AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pawan Kalyan: ఏంటీ బాస్.. మరీ అంత తక్కువా.. పవన్ కళ్యాణ్ ఫస్ట్ మూవీ రెమ్యునరేషన్ తెలిస్తే..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ చిత్రీకరణకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ప్రస్తుతం ప్రజల సేవలో క్షణం తీరిక లేకుండా గడుపుతున్న పవన్.. త్వరలోనే వీలు చూసుకుని తన సినిమా షూటింగ్స్ కంప్లీట్ చేస్తానని గతంలోనే చెప్పారు. ఇదిలా ఉంటే.. పవన్ నెక్ట్స్ మూవీస్ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు.

Pawan Kalyan: ఏంటీ బాస్.. మరీ అంత తక్కువా.. పవన్ కళ్యాణ్ ఫస్ట్ మూవీ రెమ్యునరేషన్ తెలిస్తే..
Pawan Kalyan
Rajitha Chanti
|

Updated on: Nov 09, 2024 | 2:56 PM

Share

టాలీవుడ్ ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఆయన సినిమాలు వస్తున్నాయంటే రెండు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో పండగే. చాలా కాలంగా పవన్ సినిమాలు షూటింగ్స్ జరుగుతున్నాయి. కానీ ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు నిర్వర్తిస్తుండగా.. త్వరలోనే తన నెక్ట్స్ మూవీ చిత్రీకరణలో పాల్గొనున్నారు. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినీ ప్రయాణం స్టార్ట్ చేసిన పవన్.. తనదైన ప్రతిభతో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అతి తక్కువ సమయంలోనే బద్రి, తమ్ముడు, ఖుషి వంటి చిత్రాలతో స్టార్ డమ్ అందుకున్నాడు. ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోలలో ఒకరిగా మారారు. అలాగే సినీరంగంలో ఎక్కువగా ఫాలోయింగ్ ఉన్న హీరో పవన్ కావడం విశేషం. కానీ మీకు తెలుసా.. పవన్ కళ్యాణ్ ఫస్ట్ మూవీకి ఎంతగా రెమ్యునరేషన్ తీసుకున్నారో.

పవన్ కళ్యాణ్ మొదట్లో డైరెక్టర్ కావాలనుకున్నారట. కానీ వదిన సురేఖ మాటతో నటనపై వైపు అడుగులు వేశారు. 1996లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో వెండితెరకు హీరోగా పరిచయమయ్యాడు. ఈవీవీ డైరెక్ట్ చేసిన సినిమాలో నాగార్జున మేనకోడలు సుప్రియ యార్లగడ్డ కథానాయికగా నటించింది. ఖయామత్ సే ఖయామత్ అనే హిందీ సినిమాకు రీమేక్ గా వచ్చింది ఈమూవీ. అప్పట్లో ఈ చిత్రానికి మిశ్రమ స్పందన వచ్చింది. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మించారు.

అయితే తన ఫస్ట్ సినిమాకు పవన్ కళ్యాణ్ ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారో తెలుసా.. కేవలం రూ.50 వేలు మాత్రమే. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాకు పవన్ నెలవారీ జీతం తీసుకున్నాడట. అంటే నెలకు ఐదు వేలు మాత్రమే తీసుకున్నారట. అంటే సినిమా మొత్తం పూర్తయ్యేసరికి రూ.50 వేలు తీసుకున్నారట. ఈ విషయం తెలిసి ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం పవన్ తన ఒక్క సినిమాకు దాదాపు రూ.2 కోట్ల వరకు తీసుకుంటున్నారట. ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ, హరిహర వీరమల్లు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి.

ఇది చదవండి : Arundhati movie: తస్సాదియ్యా.. అసలేం మారలేదు.. అరుంధతి డ్యాన్స్ టీచర్‏ను చూశారా..?

Anshu Ambani: మతిపోగొట్టేస్తోన్న మన్మథుడు హీరోయిన్.. కొత్త ఫోటోలతో మెంటలెక్కిస్తోన్న అన్షు..

Tollywood: నడుమందాలతో తికమక పెట్టేస్తోన్న వయ్యారి.. హిట్టు కొట్టిన క్రేజీ హీరోయిన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..