ఓవైపు పులులు.. మరోవైపు ఎలుగుబంట్లు.. భయాందోళనలో ప్రజలు

ఓవైపు పులులు.. మరోవైపు ఎలుగుబంట్లు.. భయాందోళనలో ప్రజలు

Phani CH

|

Updated on: Nov 13, 2024 | 9:37 PM

తెలుగు రాష్ట్రాల ప్రజలను వన్యప్రాణులు బెంబేలెత్తిస్తున్నాయి. పుణ్యక్షేత్రాలు, పంటపొలాలు, నివాస ప్రాంతాలు ఏదీ వదలకుండా క్రూర మృగాలు జనావాసాల్లోకి చొరబడుతున్నాయి. మనుషులు, పశువులపైన దాడులకు పాల్పడుతున్నాయి. ఈ క్రమంలో ప్రజలు ఏక్షణం ఏ జంతువు తమపై దాడిచేస్తుందోనని తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

ఓవైపు ఆంధ్ర, ఒడిశా బోర్డర్‌లో పంటపొలాల్లో సంచరిస్తూ రైతులను, రైతు కూలీలను భయాందోళకు గురిచేస్తున్నాయి. మరోవైపు తెలంగాణలోని నిర్మల్‌ జిల్లాలో శుక్రవారం కుంటాలలో కనిపించిన పెద్దపులి ఆదివారం మహబూబ్‌ ఘాట్‌ వద్ద రోడ్డు దాటుతూ వాహనదారుల కంటపడింది. ఇంకోవైపు ఏపీలోని సత్యసాయి జిల్లాలో ఎలుగుబంట్లు జనాలను కంగారెత్తిస్తున్నాయి. పొలంలో గడ్డికోస్తున్న రైతుపై ఎలుగుబంటి దాడికి పాల్పడింది. సత్యసాయి జిల్లా రోళ్ల మండలం బాజయ్యపాళ్యంలో ఎలుగుబంటి హల్‌చల్ చేసింది. గత రెండు రోజులుగా పొలాల్లో సంచరిస్తోంది. పొలంలో గడ్డికోస్తున్న రైతు నాగరాజుపై ఎలుగుబంటి దాడి చేసింది. బాధితుడు కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి ఎలుగుబంటిని తరిమారు. నాగరాజును ఆస్పత్రికి తరలించారు. క్రూరమృగాల విషయంలో అటవీశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఉల్లి లొల్లి మళ్లీ మొదటికొచ్చే.. రెండింతలు పెరిగిన ధర

Published on: Nov 13, 2024 09:30 PM