అమెరికా పోలీసుల కోతుల వేట..

అమెరికా పోలీసుల కోతుల వేట..

Phani CH

|

Updated on: Nov 12, 2024 | 8:33 PM

అమెరికా పోలీసులు గ్రూప్‌లుగా విడిపోయి తప్పిపోయిన కోతుల కోసం వెతుకుతున్నారు. పోలీసులేంటి? కోతులను వెదకడమేంటని ఆశ్చర్యపోకండి. అవి మామూలు కోతులు కావు. పరిశోధనా కేంద్రం నుంచి తప్పించుకున్నవి. సౌత్‌ కరోలినాలోని యెమసీ పట్టణంలోఆల్ఫా జెనెసిస్‌ అనే ఓ రీసెర్చ్‌ ఫెసిలిటీ సెంటర్‌ ఉంది. ఇక్కడ వైద్య పరీక్షలు, పరిశోధనల కోసం కోతులను పెంచుతుంటారు.

ప్రస్తుతం సంస్థలో 50 కోతులున్నాయి. అయితే బుధవారం దేశమంతా ఎన్నికల హడావిడిలో ఉండగా.. కోతులు మాత్రం తప్పించుకున్నాయి. బయటి ఎన్‌క్లోజర్‌ తలుపులు తెరిచి ఉండటంతో 43 కోతులు బయటికి పారిపోయాయని అధికారులు వెల్లడించారు. తప్పించుకున్నాయని, ప్రజలంతా తమ ఇళ్ల తలుపులు, కిటికీలను సురక్షితంగా మూసివేయాలని, ఎక్కడైనా కోతులు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని అధికారులు కోరారు. తప్పించుకున్నవి 3.2 కిలోల బరువున్న ఆడ కోతులని పోలీసులు తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వాటి దగ్గరకు వెళ్లే ప్రయత్నం చేయొద్దని సూచించారు. అయితే వర్షం పడుతుండటంతో గాలింపు చర్యలకు కొంత అంతరాయం ఏర్పడింది. కోతులు ఫెసిలిటీలో ఆపిల్స్‌ వంటి ఆహారాన్ని తిని పెరిగాయని, అడవిలో ఆకులు, అలములు తప్ప ఏమీ దొరకవు కాబట్టి అవి తిరిగి వచ్చే అవకాశం ఉందని ఆల్ఫా జెనెసిస్‌ సీఈఓ గ్రెగ్‌ వెస్టర్‌గార్డ్‌ చెబుతున్నారు. ఈ కేంద్రం నుంచి కోతులు తప్పించుకోవడం ఇది మొదటిసారి కాదు. 2016లో 19 కోతులు తప్పించుకుని ఆరు గంటల తర్వాత తిరిగొచ్చాయి. రెండేళ్ల కిందట 26 కోతులు తప్పించుకున్నాయి.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Pushpa 2: బాధ్యతంతా బన్నీదే 7 నగరాల్లో పుష్ప 2 టీమ్ సందడి