ మధ్య బ్రేకప్ జరిగిందనే ప్రచారం నడిచింది. ఇటీవల బిగ్‏బాస్ హౌస్ లో తన లవ్ స్టోరీని చెబుతూ గుండెల్ని పిండేశాడు నిఖిల్. ఈ షో అయిపోగానే నీ ముందు ప్రత్యక్షమవుతాను.. నువ్వే నా భార్యవి.. ఒప్పుకోకపోతే నిన్ను లేపుకెళ్లిపోతా అంటూ ఎమోషనల్ స్టోరీ చెబుతూ హౌస్మేట్స్ నే కాదు.. ప్రేక్షకులు సైతం కన్నీళ్లు పెట్టించేలా మాట్లాడాడు.

దీంతో నిఖిల్ చెప్పిన లవ్ స్టోరీ విన్న అడియన్స్ ఇటు కావ్యను టార్గెట్ చేశారు. కావ్యను ఎంతో ప్రేమిస్తున్నాడని.. ఎందుకు విడిపోయారు..? మళ్లీ కలవండి అంటూ కావ్యకు సోషల్ మీడియాలో కామెంట్స్ చేయడం స్టార్ట్ చేశారు. ఒక్క లవ్ స్టోరీతో నిఖిల్ కు మరింత మద్దతు పెరిగింది. అయితే తాజాగా నిఖిల్ పేరు ప్రస్తావించకుండానే అతడి అసలు రంగును బయటపెడుతూ ఓ పోస్ట్ చేసింది కావ్య. ముందు నుంచి సైలెంట్ గా ఉన్న కావ్య.. నిఖిల్ ఫ్యాన్స్ తనను టార్గెట్ చేయడంతో పరొక్షంగా నిఖిల్ పై విరుచుకుపడింది.

‘మాస్కులు వేసుకుని నటించేవాళ్లను చూసి మోసపోవద్దు. పరిస్థితులకు తగినట్లుగా ఫేక్ మనుషులు మారుతుంటారు. కానీ ఏదోక సందర్భంలో వాళ్ల అసలు రంగును బయటపెడతారు. వాళ్ళ ముసుకు తొలగేవరకు వేచి చూడండి. ఎప్పుడు ఎక్కడ ఎలా యాక్ట్ చేయాలో వాళ్లకు బాగా తెలుసు. పాపం జనాలు ఆ నకిలీ యాక్టింగ్ చూసి మోసపోతుంటారు. వాళ్ల యాక్టింగ్ చూసి.. నిజమైన బాధితులు సమాజం ముందు దోషులుగా నిలబడాల్సి వస్తుంది. అలాంటి వారి గురించి జనాలకు ఉన్న అభిప్రాయాలను మార్చలేం. వాళ్లే బాధితులు అన్నట్లుగా నటిస్తారు. నమ్మిస్తారు. నిజమైన బాధితులను దోషులుగా చిత్రీకరించడంలో ఇలాంటి వాళ్లు మహా దిట్ట ‘ అంటూ నిఖిల్ పేరును ప్రస్తావించకుండానే ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది కావ్య. దీంతో ఆమె పోస్ట్ నిఖిల్ ను ఉద్దేశిస్తూ పోస్ట్ చేసిందంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. ప్రస్తుతం కావ్య ఇన్ స్టా స్టోరీ స్క్రీన్ షాట్స్ నెట్టింట వైరలవుతున్నాయి. మరోవైపు అటు సోనియా సైతం నిఖిల్ గురించి షాకింగ్ పోస్టులు పెట్టింది.

ఇవి కూడా చదవండి
Kavya

Kavya

ఇది చదవండి : Tollywood: వార్నీ.. ఏందీ బాసూ ఈ అరాచకం.. పద్దతిగా ఉందనుకుంటే గ్లామర్ ఫోజులతో హీటెక్కిస్తోందిగా..

Tollywood: ఇరవై ఏళ్లపాటు స్టార్ హీరోయిన్.. బాత్రూమ్ గోడలో రూ.12 లక్షలు దొరకడంతో కెరీర్ నాశనం..

Chandamama: దొరికిందోచ్.. టాలీవుడ్‏కు మరో చందమామ.. ఈ హీరోయిన్ కూతురిని చూశారా.. ?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
అభిషేక్ కు ఇచ్చిపడేసిన టీ20 వరల్డ్ కప్ హీరో.. నెంబర్ 1 స్థానంతో..
అభిషేక్ కు ఇచ్చిపడేసిన టీ20 వరల్డ్ కప్ హీరో.. నెంబర్ 1 స్థానంతో..
బడికి వెళ్లే పిల్లలకు బెస్ట్.. లంచ్ బాక్స్‌లోకి రైస్ ఇలా పెట్టండి
బడికి వెళ్లే పిల్లలకు బెస్ట్.. లంచ్ బాక్స్‌లోకి రైస్ ఇలా పెట్టండి
వైభవ్ సూర్యవంశీ గురించి ఇంగ్లాండ్ కెప్టెన్ సంచలన స్టేట్మెంట్..
వైభవ్ సూర్యవంశీ గురించి ఇంగ్లాండ్ కెప్టెన్ సంచలన స్టేట్మెంట్..
పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్డేట్.. వెబ్ సైట్ తెరుచుకునేది అప్పుడే..
పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్డేట్.. వెబ్ సైట్ తెరుచుకునేది అప్పుడే..
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై