AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: వార్నీ.. ఏందీ బాసూ ఈ అరాచకం.. పద్దతిగా ఉందనుకుంటే గ్లామర్ ఫోజులతో హీటెక్కిస్తోందిగా..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ మూవీ పనులలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ మూవీపై ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి. ఇటీవల విడుదలైన టీజర్ ఈ చిత్రంపై పాజిటివ్ బజ్ క్రియేట్ చేసింది. వచ్చే ఏడాది ఈ చిత్రం విడుదల కానుంది.

Tollywood: వార్నీ.. ఏందీ బాసూ ఈ అరాచకం.. పద్దతిగా ఉందనుకుంటే గ్లామర్ ఫోజులతో హీటెక్కిస్తోందిగా..
Pujitha Ponnada
Rajitha Chanti
|

Updated on: Nov 13, 2024 | 1:20 PM

Share

డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన పుష్ప 2 చిత్రం త్వరలోనే విడుదల కానుంది. డిసెంబర్ 5న ఈ సినిమా రిలీజ్ కానుండగా.. ప్రస్తుతం తన ప్రాజెక్ట్ ప్రమోషన్లలో బిజీగా ఉన్నాడు సుకుమార్. ఇదిలా ఉంటే.. ఈ డైరెక్టర్ కెరీర్ లో తెరెక్కించిన చిత్రాలన్ని సూపర్ హిట్. అందులో రంగస్థలం ఒకటి. ఈ మూవీ మెగా హీరో రామ్ చరణ్ కెరీర్ మలుపు తిప్పింది. ఇందులో చరణ్ యాక్టింగ్ గురించి చెప్పక్కర్లేదు. 1980 నేపథ్యంలో రూపొందించిన ఈ సినిమా 2018 మార్చి 30న విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. కేవలం చిరంజీవి వారసుడు అంటూ విమర్శిస్తున్న వారికి ఈ సినిమాతో గట్టి కౌంటర్ ఇచ్చాడు. అద్భుతమైన నటనతో తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. ఈ సినిమా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై వై రవి శంకర్, సివి మోహన్ నిర్మించగా.. దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. ఇక ఇందులో సమంత కథానాయికగా నటించగా.. మరో హీరో ఆది పినిశెట్టి కీలకపాత్రలో నటించారు. జగపతి బాబు, ప్రకాష్ రాజ్, అనసూయ ముఖ్య పాత్రలు పోషించగా.. అప్పట్లోనే ఈ సినిమా రూ.210 కోట్లు కలెక్షన్స్ రాబట్టింది.

ఈ మూవీలో ఆది పినిశెట్టికి ప్రేయసిగా కనిపించింది పూజిత పొన్నాడ. ఇందులో ఆమె కనిపించింది తక్కువ సమయమే కానీ.. ఆమె ప్రేమకథ చుట్టూనే చిట్టిబాబు కథ తిరుగుతుంది. ఈ సినిమాలో ఎంతో పద్దతిగా కనిపించిన పూజిత.. ఆ తర్వాత వేర్ ఈజ్ వెంకట లక్ష్మి, బ్రాండ్ బాబు, సెవెన్ చిత్రాల్లో నటించి మెప్పించింది. తాజాగా ఈ అమ్మడు సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోస్ చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్. ఒకప్పుడు సన్నజాజీలా ఉన్న పూజిత.. ఇప్పుడు కాస్త బొద్దుగా మారింది.

ఇవి కూడా చదవండి

పూజిత అచ్చ తెలుగమ్మాయి. ఏపీలోని విశాఖపట్నంకు చెందిన ఆమె.. ఇంజనీరింగ్ పూర్తి చేసి కొన్నాళ్లపాటు టాటా కన్సటెన్సీలో జాబ్ చేసింది. ఆ తర్వాత 2015లో ఉప్మా తినేసింది అనే షార్ట్ ఫిల్మ్ ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టింది. 2016లో తుంటరి సినిమాతో మొదటి సారి బిగ్ స్క్రీన్ పై కనిపించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఫోటోస్ వైరల్ అవుతున్నాయి.

ఇది చదవండి : Arundhati movie: తస్సాదియ్యా.. అసలేం మారలేదు.. అరుంధతి డ్యాన్స్ టీచర్‏ను చూశారా..?

Tollywood: ఆ ఒక్క డైలాగ్‏తో నెట్టింట తెగ ఫేమస్.. ఈ యంగ్ హీరో సతీమణి ఎవరో గుర్తుపట్టారా.?

Pawan Kalyan: ఏంటీ బాస్.. మరీ అంత తక్కువా.. పవన్ కళ్యాణ్ ఫస్ట్ మూవీ రెమ్యునరేషన్ తెలిస్తే..

Samantha: సామ్ ఈజ్ బ్యాక్.. సిటాడెల్ కోసం ఎంత రెమ్యునరేషన్ తీసుకుందో తెలుసా.. ?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.