ఫీజు కట్టాలి.. లైసెన్స్ తీసుకోవాలి.. వాట్సాప్ అడ్మిన్లకు షాక్

ఫీజు కట్టాలి.. లైసెన్స్ తీసుకోవాలి.. వాట్సాప్ అడ్మిన్లకు షాక్

Phani CH

|

Updated on: Nov 12, 2024 | 9:01 PM

అక్కడ వాట్సాప్ గ్రూప్‌ పెట్టాలంటే ఆషామాషీ కాదు. గ్రూప్‌ అడ్మిన్‌కు లైసెన్స్ ఉండాలి. ఇందుకోసం ఫీజు కూడా చెల్లించాలి. ఇదంతా ఎక్కడ అనుకుంటున్నారా? మనదగ్గరయితే కాదు లేండి. కానీ, జింబాబ్వేలో మాత్రం ఈ రూల్‌ కచ్చితంగా అమలు చేస్తున్నారట. అక్కడి ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం ప్రకారం వాట్సాప్‌ గ్రూప్ అడ్మిన్‌లందరూ జింబాబ్వే పోస్ట్ అండ్‌ టెలికమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ అథారిటీలో నమోదు చేసుకోవాలి.

వారి గ్రూప్‌ నిర్వహణకు విధిగా లైసెన్స్ తీసుకుని ఉండాలన్నమాట. అయితే ఈ లైసెన్స్ కోసం ఫీజు కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఇందు కోసం కనీసం 50 డాలర్లు (సుమారు రూ.4,200) ఖర్చవుతుంది. ఈ విషయాన్ని జింబాబ్వే సమాచార, కమ్యూనికేషన్ టెక్నాలజీ, పోస్టల్ అండ్‌ కొరియర్ సర్వీసెస్ మంత్రి తటెండా మావెటెరా ప్రకటించారు. తప్పుడు వార్తలు వ్యాప్తి చెందకుండా, దేశంలో శాంతి నెలకొనేందుకు ఆ దేశ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం ఈ కొత్త వాట్సాప్ నిబంధనను రూపొందించారు. ఈ చట్టం ప్రకారం, ఒక వ్యక్తిని ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా గుర్తించడానికి ఉపయోగించే ఏదైనా సమాచారాన్ని వ్యక్తిగత సమాచారంగా పరిగణిస్తారు. వాట్సాప్ గ్రూప్ అడ్మిన్‌ల వద్ద సభ్యుల ఫోన్ నంబర్లు ఉంటాయి కాబట్టి ప్రభుత్వం ప్రకారం, వారు డేటా ప్రొటెక్షన్ యాక్ట్ పరిధిలోకి వస్తారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Helicobacter pylori: గోరుముద్ద నుంచే పైలోరీ బ్యాక్టీరియా

Pushpa 2: మాస్ జాతర షురూ.. అభిమానులను కలవనున్న పుష్ప

ఆ రైల్లో వెళ్తున్నారా… బీ కేర్ ఫుల్ !!

రూ. 4 ల‌క్షల ఖ‌ర్చు.. 1500 మందిలో అట్టహాసంగా కారుకు “సమాధి” !!

రెయిన్‌బో డైట్‌.. ఎప్పుడైనా ట్రై చేశారా ?? దీన్ని ఫాలో అయితే కలిగే లాభాలేంటంటే ??