సమాధుల కింద హెజ్‌బొల్లా భారీ టన్నెల్ !!
హమాస్, హెజ్‌బొల్లా- ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో పశ్చిమాసియా అట్టుడుకుతోంది. హెజ్‌బొల్లా అంతమే లక్ష్యంగా లెబనాన్‌లో ఐడీఎఫ్ భీకర దాడులు చేస్తోంది. ఈ క్రమంలో హెజ్‌బొల్లా ముఠాకు చెందిన ఓ రహస్య టన్నెల్ వీడియోను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. సమాధుల కింద హెజ్‌బొల్లా ఏర్పాటుచేసుకున్న సొరంగం అది.
కిలోమీటర్ల మేర పొడవున్న ఈ టన్నెల్‌లో కమాండ్ కంట్రోల్ రూమ్‌లు, తుపాకులు, రాకెట్లు ఉన్నట్లు గుర్తించామని ఐడీఎఫ్ తెలిపింది. వాటిని ధ్వంసం చేశామని ప్రకటించింది. ‘హెజ్‌బొల్లాకు మానవ జీవితం అంటే లెక్క లేదు. చనిపోయినా, బతికినా పట్టించుకోదు’ అంటూ దీనికి సంబంధించిన వీడియోను ఐడీఎఫ్ విడుదల చేసింది. సొరంగంలో కంట్రోల్ రూమ్‌లు, స్లీపింగ్ క్వార్టర్‌లు, డజన్లకొద్దీ ఆయుధాలు, ఇతర సైనిక సామగ్రిని నిల్వ చేసినట్లు తెలుస్తోంది. లెబనాన్‌లోని పౌరుల నివాసాల కింద హెజ్‌బొల్లా సొరంగాలను ఏర్పాటు చేసుకొని ఆశ్రయం పొందుతున్నట్లు గుర్తించిన ఇజ్రాయెల్ దళాలు ఇటీవల పలు సొరంగాలను ధ్వంసం చేశాయి. కాగా గాజా, లెబనాన్‌పై ఇజ్రాయెల్ సైన్యం ఆదివారం భీకరంగా విరుచుకుపడింది. ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో 23 మంది మృతి చెందారని లెబనాన్ అధికారులు తెలిపారు. ఇందులో ఏడుగురు చిన్నారులు ఉన్నారు. గాజాలోని ఓ నివాసగృహంపై చేసిన దాడిలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో తొమ్మిది మంది మహిళలు ఉన్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పొద్దున్నే గోరువెచ్చని నీళ్లు తాగండి.. ఫలితం మీరే చూడండి
యమునా నదిలో విష జలం !! స్నానం చేస్తే అంతే !!
సింహాలే ఆమె నేస్తాలు.. వాటితో కలిసి ఏం చేసిందో చూడండి !!
అయ్యో.. ఈ శునకం కష్టాలు చూసి చలించిపోయిన భక్తులు
చీకటిపడ్డాక చెరువు గట్టుపై వణుకు పుట్టించే సీన్..
అమ్మంటే అమ్మే.. తన బిడ్డ కోసం ఉడుతమ్మ సాహసానికి నెటిజన్లు ఫిదా
భర్త ఎదుటే ఉరివేసుకున్న భార్య.. కాపాడాల్సింది పోయి..
ఇడ్లీ తింటే .. జీఎస్టీతో పాటు 'గ్యాస్ ఫీజు' కట్టాల్సిందే..
అమ్మ దొంగ చేపా... ఎంత పనిచేశావే !
గ్రామస్తులపై తేనెటీగల దాడి..15 మంది..

