AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jani Master: జైలు నుంచి బెయిల్‌పై బయటకు వచ్చిన జానీ మాస్టర్ ఇప్పుడేం చేస్తున్నాడో తెలుసా? ఫోటోస్ వైరల్

లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన ప్ర‌ముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్ట‌ర్ ప్ర‌స్తుతం బెయిల్ మీద బ‌య‌ట‌ ఉన్నాడు. ఈ కేసులో రిమాండ్ ఖైదీగా 37 రోజులు జైలు జీవితం గ‌డిపిన జానీ మాస్ట‌ర్‌కు రంగారెడ్డి జిల్లా కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.

Jani Master: జైలు నుంచి బెయిల్‌పై బయటకు వచ్చిన జానీ మాస్టర్ ఇప్పుడేం చేస్తున్నాడో తెలుసా? ఫోటోస్ వైరల్
Jani Master
Basha Shek
|

Updated on: Nov 15, 2024 | 9:20 PM

Share

తన దగ్గర పని చేసే ఓ లేడీ కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్నాడు జానీ మాస్టర్. ఈ కేసులో అరెస్టైన అతను 37 రోజులు జైలు జీవితం కూడా గడిపాడు. ఆ తర్వాత రంగా రెడ్డి జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో బయటకు వచ్చాడు. కాగా జైలు నుంచి విడుదలయ్యాక పెద్దగా బయట కనిపించడం లేదు జానీ మాస్టర్. ఎక్కువగా తన కుటుంబ సభ్యులతోనే సమయం గడుపుతున్నాడు. ఆ మధ్యన తన భార్య, పిల్లలతో కలిసి నెల్లూరుకు వెళ్లిపోయిన అతను అక్కడే దీపావళి పండగను సెలబ్రేట్ చేసుకున్నాడు. అయితే మ‌ళ్లీ తాను ఎప్పుడు జైలుకు వెళతానో తెలియదు కాబట్టి ఉన్న సమయంలోనే త‌న కుటుంబంతో జాలీగా గడిపేస్తున్నాడీ స్టార్ కొరియోగ్రాఫర్. ఈ క్ర‌మంలోనే తాజాగా జానీ మాస్ట‌ర్ తన ఫ్యామిలీతో కలిసి టూర్‌కి వెళ్లిన‌ట్లు తెలుస్తుంది. ఈ విష‌యాన్ని జానీ సోషల్ మీడియా వేదిక‌గా పంచుకున్నాడు. అందులో త‌న భార్య, పిల్ల‌ల‌తో క‌లిసి బీచ్ ద‌గ్గ‌ర దిగిన ఫొటోలు షేర్ చేయగా, ప్ర‌స్తుతం అవి సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. వీటిని చూసిన అభిమానులు, నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు.

అంతకు ముందు నెల్లూరులోని తన సొంతూరులో తన భార్య, పిల్లలతో కలిసి దీపావళి పండుగను ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నాడు జానీ మాస్టర్. ఆ ఫొటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ‘వాళ్ల కేరింతలే మన సంతోషం.. ఈ పండుగ నాడు మీరు వెలిగించే ప్రతి బాణాసంచాలాంటి చిరునవ్వులు, మిఠాయిల్లాంటి మధురమైన క్షణాలు మీ జీవితంలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ దీపావళి’ అని రాసుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి

భార్య, పిల్లలతో జానీ మాస్టర్..

కాగా పోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కోవడంతో కమిటీ జానీ మాస్టర్ కు వచ్చిన జాతీయ అవార్డును సైతం నిలిపివేసింది అవార్డుల కమిటీ. దీనిని చాలామంది ప్రముఖులు తప్పుపట్టారు. అలాగే పుష్ప 2 సినిమాలోనూ కొరియోగ్రాఫర్ అవకాశం కోల్పోయాడు జానీ మాస్టర్. మొత్తానికి ఈ కేసుతో అటు పర్సనల్ ఇటు ప్రొఫెషనల్ లైఫ్ పరంగానూ ఇబ్బందుల్లో పడ్డాడీ స్టార్ కొరియోగ్రాఫర్.

భార్య, పిల్లలతో జానీ మాస్టర్ దీపావళి వేడుకలు.. ఫొటోస్ ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
రైల్వేశాఖ కీలక నిర్ణయం.. అన్ని రైల్వే స్టేషన్లలో..
రైల్వేశాఖ కీలక నిర్ణయం.. అన్ని రైల్వే స్టేషన్లలో..
కాకినాడ చిన్నారి మిస్సింగ్‌ కేసులో ట్విస్ట్.. 3రోజు తర్వాత..
కాకినాడ చిన్నారి మిస్సింగ్‌ కేసులో ట్విస్ట్.. 3రోజు తర్వాత..
చేసింది అన్నీ విలన్ పాత్రలే.. అయినా క్రేజ్ ఎక్కువే..
చేసింది అన్నీ విలన్ పాత్రలే.. అయినా క్రేజ్ ఎక్కువే..
ఫ్రెండ్స్ నుంచి డబ్బులు తీసుకుంటున్నారా..? ఐటీ రూల్స్ ఇవే..
ఫ్రెండ్స్ నుంచి డబ్బులు తీసుకుంటున్నారా..? ఐటీ రూల్స్ ఇవే..
సిండికేట్ ఉచ్చులో రొయ్య సాగు.. దిక్కుతోచని స్థితిలో ఆక్వా రైతు
సిండికేట్ ఉచ్చులో రొయ్య సాగు.. దిక్కుతోచని స్థితిలో ఆక్వా రైతు
చిన్నప్పుడు చాలా అల్లరి పిల్లోడు.. ఇప్పుడు పాన్ ఇండియా హీరో..
చిన్నప్పుడు చాలా అల్లరి పిల్లోడు.. ఇప్పుడు పాన్ ఇండియా హీరో..
మరణం తర్వాత ఆత్మ ఎక్కడికి వెళుతుంది? గరుడ పురాణం చెప్పిన..
మరణం తర్వాత ఆత్మ ఎక్కడికి వెళుతుంది? గరుడ పురాణం చెప్పిన..
జీలకర్ర నీరు లేదా వాము నీరు.. ఖాళీ కడుపుతో తాగేందుకు ఏది బెస్ట్..
జీలకర్ర నీరు లేదా వాము నీరు.. ఖాళీ కడుపుతో తాగేందుకు ఏది బెస్ట్..
ఆరోగ్యంగా ఉండటానికి ఏసీ టెంపరేచర్ ఎంత ఉండాలంటే!
ఆరోగ్యంగా ఉండటానికి ఏసీ టెంపరేచర్ ఎంత ఉండాలంటే!
అతడు పెద్ద హీరో.. కానీ నాతో ఆ మాట చెప్పడంతో షాకయ్యా..
అతడు పెద్ద హీరో.. కానీ నాతో ఆ మాట చెప్పడంతో షాకయ్యా..