Pushpa 2: ఆర్‌ఆర్‌ఆర్ రికార్డు బ్రేకయ్యేలా ఉందిగా.. పుష్ప 2 రన్ టైమ్ ఏకంగా అన్ని గంటలా?

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తోన్న నాలుగో సినిమా పుష్ఫ 2. సుమారు మూడేళ్ల క్రితం రిలీజై సంచలనం సృష్టించిన పుష్ఫ సినిమాకు ఇది సీక్వెల్ గా తెరకెక్కుతోంది. డిసెంబర్ 5న ఈ పాన్ ఇండియా సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

Pushpa 2: ఆర్‌ఆర్‌ఆర్ రికార్డు బ్రేకయ్యేలా ఉందిగా.. పుష్ప 2 రన్ టైమ్ ఏకంగా అన్ని గంటలా?
Pushpa 2 Movie
Follow us
Basha Shek

|

Updated on: Nov 14, 2024 | 9:47 PM

అల్లు అర్జున్ నటిస్తోన్ పుష్ప 2 సినిమా రిలీజ్ కోసం టాలీవుడ్ తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పుష్ప 1 భారీ విజయం సాధించిన నేపథ్యంలో.. పుష్ప 2 పై అంచనాలు పెరిగిపోయాయి. దీనికి తోడు ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన గ్లింప్స్, పోస్టర్, టీజర్లకు ఊహించని రెస్పాన్స్ రావడంతో అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇక రిలీజ్ కు ముందే పుష్ప 2 సినిమా ఎన్నో రికార్డులను బ్రేక్ చేసింది. ప్రి రీలీజ బిజినెస్ పరంగానూ నయా రికార్డులు నమోదు చేసింది. ఈ క్రమంలోనే రన్ టైం విషయంలోనూ పుష్ప 2 మూవీ ఒక కొత్త రికార్డును సృష్టించే అవకాశముందని తెలుస్తోంది. ఇప్పటివరకు ఎడిటింగ్ పూర్తి చేసిన కాపీ నిడివి ప్రకారం పుష్ఫ 2 మూవీ రన్ టైం దాదాపు 3 గంటల 15 నిమిషాల వరకు వచ్చిందట. ఇందులోకి ఇంకా రెండు పాటలతో పాటు , కొంత ప్యాచ్ వర్క్ కూడా జోడించాల్సి ఉందట. ఇలా అన్నీ కలిపితే పుష్ఫ 2 రన్ టైమ్ సుమారు 3 గంటల 40 నిమిషాల వరకు ఉండవచ్చని తెలుస్తోంది. ఒక వేళ ఎడిటింగ్ లో ఎంత కట్ చేసినా.. కనీసం 3 గంటలు లేదా మూడు గంట‌ల ప‌ది నిమిషాలపైనే నిడివి ఉండే అవకాశముందట. ఈ లెక్కన చూసుకుంటే రాజమౌళి తెరకెక్కించిన ఆర్‌ఆర్ఆర్‌ మూవీ రన్ టైం ను పుష్ఫ 2 సినిమా అధిగమించనున్నట్లు తెలుస్తోంది.

కాగా గతంలో పుష్ప1 కూడా దాదాపు మూడు గంటల రన్ టైమ్ తో రిలీజై సంచలన విజయం సాధించింది. ఇప్పుడు పుష్ప 2 కూడ దాదాపు 3 గంట‌ల ప‌ది నిమిషాల ర‌న్‌టైమ్‌తో ఆడియెన్స్ ముందుకు రానుందని తెలుస్తోంది. అంటే తెలుగు సినిమా చరిత్రలో హ‌య్యెస్ట్ ర‌న్‌టైమ్ మూవీస్‌లో ఒక‌టిగా పుష్ప 2 ఉండనుందని సమాచారం. కాగా ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న పుష్ఫ 2 సినిమా డిసెంబర్ 05న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. డిసెంబర్ 17న ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ ను బిహార్ రాజధాని పాట్నాలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

బిహార్ లో పుష్ప 2 ట్రైలర్ లాంఛ్ ఈవెంట్..

డిసెంబర్ 05న గ్రాండ్ రిలీజ్..

.మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వాడీవేడిగా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. లైవ్ వీడియో
వాడీవేడిగా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. లైవ్ వీడియో
రూ.4 కే వేడి వేడి చికెన్ బిర్యానీ.. భారీగా క్యూ.! వీడియో
రూ.4 కే వేడి వేడి చికెన్ బిర్యానీ.. భారీగా క్యూ.! వీడియో
ఆధార్‌పై బిగ్ అప్‌డేట్.! ఆధార్ అప్ డేట్ పై ఎక్స్‌లో ఉడాయ్ కీలక..
ఆధార్‌పై బిగ్ అప్‌డేట్.! ఆధార్ అప్ డేట్ పై ఎక్స్‌లో ఉడాయ్ కీలక..
అనాథలా పెరిగిన కోటీశ్వరుడు! సీన్ కట్ చేస్తే.. 26 ఏళ్లు తరువాత..
అనాథలా పెరిగిన కోటీశ్వరుడు! సీన్ కట్ చేస్తే.. 26 ఏళ్లు తరువాత..
కొండచిలువ చుట్టేయడంతో ఊపిరాడక విలవిల్లాడిన సింహం.. వీడియో.
కొండచిలువ చుట్టేయడంతో ఊపిరాడక విలవిల్లాడిన సింహం.. వీడియో.
90 లక్షల మందిని కట్టిపడేసిన గున్న ఏనుగు ప్రేమ.. వీడియో వైరల్.
90 లక్షల మందిని కట్టిపడేసిన గున్న ఏనుగు ప్రేమ.. వీడియో వైరల్.
రూ. 13 లక్షలతో సినిమా.. రూ. 1,647 కోట్లు కొల్లగొట్టింది.!
రూ. 13 లక్షలతో సినిమా.. రూ. 1,647 కోట్లు కొల్లగొట్టింది.!
స్పెర్మ్‌తో ఫేషియల్‌.! ఛీ ఛీ కాదు.. అసలు రహస్యం వేరే..!
స్పెర్మ్‌తో ఫేషియల్‌.! ఛీ ఛీ కాదు.. అసలు రహస్యం వేరే..!
హనీమూన్‌ నుండి తిరిగి వస్తుండగా విషాదం.. కొత్త జంట మృతి.!
హనీమూన్‌ నుండి తిరిగి వస్తుండగా విషాదం.. కొత్త జంట మృతి.!
చుట్టూ నీరు.. కొండ పైన స్వామి.! దర్శనం కోసం సాహసం చేయాల్సిందే.!
చుట్టూ నీరు.. కొండ పైన స్వామి.! దర్శనం కోసం సాహసం చేయాల్సిందే.!