సింహాలే ఆమె నేస్తాలు.. వాటితో కలిసి ఏం చేసిందో చూడండి !!
ఆపదలో ఆదుకున్నవారి పట్ల కృతజ్ఞతతో ఉండటం మానవ సహజం. కానీ ఈ రోజుల్లో అలాంటివి మనుషుల్లో కరువవుతున్నాయని చెప్పవచ్చు. మనుషుల్లో మాయమవుతున్న మానవత్వం జంతువుల్లో కనిపిస్తోందా అనిపిస్తోంది ఈ వీడియో చూస్తే. అవును.. తమను కాపాడిన ఓ మహిళ పట్ల ఎంతో ప్రేమతో మెలుగుతున్నాయి సింహం పిల్లలు.
ఓ మహిళ పడుకొని ఉండగా నాలుగు సింహం పిల్లలు ఆమె చుట్టూ చేరి, ఆమె ముఖంపై ముద్దులు కురిపిస్తూ తమ ప్రేమను చాటుతున్నాయి. ఈ వీడియోను అస్పినాల్ అనే మహిళ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ వీడియో ఓ రేంజ్‌లో వైరల్ అవుతోంది. కొంతకాలం క్రితం ఈ సింహం పిల్లలు తల్లిని కోల్పోయి, దిక్కుతోచని స్థితిలో ఫ్రెయా ఆస్పినాల్ కు దొరికాయి. స్వతహాగా జంతు రక్షకురాలు అయిన ఫ్రెయా వాటిని అక్కున చేర్చుకుంది. తానే వాటికి తల్లిలా మారినట్లు చెప్పింది. అందుకే వాటితోనే నిద్రపోతున్నట్టుగా చెప్పింది. ఆస్పినాల్.. ఈ సింహం పిల్లలను ఆఫ్రికాకు పంపాలని యోచిస్తోంది. గతంలో తను రక్షించిన అనేక జంతువులను అక్కడే ఉంచినట్టుగా స్పష్టం చేశారు. కాగా, ఈ వీడియోకి నెట్టింట బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియో వీక్షిస్తున్న వేలాదిమంది లైక్ చేస్తూ మహిళపై ప్రశంసలు కురిపిస్తూ కామెంట్లు పెడుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:

ఆచి.. తూచి.. అడుగు వెయ్యాలంటారు ఇందుకే..

కొంప ముంచిన కాఫీ.. ఏకంగా రూ.415 కోట్లు పరిహారం..

వేసవిలో బైక్ లు వాడుతున్నారా.. వీటితో జాగ్రత్త!

తాచుపాము కరిచినా..10వ తరగతి పరీక్ష రాసిన విద్యార్థి వీడియో

తెలుగు రాష్ట్రాల్లో బుసలు కొడుతున్న పాములు వీడియో

ఈ కోతికి ఫోన్ కనిపిస్తే చాలు.. వీడియో

ఎక్కడపడితే అక్కడ రీల్స్ చేస్తే ఇలాగే పగుల్తది..
