నిద్రలోకి జారుకోవడానికి మిలిటరీ టెక్నిక్ !!
'గుడ్ నైట్.. స్వీట్ డ్రీమ్స్' ఇది వాస్తవానికి నిజమైతే బాగుంటుంది కదూ. అనుకోగానేనిద్ర పడితే ఆహా... ఆ హాయే వేరు కదా! అయితే నిద్రొచ్చేదాకా జాగారం తప్పదని చెప్పేవారినే ఈ మధ్య ఎక్కువగా చూస్తున్నాం. అమెరికా ఆర్మీ ఫాలో అయ్యే స్లీప్ టెక్నిక్‌తో హాయిగా కంటి నిండా నిద్రపోవచ్చు. మరి ఆ టెక్నిక్ ఏంటో చూసేద్దామా.
సైనికుడు యుద్ధ భూమిలో అడుగు పెట్టాడంటే ప్రతి క్షణం పోరాటం చేస్తాడు. ఎంత సైనికుడైనా.. మనిషే కదా! అతనికి కూడా నిద్ర వస్తుంది. నిద్ర లేకుంటే బాడీ యుద్ధానికే కాదు… దేనికీ సహకరించదు. అందుకే ఉన్న టైమ్ నే ఉపయోగించుకోవాలి. ఎప్పుడు ఏం అవుతుందో తెలియదు. రెస్ట్ కావాలి. కాబట్టి, కన్ను మూసిన వెంటనే నిద్రపట్టాలి. కూత పెట్టగానే మేల్కోవాలి. అది మాటలతో చెప్పినంత ఈజీకాదు. అందుకే.. పరిస్థితులు ఎలా ఉన్నా.. సైనికులు రెండు నిమిషాల్లో నిద్రలోకి జారుకునే ఒక టెక్నిక్ ను అమెరికాలో ఆర్మీ ఫాలో అవుతోంది. అది మామూలుగా నిద్రపోవడానికి ఇబ్బంది పడేవాళ్లకు కూడా ఉపయోగపడుతుందనడంలో డౌట్ లేదు. ఆర్మీలో చేరిన వాళ్లతో ఆరు వారాల పాటు ఈ టెక్నిక్ ని ప్రాక్టీస్ చేయిస్తారు. ఈ టెక్నిక్ కి నాలుగు స్టెప్స్ ఉంటాయి. ముందు ఫేస్ మజిల్స్ రిలాక్స్ చేసుకోవాలి. కళ్ల చుట్టు ఉండే మజిల్స్, నాలుక, దవడ మజిల్స్ ని రిలాక్స్ చేయాలి. ఒకసారి ఫేస్ రిలాక్స్ అయితే… భుజాలను కిందికి దించాలి. అవి ఎంత కిందికి వెళితే.. అంత కిందికి, ఆ తర్వాత చేతుల్ని ఒక్కోవైపు ఒక్కోసారి కిందికి దించాలి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
లారీ కింద ఇరుక్కున్న యువతి.. జాకీలు తెప్పించి రక్షించిన బండి సంజయ్
సమాధుల కింద హెజ్‌బొల్లా భారీ టన్నెల్ !!
పొద్దున్నే గోరువెచ్చని నీళ్లు తాగండి.. ఫలితం మీరే చూడండి