Sanju Samson: అయ్యో పాపం! సంజూ కొట్టిన బంతి చెంపకు తగిలి విలవిల్లాడిన అమ్మాయి.. వీడియో వైరల్

దక్షిణాఫ్రికాతో జరిగిన ఆఖరి టీ20 మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 1 వికెట్ మాత్రమే కోల్పోయి 283 పరుగులు చేసింది. ఈ కఠినమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా జట్టు 18.2 ఓవర్లలో కేవలం 148 పరుగులకు ఆలౌటైంది.

Sanju Samson: అయ్యో పాపం! సంజూ కొట్టిన బంతి చెంపకు తగిలి విలవిల్లాడిన అమ్మాయి.. వీడియో వైరల్
Sanju Samson
Follow us
Basha Shek

|

Updated on: Nov 16, 2024 | 7:57 PM

భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య నాలుగు మ్యాచ్ ల టీ20 సిరీస్‌లో భాగంగ చివరి మ్యాచ్ శుక్రవారం (నవంబర 15) జోహన్నెస్‌బర్గ్‌లో జరిగింది. ఈ మ్యాచ్ ద్వారా సిరీస్ భవితవ్యం తేలాల్సి ఉండగా అందులో సంజూ శాంసన్ కీలక పాత్ర పోషించాడు. గత రెండు మ్యాచ్‌ల్లో సున్నాకే అవుటైన నిరాశను మిగిల్చిన ఈ భారత ఓపెనర్ మళ్లీ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. దక్షిణాఫ్రికా బౌలర్లను చితగ్గొట్టి మెరుపు సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్‌లో ఓపెనర్ గా రంగంలోకి దిగిన శాంసన్ కేవలం 56 బంతుల్లో 9 సిక్సర్లు, 6 ఫోర్లతో అజేయంగా 109 పరుగులు చేశాడు. అయితే ఈ మ్యాచ్ లో సంజూ శాంసన్ కొట్టిన ఒక బంతి నేరుగా వెళ్లి ఒక అమ్మాయి ముఖానికి తగిలింది. దీంతో బాధతో ఆ యువతి కాసేపు విలవిల్లాడిపోయింది. ఇది గమనించిన సంజూ శాంసన్ కూడా మైదానం నుంచి చేయి పైకెత్తి క్షమాపణలు కూడా చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతోంది.

భారత ఇన్నింగ్స్‌ 10వ ఓవర్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది. పార్ట్ టైమ్ స్పిన్నర్ ట్రిస్టన్ స్టబ్స్ బౌలింగ్ లో వరుసగా రెండు సిక్సర్లు బాదాడు సంజూ శాంసన్. అయితే అందులో ఒక బంతి స్టాండ్స్‌లో నిర్మించిన రెయిలింగ్‌కు డైరెక్ట్ గా తగిలింది. ఆ తర్వాత బౌన్స్ అయ్యి గ్యాలరీలో ఉన్న అమ్మాయి దవడకు బలంగా తగిలింది. దీంతో ఆ లేడీ ఫ్యాన్ నొప్పిని భరించలేక ఏడ్చేసింది. ఆమెకు వెంటనే ఐస్ ప్యాక్ ట్రీట్ మెంట్ ఇచ్చారు. దీంతో ఆ అమ్మాయి ఏడుపు ఆపింది. కాగా తాను కొట్టిన బంతికి అమ్మాయి గాయపడినట్లు తెలియగానే సంజూ వెంటనే క్ష‌మాప‌ణ‌లు కోరాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

వీడియో ఇదిగో…

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 1 వికెట్ మాత్రమే కోల్పోయి 283 పరుగులు చేసింది. సంజు మాత్రమే కాదు, మూడో స్థానంలో వచ్చిన తిలక్ వర్మ కూడా వరుసగా రెండో మ్యాచ్‌లో అద్భుత సెంచరీ సాధించాడు. తిలక్ 41 బంతుల్లో సెంచరీ పూర్తి చేసి, సంజుతో కలిసి 210 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు, దీంతో టీమ్ ఇండియా 283 పరుగులు చేసింది. ఈ కఠినమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా జట్టు 18.2 ఓవర్లలో 148 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత జట్టు 135 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో నాలుగు టీ20ల సిరీస్‌ను భారత జట్టు 3-1 తేడాతో కైవసం చేసుకుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

