రూ. 4 లక్షల ఖర్చు.. 1500 మందిలో అట్టహాసంగా కారుకు “సమాధి” !!
వెర్రి వెయ్యి విధాలు అంటే ఇదేనేమో. సాధారణంగా మనకు బాగా నచ్చిన వాహనాలకు మనతో పాటే ఉంచుకుంటాం, లేదంటే ఎవరికైనా పనికొస్తే ఇచ్చేస్తాం. కొత్త వెహికల్ కొన్నప్పుడు పాత వాహనం మార్పిడి చేసుకుంటాం కానీ గుజరాత్‌లో ఓ వ్యాపారి మాత్రం తనకు బాగా అచ్చొచ్చిన కారును సమాధి చేసాడు. అదేదో అషామాషీగా చేయలేదు.
ఏకంగా 4 లక్షల రూపాయలు ఖర్చు చేసి వేడుకగా ఈ తంతు జరిపాడు. శాస్త్రోక్తంగా అంత్యక్రియలు జరిపించి అందరినీ అవాక్కయ్యేలా చేశాడు. తీరా చూస్తే ఈ కారు ఏ ముప్ఫై నలబై ఏళ్లనాటిదో కాదు.. జస్ట్ 12 ఏళ్లు మాత్రమే వాడారు. ఈ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. గుజరాత్‌కు చెందిన ఓ వ్యాపారి తనకు, తన కుటుంబానికి సంపద, పేరు తెచ్చిన లక్కీ కారును ఘనంగా సమాధి చేశారు. అమ్రేలి జిల్లా లాఠీ తాలూకా పదార్‌సింగ్ గ్రామం ఇందుకు వేదికైంది. గురువారం జరిగిన ఈ కార్యక్రమానికి ఆధ్యాత్మిక నాయకులు, సాధువులు సహా 1,500 మంది హాజరయ్యారు. ఫాంహౌస్‌లో సుమారు 15 అడుగుల లోతు గుంతలో ఉన్న వాగన్ ఆర్ కారు, సంజయ్ పొలారా, అతని కుటుంబం పూజలు చేస్తున్న వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. అంతకుముందు, పూలు, పూలదండలతో అందంగా అలంకరించిన కారును పొలారా కుటుంబీకులు బాజా భజంత్రీలతో గ్రామంలోని తమ ఇంటి నుంచి ఊరేగింపుగా ఫాంహౌస్‌కు తీసుకువచ్చారు. అక్కడున్న ఏటవాలు నిర్మాణం మీదుగా గుంతలోకి దింపారు. కారుపై పచ్చని వస్త్రాన్ని కప్పారు. పూజారులు మంత్రాలు చదువుతుండగా పొలారా, కుటుంబసభ్యులు కారుపై పూలు చల్లుతూ పూజలు చేశారు. చివరగా బుల్డోజర్ .. కారును మట్టితో సమాధి చేసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రెయిన్‌బో డైట్.. ఎప్పుడైనా ట్రై చేశారా ?? దీన్ని ఫాలో అయితే కలిగే లాభాలేంటంటే ??
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

