పొద్దున్నే గోరువెచ్చని నీళ్లు తాగండి.. ఫలితం మీరే చూడండి
సాధారణంగా మనిషి ఆరోగ్యానికి నీరు చాలా అవసరం. తగినంత నీరు తాగితే ఎన్నో అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. అందుకే ప్రతిరోజూ ఆరోగ్య పరిస్థితిని బట్టి 3 నుంచి 4 లీటర్లకు నీరు తాగాలని వైద్య నిపుణులు సూచిస్తుంటారు. అయితే రోజూ ఉదయాన్నే పరగడుపున ఒక గ్లాసుడు గోరువెచ్చని నీళ్లు తాగితే ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
జీర్ణ వ్యవస్థ మొదలుకుని మొత్తంగా శరీర ఆరోగ్యానికి ఇది ఎంతో దోహదపడుతుందంటున్నారు. ఉదయాన్నే గోరు వెచ్చని నీళ్లు తాగితే జీర్ణ వ్యవస్థ ఉత్తేజితం అవుతుంది. జీర్ణాశయంలో మిగిలిపోయిన ఆహారం ఏదైనా ఉంటే.. త్వరగా జీర్ణమై కడుపు ఖాళీ అవుతుంది. తర్వాత ఆహారం తీసుకున్నప్పుడు బాగా అరగడానికి ఇది తోడ్పడుతుంది. ముఖ్యంగా అజీర్తి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు ఉన్నవారికి ఇది చాలా మేలు చేస్తుంది. శరీరంలో జీవక్రియల్లో భాగంగా పలు వ్యర్థ, విషపూరిత పదార్థాలు ఉత్పన్నం అవుతాయి. ఉదయమే గోరువెచ్చని నీళ్లు తాగడం ద్వారా ఆ వ్యర్థ, విషపూరిత పదార్థాలు శరీరం నుంచి మూత్రం, చెమట, ఇతర రూపాల్లో బయటికి వెళ్లిపోతాయి. శరీరం పునరుత్తేజితం అవుతుంది. గోరు వెచ్చని నీళ్లు తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. రక్తంలో నీటి శాతం పెరుగుతుంది. వీటితో రక్త నాళాలు వ్యాకోచించి, శరీర కణాలకు ఆక్సిజన్, గ్లూకోజ్ సరఫరా పెరుగుతుంది. అవయవాల పనితీరు మెరుగుపడుతుంది. గోరు వెచ్చని నీళ్లు తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరిగి, శ్వాస ద్వారా వెళ్లే నీటి ఆవిరి కూడా వేడెక్కుతుంది. ఇది శ్వాస వ్యవస్థలో నాళాలను శుభ్రపరుస్తుంది. ముఖ్యంగా చలికాలంలో, అలర్జీలతో బాధపడే సమయంలో ఇది మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. గొంతులో గరగర, ఇతర ఇబ్బందులు తగ్గుతాయి. రాత్రి నిద్ర సమయంలో గొంతులో శ్లేష్మం చేరుతుంది. నోటిలోని కొన్ని భాగాలు తడారిపోతాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
యమునా నదిలో విష జలం !! స్నానం చేస్తే అంతే !!
సింహాలే ఆమె నేస్తాలు.. వాటితో కలిసి ఏం చేసిందో చూడండి !!