AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Satyaraj: గుండె నిండా బాధను భరిస్తున్న కట్టప్ప.. కూతురు ఎమోషనల్ పోస్ట్..

మిర్చి సినిమాలో ప్రభాస్ తండ్రిగా.. ప్రతిరోజూ పండగే సినిమాలో సాయి ధరమ్ తేజ్ తాతయ్యగా, బాహుబలి సినిమాలో కట్టప్పగా.. ఇలా టాలీవుడ్ సినిమాల్లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న సత్యరాజ్. కెరీర్ తొలినాళ్లలో విలన్ పాత్రలు పోషించిన సత్యరాజ్.. ఆ తర్వాత హీరోగా సూపర్ హిట్ మూవీస్ చేశారు. ఇప్పుడు సహయ నటుడిగా అలరిస్తున్నారు.

Satyaraj: గుండె నిండా బాధను భరిస్తున్న కట్టప్ప.. కూతురు ఎమోషనల్ పోస్ట్..
Sathyaraj
Rajitha Chanti
|

Updated on: Nov 12, 2024 | 9:45 AM

Share

దక్షిణాది సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరంలేని పేరు సత్యరాజ్. 80, 90లలో హీరోగా, నటుడిగా అలరించి తనకంటూ మంచి పేరు తెచ్చుకున్నాడు. తమిళంలో ఎక్కువగా హీరోగానే నటించిన ఆయన.. ఆ తర్వాత వయసు రీత్యా సహాయ నటుడిగా అలరిస్తున్నారు. విలక్షణమైన నటనతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.  తమిళ చిత్రసీమలో విలన్‌గా అరంగేట్రం చేసిన సత్యరాజ్ తొలినాళ్లలో సినిమాల్లో ప్రతినాయకుడిగా కనిపించాడు. భారతీరాజా ‘సముద్రతీర పద్యాలు’ మూవీ అతడి విలన్ ఇమేజ్ ని మార్చింది.  ‘కడలోరా కవికాగలు’ సినిమాతో హీరోగా పరిచయమైన సత్యరాజ్.. అద్భుతమైన నటనతో మెప్పించాడు. ఆ తర్వాత ‘వాల్టర్ వెట్రివేల్’, ‘మిస్టర్ భరత్’, ‘మక్లక్ ఎన్ ఫాపా’, ‘నన్బన్’, ‘పీస్‌ఫుల్’, ‘రిక్షా మామా’, ‘బాహుబలి’, ‘కనా’, ‘పెరియార్’ వంటి చిత్రాలకు అతడికి హీరోగా స్టార్ డమ్ తెచ్చిపెట్టాయి.

సత్యరాజ్ తెలుగు ప్రేక్షకులకు సైతం సుపరిచితం. టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోలకు తండ్రిగా, తాతగా వైవిధ్యమైన పాత్రలు పోషించాడు. ఇక యంగ్ రెబల్ స్టార్ నటించిన బాహుబలి సినిమాలో కట్టప్ప పాత్రలో పాన్ ఇండియా నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ తరానికి కట్టప్ప పాత్రగానే ఫేమస్ అయ్యాడు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తున్నాడు సత్యరాజ్. ఇప్పుడు రజనీకాంత్ నటిస్తున్న ‘కూలీ’ చిత్రంలో నటిస్తున్నారు. అయితే సత్యరాజ్ గుండెల్లో అంతులేని బాధను మోస్తూ తన నటనతో ప్రేక్షకులను నవ్విస్తున్నారు. గత నాలుగేళ్లుగా వ్యక్తిగత జీవితంలోని తన బాధను బయటపెట్టకుండా సినిమాల్లో రాణిస్తున్నారు.

సత్యరాజ్ భార్య మహేశ్వరి గత 4 సంవత్సరాలుగా కోమాలో ఉన్నారట. ఈ విషయాన్ని ఆయన కుమార్తె దివ్య సత్యరాజ్ తన సోషల్ మీడియా ఖాతాలో తెలియజేస్తూ ఎమోషనల్ పోస్ట్ చేసింది. “నా తల్లి గత 4 సంవత్సరాలుగా కోమాలో ఉంది. ఆమెకు PEG ట్యూబ్ ద్వారా మాత్రమే ఆహారం అందిస్తున్నాము. మేము పూర్తిగా దిగ్ర్భాంతిలో ఉన్నాము.. కానీ ఆమె కోలుకుంటుంది అనే ఆశతోనే ఎదురుచూస్తున్నాము. అమ్మ మమ్నల్ని తిరిగి కలుస్తుంది. గత నాలుగేళ్లుగా మాకు అమ్మ, నాన్న అన్ని మా నాన్నే. మా నాన్న బెస్ట్ సింగిల్ పేరెంట్. కొన్నేళ్ల క్రితమే మా నాన్న తన తల్లిని కోల్పోయాడు. దీంతో నేను మా నాన్నకు సింగిల్ మామ్ గా ఉన్నాను. మాన నాన్న, నేను  ‘పవర్‌ఫుల్ సింగిల్ మామ్స్ క్లబ్’లో ఉన్నాము ” అంటూ రాసుకోచ్చింది. దీంతో సత్యరాజ్ వ్యక్తిగత జీవితంలోని బాధ తెలిసి చలించిపోతున్నారు అభిమానులు. సత్యరాజ్, మహేశ్వరి ఇద్దరూ 1979లో వివాహం చేసుకున్నారు. వీరికి సిబిరాజ్ అనే కుమారుడు, దివ్య అనే కుమార్తె  ఉన్నారు.

ఇది చదవండి : Arundhati movie: తస్సాదియ్యా.. అసలేం మారలేదు.. అరుంధతి డ్యాన్స్ టీచర్‏ను చూశారా..?

Tollywood: ఆ ఒక్క డైలాగ్‏తో నెట్టింట తెగ ఫేమస్.. ఈ యంగ్ హీరో సతీమణి ఎవరో గుర్తుపట్టారా.?

Pawan Kalyan: ఏంటీ బాస్.. మరీ అంత తక్కువా.. పవన్ కళ్యాణ్ ఫస్ట్ మూవీ రెమ్యునరేషన్ తెలిస్తే..

Samantha: సామ్ ఈజ్ బ్యాక్.. సిటాడెల్ కోసం ఎంత రెమ్యునరేషన్ తీసుకుందో తెలుసా.. ?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.