యమునా నదిలో విష జలం !! స్నానం చేస్తే అంతే !!
కార్తీక మాసం సందర్బంగా ఉత్తర భారత్‌లో నిర్వహించే ఛత్ పూజలు ప్రారంభమయ్యాయి. ఈ పూజల్లో భాగంగా గంగా, యమున నదుల్లో భక్తులు పుణ్య స్నానాలు ఆచరిస్తారు. ఈ క్రమంలో ఢిల్లీలోని కాళింది కుంజ్ ప్రాంతంలో మరో మార్గం లేక విషపూరితమైన జలాల్లోనే పుణ్యస్నాణాలు ఆచరించారు. సూర్యభగవానుడికి పెద్ద సంఖ్యలో భక్తులు పూజలు నిర్వహించారు.
యమునా నదిలో ఛత్ పూజలకు ఢిల్లీ హైకోర్టు అనుమతి నిరాకరించినప్పటికీ అత్యధిక మహిళలు ఈ విషపు నురగల్లోనే ఛత్ పూజ సంప్రదాయాన్ని కొనసాగించారు. యమునా నదిలో కాలుష్య విషం నురుగు కక్కుతోంది. ఇప్పటికే వాయు కాలుష్యంతో కకావికలమైన ఢిల్లీ వాసులను ఇప్పుడు నీటి కాలుష్యం భయపెడుతోంది గంగలో మునిగితే లభించని పుణ్యం.. యమునా నదిలో మునిగితే లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. అయితే ఇప్పుడు పొరపాటున కూడా యమున నదిలో మునిగితే పుణ్యం రావడం దేవుడెరుగు.. రోగాల బారిన పడే అవకాశం ఉందని నిపుణలు హెచ్చరిస్తున్నారు. నదిలోని నీరు కనిపించనంత మందంగా రసాయనాల నురుగులు అలుముకున్నాయి. నది మొత్తాన్ని ఆక్రమించేశాయి. ఫ్యాక్టరీల నుంచి మురుగు నీరు, వ్యర్థాలను వదులుతుండటంతో యమునా నదిలో విషపూరితమైన తెల్లటి నురగ ప్రవహిస్తోంది. ఇటీవల ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా యమునా నదిలో మునిగి ఆస్పత్రి పాలయ్యారు. 2025 నాటికి నదిని శుద్ధి చేస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చడంలో ఢిల్లీ ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ.. ఇందుకు నిరసనగా ఆయన నదిలో మునిగారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సింహాలే ఆమె నేస్తాలు.. వాటితో కలిసి ఏం చేసిందో చూడండి !!
శ్మశానంలో లాకర్ పగలగొట్టి మరీ.. అస్థికలు చోరీ..
ఆ కారణంతో.. పెళ్లయిన 24 గంటల్లోనే విడాకులు.. మరీ ఇంత ఫాస్టా..
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. ఈ లేడీ కిలాడి కథ వింటే షాకే
బాస్ మాట నమ్మి రూ.26 లక్షల ఆఫర్ వదులుకున్నాడు.. ట్విస్ట్ ఏంటంటే
పదో అంతస్తు నుంచి పడి.. తలకిందులుగా వేలాడి
తండ్రి మొక్కు కోసం 120 కి.మీ మేర పొర్లుదండాలు పెట్టిన కొడుకు
ఎలకల కోసం ఏర్పాటు చేసిన బోనులో.. పడింది చూసి రైతు షాక్

