Sangeetha: నటి సంగీత ఫ్యామిలీని చూశారా? కూతురు ఎంత క్యూట్‌గా ఉందో.. అచ్చం అమ్మలాగే..

ఖడ్గం సినిమాతో టాలీవుడ్ లో బాగా ఫేమస్ అయ్యింది హీరోయిన్ సంగీత. సినిమా కూడా సూపర్ హిట్ కావడంతో ఈ అందాల తారకు అవకాశాలు విపరీతంగా వచ్చాయి. స్టార్ హీరోలతో కలిసి సూపర్ హిట్ సినిమాల్లో నటించిన సంగీత ఇప్పుడు కూడా సహాయక నటిగా కూడా మెప్పిస్తోంది.

Sangeetha: నటి సంగీత ఫ్యామిలీని చూశారా? కూతురు ఎంత క్యూట్‌గా ఉందో.. అచ్చం అమ్మలాగే..
Sangeetha
Follow us
Basha Shek

|

Updated on: Nov 14, 2024 | 9:19 PM

తమిళనాడు లోని చెన్నై ప్రాంతానికి చెందిన సంగీత 1997లోనే సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. మలయాళం, కన్నడ, తమిళ భాషల్లో కొన్ని సినిమాలు చేసింది. తెలుగులోనూ చేసినా పెద్దగా గుర్తింపు రాలేదు. 2002లో కృష్ణవంశీ తెరకెక్కించిన ఖడ్గం సినిమా సంగీత కెరీర్ కు మంచి బూస్ట్ ఇచ్చింది. ఇందులో సీతామహాలక్ష్మి అనే పల్లెటూరి అమ్మాయి పాత్రలో సంగీత అభినయం అందరినీ ఆకట్టుకుంది. ఈ సినిమాలో హైలెట్ అయ్యిన పాత్రలలో సంగీతది కూడా ఒకటి. ఈ సినిమా తర్వాత సంగీతకు తెలుగులో అవకాశాలు కూడా బాగా వచ్చాయి. పెళ్లాం ఊరెళితె, ఈ అబ్బాయి చాలా మంచోడు, ఆయుధం, ఓరి నీ ప్రేమ బంగారంగానూ, శివపుత్రుడు, నేను పెళ్లికి రెడీ, టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్, విజయేంద్ర వర్మ, ఖుషీఖుషీగా, సంక్రాంతి తదితర సినిమాలతో తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువైపోయిందీ అందాల తార. అయితే హీరోయిన్ గా సినిమా కెరీర్ పీక్స్ లో ఉండగానే సంగీత పెళ్లి చేసుకుంది. 2009లో తమిళ గాయకుడు క్రిష్ ను సంగీత వివాహం చేసుకుంది. తిరువన్నమలైలోని అరుణాచలేశ్వర ఆలయంలో వీరి వివాహం జరిగింది.

పెళ్లి, పిల్లల తర్వాత కాస్త సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సంగీత కొన్ని నెలల క్రితం సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో హీరోయిన్‌ రష్మికకు తల్లిగా నవ్వులు పూయించింది. అలాగే మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఆచార్య’ సినిమాలో ఓ పాటలో తళుక్కున మెరిసింది. దళపతి విజయ్ హీరోగా వచ్చిన ‘వారసుడు’ సినిమాలోనూ కీలక పాత్ర పోషించింది. అలాగే విజయ్ ఆంటోని సినిమా తమిళరాసన్ (తెలుగులో విక్రమ్ రాథోడ్) సినిమాలోనూ కనిపించింది. ఇక టాలీవుడ్ బుల్లితెరపై కూడా సందడి చేస్తోంది సంగీత. జబర్దస్త్, శ్రీదేవీ డ్రామా కంపెనీ టీవీ షోల్లోనూ తళుక్కుమంటోంది.

ఇవి కూడా చదవండి

కూతురుతో సంగీత..

సంగీత, క్రిష్ దంపతులకు శివ్హియ అనే కూతురు ఉంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సంగీత అప్పుడప్పుడు భర్త, కూతురితో కలిసి దిగిన ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తుంటుంది. ఇక పండగల సమయంలోనూ కూతురితో తీసుకున్న ఫొటోలను సంగీత పోస్ట్ చేస్తూ ఉంటుంది. వీటిని చూసిన నెటిజన్లు క్యూట్ ఫ్యామిలీ అంటూ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

భర్త, కూతురితో నటి సంగీత..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సాలంగాపూర్ హనుమాన్ ఆలయంలో ఆసక్తికర ఘటన! హెలికాప్టర్‌ను ఆపి అక్కడే
సాలంగాపూర్ హనుమాన్ ఆలయంలో ఆసక్తికర ఘటన! హెలికాప్టర్‌ను ఆపి అక్కడే
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్‌.! పిఠాపురం ప్రజలు ఫుల్ హ్యాపీ.!
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్‌.! పిఠాపురం ప్రజలు ఫుల్ హ్యాపీ.!
జాకీర్‌ హుస్సేన్‌ ‘వాహ్‌ తాజ్‌’ వెనుక కథేంటంటే.? ఒక్క యాడ్‌ తో..
జాకీర్‌ హుస్సేన్‌ ‘వాహ్‌ తాజ్‌’ వెనుక కథేంటంటే.? ఒక్క యాడ్‌ తో..
టీ కొట్టు మాటున గుట్టుచప్పుడు యవ్వారం.. ఎంక్వయిరీ చేయగా
టీ కొట్టు మాటున గుట్టుచప్పుడు యవ్వారం.. ఎంక్వయిరీ చేయగా
రోజూ గుప్పెడు తింటే ఇన్ని లాభాలా.? తెలిస్తే అసలు వదిలిపెట్టరు..
రోజూ గుప్పెడు తింటే ఇన్ని లాభాలా.? తెలిస్తే అసలు వదిలిపెట్టరు..
ఎవరికైనా బిచ్చం వేస్తున్నారా.! ఇక మీ పైనా కేసు తప్పదు.!
ఎవరికైనా బిచ్చం వేస్తున్నారా.! ఇక మీ పైనా కేసు తప్పదు.!
హలో.. ఎక్స్‌క్యూజ్‌మీ.. సైడ్‌ ప్లీజ్‌.! ఏనుగు సిగ్నల్స్ మాములుగా
హలో.. ఎక్స్‌క్యూజ్‌మీ.. సైడ్‌ ప్లీజ్‌.! ఏనుగు సిగ్నల్స్ మాములుగా
వరినాట్లు వేయడానికి వచ్చి బిత్తరపోయిన రైతు.. కనిపించింది చూడగా
వరినాట్లు వేయడానికి వచ్చి బిత్తరపోయిన రైతు.. కనిపించింది చూడగా
ఆరేళ్ల తరువాత హైదరాబాద్ ఎందుకు ఇలా వణుకుతోంది.? వీడియో..
ఆరేళ్ల తరువాత హైదరాబాద్ ఎందుకు ఇలా వణుకుతోంది.? వీడియో..
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీని వదలని వర్షాలు.!
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీని వదలని వర్షాలు.!