Helicobacter pylori: గోరుముద్ద నుంచే పైలోరీ బ్యాక్టీరియా
అమ్మ చేతి గోరు ముద్ద.. బిడ్డలకు అమృతంతో సమానం! కానీ.. అది ఒకప్పటి మాట!! మనిషి జీర్ణకోశ కణజాలాన్ని అంటిపెట్టుకుని అల్సర్ నుంచి జీర్ణాశయ క్యాన్సర్ దాకా పలు వ్యాధులకు, సమస్యలకు కారణమవుతోంది హెలికోబ్యాక్టర్ పైలోరీ అనే బ్యాక్టీరియా. ఇది శరీరంలో చేరడానికి అమ్మ చేతి గోరుముద్ద కూడా కారణమే అని.. దీనిపై విస్తృతస్థాయిలో పరిశోధనలు చేసి 2005వ సంవత్సరంలో నోబెల్ బహుమతి అందుకున్న శాస్త్రవేత్త, ప్రొఫెసర్ బారీ మార్షల్ తెలిపారు.
హెచ్.పైలోరీ వల్ల కలిగే నష్టాలు ప్రపంచానికి తెలియజేసేందుకు.. ఆ బ్యాక్టీరియాను తనకు తానే ఎక్కించుకుని, తన ఉదరాన్నే ప్రయోగశాలగా మార్చిన వ్యక్తి ఆయన! హెచ్ పైలోరీ’ బ్యాక్టీరియాపై పరిశోధనల కోసం తొలిసారిగా ప్రత్యేక కేంద్రాన్ని హైదరాబాద్ లో నెలకొల్పారు. దీనిని బారీ మార్షల్ ప్రారంభించారు. ఈ సెంటర్ కు ‘బ్యారీ మార్షల్ సెంటర్’గా అని పేరు పెట్టారు. అపరిశుభ్రత, కలుషిత తాగునీరు తదితర కారణాలతో ఈ బ్యాక్టీరియా వృద్ధి చెందుతుందన్నారు. ఇంట్లో ఒకరికి సోకితే..మిగతా వారూ దీని బారినపడే ముప్పు ఉంది. ‘హెచ్ పైలోరీ’ సోకినప్పటికీ 80% మందిలో ఎలాంటి లక్షణాలు ఉండవు. కొద్దిమందిలో మాత్రం అజీర్తి, పొట్టలో నొప్పి, గ్యాస్ తదితర ఇబ్బందులుంటాయి. ఒక శాతం మందిలో మాత్రమే దీర్ఘకాలంలో ఇది పొట్ట క్యాన్సర్‌కూ దారి తీసే ఛాన్సుంది. కుటుంబంలో ఎవరైనా క్యాన్సర్ బారినపడిన చరిత్ర ఉంటే.. మిగతా సభ్యులు వెంటనే ఈ బ్యాక్టీరియా పరీక్షలు చేసుకుంటే మంచిది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Pushpa 2: మాస్ జాతర షురూ.. అభిమానులను కలవనున్న పుష్ప
ఆ రైల్లో వెళ్తున్నారా… బీ కేర్ ఫుల్ !!
రూ. 4 లక్షల ఖర్చు.. 1500 మందిలో అట్టహాసంగా కారుకు “సమాధి” !!
రెయిన్‌బో డైట్.. ఎప్పుడైనా ట్రై చేశారా ?? దీన్ని ఫాలో అయితే కలిగే లాభాలేంటంటే ??