Unstoppable S4: గోవాలో ఆ స్పెషల్ పర్సన్ కోసం స్వయంగా వైన్ బాటిల్ కొన్న అల్లు అర్జున్.. సీక్రెట్ చెప్పేశాడు

నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తోన్న టాక్ షో.. అన్ స్టాపబుల్ విత్ ఎన్‌బీకే. ఆహాలో స్ట్రీమింగ్ అయ్యే ఈ టాక్ షో ఇప్పటికే సక్సెస్ ఫుల్ గా మూడు సీజన్లు పూర్తి చేసుకుంది. ఇప్పుడు నాలుగో సీజన్ రన్ అవుతోంది. తాజాగా ఈ అన్ స్టాపబుల్ షోకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అతిథిగా విచ్చేశాడు.

Unstoppable S4: గోవాలో ఆ స్పెషల్ పర్సన్ కోసం స్వయంగా వైన్ బాటిల్ కొన్న అల్లు అర్జున్.. సీక్రెట్ చెప్పేశాడు
Balakrishna, Allu Arjun
Follow us
Basha Shek

|

Updated on: Nov 13, 2024 | 10:51 PM

నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తోన్న ఆహా అన్ స్టాపబుల్ సీజన్ 4 సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సీజన్ లో ఇప్పటికే మూడు సీజన్స్ పూర్తయ్యాయి. మొదటి ఎపిసోడ్‌కు ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు, రెండో ఎపిసోడ్‌కు దుల్క‌ర్ స‌ల్మాన్‌, మూడో ఎపిసోడ్‌కు హీరో సూర్య‌లు అతిథులుగా వ‌చ్చారు. ఈ ఎపిసోడ్స్ అన్నింటికీ ఊహించని రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా నాలుగో ఎపిసోడ్‌కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అతిథిగా వచ్చారు. అతనితో పాటు తల్లి నిర్మలమ్మ కూడా ఈ షోలో సందడి చేశారు. పుష్ప 2 మూవీ ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా అన్ స్టాపబుల్ షోకు వచ్చిన అల్లు అర్జున్ తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. జాతీయ అవార్డు అందుకోవడం, మెగా ఫ్యామిలీతో సంబంధాలు ఇలా పలు విషయాలపై ఓపెన్ అయ్యాడు బన్నీ. తాజాగా ఈ ఎపిసోడ్ కు సంబంధించి వరుసగా ప్రోమోలు రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. కాగా గతంలో అల్లు అర్జున్ గోవాలో ఆల్కహాల్ కొన్నట్టు వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే  ఫొటోని అన్‌స్టాపబుల్ షోలో అల్లు అర్జున్ కు మరోసారి చూపించారు బాలయ్య. ‘ఎవరికోసం నువ్వే స్వయంగా వెళ్లి ఆల్కహాల్ కొన్నావు’ అని బన్నీని అడిగాడు బాలయ్య. దీనికి బన్నీ..ఒక స్పెషల్ పర్సన్ కోసం ప్రత్యేకంగా తానే వెళ్లి ఆల్కహాల్ బాటిల్ తెచ్చినట్టు చెప్పుకొచ్చాడు. అయితే ఆ స్పెషల్ పర్సన్ అన్నది మాత్రం ప్రోమోలో చూపించలేదు. మరి ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవాలంటే నవంబర్ 14 రాత్రి నుండి ఆహాలో స్ట్రీమింగ్ కానున్న అన్‎స్టాపబుల్‌ విత్ NBK షో అల్లు అర్జున్ ఎపిసోడ్ చూడాల్సిందే.

కాగా అల్లు అర్జున్ ఎవరి కోసమైతే స్వయంగా వైన్ షాపుకి ఆ ఆల్కహాల్ కొన్నారో ఆ వ్యక్తి కూడా ఈ షోలో సందడి చేయనున్నారట. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతోంది. అల్లు అర్జున్ అంతగా అభిమానించే ఆ స్పెషల్ పర్సన్ ఎవరబ్బా? అంటూ అభిమానులు, నెటిజన్లు తమకు తోచిన వ్యక్తుల పేర్లను కామెంట్స్ గా పెడుతున్నారు.

ఇవి కూడా చదవండి

అన్ స్టాపబుల్ లో బాలయ్య, అల్లు అర్జున్..

బాలయ్య అన్ స్టాపబుల్   ప్రోమో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వారిని ఢీకొట్టిన వాహనం.. ముగ్గురు మృతి
ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వారిని ఢీకొట్టిన వాహనం.. ముగ్గురు మృతి
పోడియంలోనూ త్రిల్లింగ్ ఇన్సిడెంట్స్.. లైవ్ మ్యాచ్‌లో ఏంజరిగిందంటే
పోడియంలోనూ త్రిల్లింగ్ ఇన్సిడెంట్స్.. లైవ్ మ్యాచ్‌లో ఏంజరిగిందంటే
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
డెడ్ బాడీ ఇంటికి డోర్ డెలివరీ కేసులో కీలక విషయాలు
డెడ్ బాడీ ఇంటికి డోర్ డెలివరీ కేసులో కీలక విషయాలు
ఓ యువ రైతు వినూత్న ఆలోచన.. విద్యుత్ కాంతుల మధ్య చామంతి సాగు..
ఓ యువ రైతు వినూత్న ఆలోచన.. విద్యుత్ కాంతుల మధ్య చామంతి సాగు..
పుష్ప 2 మూవీ క్లైమాక్స్.. థియేటర్‌లోకి పోలీసుల ఎంట్రీ! ఆ తర్వాత
పుష్ప 2 మూవీ క్లైమాక్స్.. థియేటర్‌లోకి పోలీసుల ఎంట్రీ! ఆ తర్వాత
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
సఫల ఏకాదశి వ్రతం మహత్యం.. పూజ శుభ సమయం? విధానం ఏమిటంటే..
సఫల ఏకాదశి వ్రతం మహత్యం.. పూజ శుభ సమయం? విధానం ఏమిటంటే..
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!