బిడ్డ కోసం మాతృ హృదయం తల్లడిల్లింది..!
బిడ్డ కోసం మాతృ హృదయం తల్లడిల్లింది..!
రామ్ చరణ్ దెబ్బతో ఇండస్ట్రీ రేంజ్, లెక్కలు మారిపోయినట్టే.!
రామ్ చరణ్ దెబ్బతో ఇండస్ట్రీ రేంజ్, లెక్కలు మారిపోయినట్టే.!
ఎప్పటినుంచో ఓకే నిర్మాణ సంస్థల్లో చిత్రాలు.. ఆ దర్శకులు ఎవరు.?
ఎప్పటినుంచో ఓకే నిర్మాణ సంస్థల్లో చిత్రాలు.. ఆ దర్శకులు ఎవరు.?
'ఫ్యాన్స్ ముసుగులో అభ్యంతరకర పోస్టులు'.. అల్లు అర్జున్ వార్నింగ్
'ఫ్యాన్స్ ముసుగులో అభ్యంతరకర పోస్టులు'.. అల్లు అర్జున్ వార్నింగ్
గర్భిణీలు మటన్ లివర్ తింటే ఏమవుతుంది? వైద్యులు ఏం చెబుతున్నారు?
గర్భిణీలు మటన్ లివర్ తింటే ఏమవుతుంది? వైద్యులు ఏం చెబుతున్నారు?
APSCHE ఛైర్మన్‌గా మధుమూర్తి.. లెక్కకుమించి సవాళ్లు పరిష్కరించేనా?
APSCHE ఛైర్మన్‌గా మధుమూర్తి.. లెక్కకుమించి సవాళ్లు పరిష్కరించేనా?
పెళైన 12 రోజులకు ప్రాణాలు కోల్పోయిన యువకుడు!
పెళైన 12 రోజులకు ప్రాణాలు కోల్పోయిన యువకుడు!
2024లో సీక్వెల్స్.. హిట్టా.? ఫట్టా.? ఆ ట్రెండ్ మారిందా.!
2024లో సీక్వెల్స్.. హిట్టా.? ఫట్టా.? ఆ ట్రెండ్ మారిందా.!
ఊపిరి బిగపట్టేలా చేసే ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్.. ఇప్పుడు ఓటీటీలో
ఊపిరి బిగపట్టేలా చేసే ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్.. ఇప్పుడు ఓటీటీలో
హుండీలో పడిపోయిన ఐఫోన్.. దేవుడికే చెందుతుందంటున్న అధికారులు
హుండీలో పడిపోయిన ఐఫోన్.. దేవుడికే చెందుతుందంటున్న అధికారులు
బిడ్డ కోసం మాతృ హృదయం తల్లడిల్లింది..!
బిడ్డ కోసం మాతృ హృదయం తల్లడిల్లింది..!
2024లో సీక్వెల్స్.. హిట్టా.? ఫట్టా.? ఆ ట్రెండ్ మారిందా.!
2024లో సీక్వెల్స్.. హిట్టా.? ఫట్టా.? ఆ ట్రెండ్ మారిందా.!
భారీగా తగ్గిన హీరోయిన్స్ రెమ్యునరేషన్.. కారణం అదేనా.? వీడియో
భారీగా తగ్గిన హీరోయిన్స్ రెమ్యునరేషన్.. కారణం అదేనా.? వీడియో
హిట్టా.? ఫట్టా.? అల్లరి నరేష్ నటవిశ్వరూపం బచ్చల మల్లి లో చూసారా.!
హిట్టా.? ఫట్టా.? అల్లరి నరేష్ నటవిశ్వరూపం బచ్చల మల్లి లో చూసారా.!
అల్లు అర్జున్‌ ఏమైనా భగవత్ స్వరూపుడా.?|సినిమా వాళ్లకు సీఎం రేవంత్
అల్లు అర్జున్‌ ఏమైనా భగవత్ స్వరూపుడా.?|సినిమా వాళ్లకు సీఎం రేవంత్
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..
వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..
హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ
హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