లారీ కింద ఇరుక్కున్న యువతి.. జాకీలు తెప్పించి రక్షించిన బండి సంజయ్
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో జరిగిన ప్రమాదంలో ఓ యువతి ప్రాణాపాయం నుంచి బయటపడింది. లారీ కింద పడిపోయిన ఆమె కేకలు వేయడంతో డ్రైవర్ అప్రమత్తమై వెంటనే ఆపాడు. హుజూరాబాద్‌లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మానకొండూరుకు చెందిన దివ్యశ్రీ సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో లారీ కింద చిక్కుకుంది.
ఆమె జుట్టు లారీ ముందు చక్రాల కింద పడింది. దీంతో ఆమె బయటకు రాలేకపోయింది. అదే రోడ్డు మార్గంలో ములుగు వెళ్తున్న కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్.. ఆ ఘటనను చూడడంతో.. తన కాన్వాయ్ ను ఆపి.. సహాయక చర్యలు చేప్టట్టారు. భయపడొద్దు…ధైర్యంగా ఉండాలని సూచించారు. అటువైపు వెళుతున్న లారీలను ఆపి జాకీలు, కత్తెర తెప్పించారు. ప్రాణాలతో విలవిల్లాడుతున్న మహిళను కాపాడేందుకు క్రుషి జాకీలు, కట్టర్లు తెప్పించి వెంటనే ఆమెను ట్రక్ కింద నుంచి సేఫ్ గా బయటకు తీసుకొచ్చారు. లారీ కింద జాకీలు పెట్టి.. యువతి జుట్టు కత్తిరించి బయటకు తీశారు. అక్కడే ఉన్న స్థానికులు ఆమెను రక్షించడంలో సహాయపడ్డారు. స్వల్ప గాయాలతో బయట పడ్డ దివ్యశ్రీని కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సమాధుల కింద హెజ్‌బొల్లా భారీ టన్నెల్ !!
పొద్దున్నే గోరువెచ్చని నీళ్లు తాగండి.. ఫలితం మీరే చూడండి
యమునా నదిలో విష జలం !! స్నానం చేస్తే అంతే !!
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

