ఉల్లి లొల్లి మళ్లీ మొదటికొచ్చే.. రెండింతలు పెరిగిన ధర
కోయకుండానే ఉల్లి కన్నీరు పెట్టిస్తుంది. కేవలం వారం రోజుల్లోనే రెండు సార్లు ధరలు పెరగడంతో వినియోగదారులు బెంబేలెత్తిపోతున్నారు. పలు చోట్ల కిలో ఉల్లి వందకు చేరువలోకి చేరింది. గతంలో టమాట ధరలు అల్లాడించాయి. ఇప్పుడు దాని స్థానంలో ఉల్లి చేరిందని పలువురు వాపోతున్నారు..
నిన్న మొన్నటి వరకు హోల్‌సేల్ మార్కెట్లలో రూ.40 నుంచి 60లు పలికిన కిలో ఉల్లిపాయల ధర.. ఇప్పుడు రూ.70 నుంచి 80కి చేరింది. శుక్రవారం కొన్ని ప్రాంతాల్లో రూ.80 కంటే అధిక ధర పలికింది. దీంతో కుటుంబ బడ్జెట్లు తల్లకిందులై వినియోగదారులు అల్లాడుతున్నారు. ద్రవ్యోల్బణంతోపాటు ఉల్లి కొనుగోలు ధరలు పెరగడమే ఇందుకు కారణమని వ్యాపారులు చెప్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఇదే తంతు కనిపిస్తోంది. మండీల్లో కిలో ఉల్లి ధర రూ.60 నుంచి రూ.70కి పెరిగిందని, అమ్మకాలపై ప్రభావం చూపుతుండటం వల్లనే విక్రయాలు తగ్గాయని అంటున్నారు. అయినప్పటికీ ఉల్లిపాయలను జనం కొంటూనే ఉన్నారని ఢిల్లీ మార్కెట్‌లోని ఓ వ్యాపారి తెలిపారు. అదుపు లేకుండా పెరిగిపోతున్న ధరలపై వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉల్లితోపాటు వెల్లుల్లి, టమాట ధరలు కూడా రెట్టింపు కావడంతో కొనుగోలుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెరిగిపోతున్న ధరలకు ప్రభుత్వం కళ్లెం వేసి తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పీఎం ఇంటర్న్‌షిప్ కు అప్లయ్ చేశారా ?? రూ.66 వేలు ఇస్తారు.. ఎలా అంటే ??
ఫీజు కట్టాలి.. లైసెన్స్ తీసుకోవాలి.. వాట్సాప్ అడ్మిన్లకు షాక్
Helicobacter pylori: గోరుముద్ద నుంచే పైలోరీ బ్యాక్టీరియా
Pushpa 2: మాస్ జాతర షురూ.. అభిమానులను కలవనున్న పుష్ప
ఆ రైల్లో వెళ్తున్నారా… బీ కేర్ ఫుల్ !!