Pushpa 2: పుష్ప-2 రన్ టైమ్ ఎంతో తెలుసా ??
పుష్ప 2 విడుదలకు మరికొద్ది రోజులు మాత్రమే ఉంది. అల్లు ఆర్మీ ఈ సినిమా కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తోం. పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్ నవంబర్ 17న విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బంపర్ వసూళ్లు సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. మొదటి భాగం ఘనవిజయం సాధించడంతో.. ఇప్పుడు పుష్ప 2 పై అంతకు మించి అంచనాలు నెలకొన్నాయి.
పుష్ప సినిమా అల్లు అర్జున్‌ని పాన్ ఇండియా స్టార్‌గా మార్చింది. బన్నీ డ్యాన్స్, డైలాగ్స్ అలాగే యాక్షన్ ప్రేక్షకుల చేత విజిల్స్ కొట్టించాయి. అల్లు అర్జున్ ‘పుష్ప 2’ సినిమా అద్భుతంగా ఉండబోతోందని తెలుస్తోంది. ఈ సినిమా తొలిరోజు దాదాపు 270 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టే అవకాశం ఉందని అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. ఇదే జరిగితే ఇండస్ట్రీ రికార్డ్స్ బ్రేక్ అవుతాయి.. ఇప్పటి వరకు ఏ భారతీయ సినిమా కూడా ఇంత పెద్ద ఓపెనింగ్స్‌ని రాబట్టలేదు. హిందీలో కూడా ఈ సినిమా మంచి వసూళ్లను రాబడుతుందని అంచనా వేస్తున్నారు. హిందీ వెర్షన్ లోనే 500 కోట్లకు పైగా కలెక్షన్లు వస్తాయన్న అంచనాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు పుష్ప 2 రన్ టైం గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇప్పటికే పాన్ ఇండియా సినిమాలు భారీ రన్ టైం తో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇప్పుడు పుష్ప సినిమా కూడా భారీ రన్ టైం తో ఉంటుందని టాక్. కాగా ఇప్పటికే ఎడిటింగ్ చేసిన కాపీ రన్ టైమే మూడు గంటల 15 నిమిషాలు వచ్చిందని అంటున్నారు. కానీ ఇంకా కొన్ని సీన్స్, ఓ సాంగ్ యాడ్ చేయాల్సి ఉందట. అవి కూడా యాడ్ చేస్తే ఈ సినిమా రన్ టైం ముడున్నర గంటలు దాటి పోతుందని అంటున్నారు. ఎంత ఎడిట్ చేసినా ఈ సినిమా 3 గంటల పైనే ఉంటుందని టాక్. మరి ఈవార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ లో అందాల భామ శ్రీలీల నటిస్తోంది. బన్నీ, శ్రీలీల స్టెప్పులకు థియేటర్స్ దద్దరిళ్లడం ఖాయం.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అమ్మాయిగా మారిన క్రికెటర్ !! ప్రస్తుతం తన పరిస్థితి ??
నిద్రలోకి జారుకోవడానికి మిలిటరీ టెక్నిక్ !!
లారీ కింద ఇరుక్కున్న యువతి.. జాకీలు తెప్పించి రక్షించిన బండి సంజయ్
రోడ్డుపై నోట్ల కట్టలు.. కళ్లు చెదిరే ఆ మొత్తాన్ని చూసి..
18 సార్లు లాటరీ కొట్టినా. ‘నా అసలైన జాక్‌పాట్ నా భార్యే’
పిస్టళ్లతో వచ్చిన దొంగలకు లేడీ షాక్.. చుక్కలు చూపించిన మహిళ
పిల్లల కోసం ప్రాణాలకే తెగించిన తల్లి
10 లక్షలు పెట్టి లీక్ పేపర్ కొన్నా.. నీట్లో 720కి 107 మార్కులే !
అమెరికాలో 5కే ఆఫీస్ ఖాళీ.. ఇండియాలో 10వరకు పని!
ఐదు రోజుల్లో.. నలుగురు శిశువులకు జననం..
లెక్కల టీచర్ సొంత ఖర్చుతో.. విమానమెక్కిన విద్యార్థులు
అమ్మ బుచ్చి.. నీకోమో 30 కోట్లు.. హీరోకేమో 100 కోట్లా..
నిద్రపోతున్న సింహాన్ని లేపొద్దు.. జయం రవికి భార్య ఆర్తి కౌంటర్
ప్రేమ ఒప్పుకోలేదని.. కెనెడా నుంచి వచ్చి సింగర్‌ను చంపేసిన వ్యక్తి
'నా కాపురంలో నిప్పులు పోసింది ఈమె!' హీరో ఆరోపణపై ఖుష్బూ రియాక్షన్

