AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 8 Telugu: బ్యాడ్ అవుతున్నావ్.. అలాంటివి ఇక్కడొద్దు.. యష్మీకి తండ్రి సలహాలు..

బిగ్ బాస్ హౌస్ లో ఇప్పుడు ఫ్యామిలీ వీక్ నడుస్తుంది. ఒక్కొక్కరి ఇంటి సభ్యులు వస్తుండడంతో అందరూ ఎమోషనల్ అవుతున్నారు. ఇక నిన్నటి ఎపిసోడ్ లో హౌస్ లోకి వచ్చిన యష్మీ తండ్రి కూతురికి మంచి మాటలు చెప్పారు. సలహాలు ఇస్తూనే గ్రూప్ గేమ్ వద్దంటూ వార్నింగ్ ఇచ్చారు. నిన్నటి ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం.

Bigg Boss 8 Telugu: బ్యాడ్ అవుతున్నావ్.. అలాంటివి ఇక్కడొద్దు.. యష్మీకి తండ్రి సలహాలు..
Bigg Boss 8 Telugu
Rajitha Chanti
|

Updated on: Nov 14, 2024 | 6:53 AM

Share

హౌస్‏లో ఇప్పుడు ఫ్యామిలీ వీక్ నడుస్తోంది. దీంతో కంటెస్టెంట్స్ అందరూ కాస్త ఎమోషనల్ అవుతున్నారు. ఇక హౌస్ లోకి వచ్చి తమవారికి సలహాలు ఇస్తూనే చాలా హింట్స్ కూడా ఇచ్చారు. తన కూతురికి చాలా మంచి మాటలు చెప్పారు యష్మీ తండ్రి. హౌస్ లో నీ బిహేవియర్ కారణంగా బయట నెగిటివ్ అవుతున్నావ్ అంటూ వార్నింగ్ ఇచ్చారు. ముందు వారాల్లో ఎలా అయితే నీ కోసం ఆడావో.. అలాగే ఆడు.. ఇక గ్రూప్ గేమ్ వద్దు అంటూ సలహా ఇఛ్చారు. ఇక నిఖిల్ మ్యాటర్ పై రియాక్ట్ అయ్యారు. నిన్నటి ఎపిసోడ్‏లో ముందుగా యష్మీ ఫాదర్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. తన తండ్రి దగ్గరకు రాగానే ఏడ్చేసింది యష్మీ. ఆ తర్వాత తండ్రిని గట్టిగా పట్టుకొని ఎమోషనల్ అయింది. ఆ వెంటనే వీడ్ని గుర్తుపట్టావా.. గడ్డం అది తీసేశాడు అంటూ నిఖిల్ ను పరిచయం చేసింది. ఇప్పుడే బావున్నారు.. నీటిగా ఉంది అంటూ యష్మీ తండ్రి చెప్పారు. యష్మీ తండ్రిని చూసి షాకయ్యారు రోహిణి, అవినాష్. అంత హైట్ ఉన్నారంటూ కాస్త భయపడ్డాడు అవినాష్.

హౌస్ లో ఉన్న ఒక్కొక్కరిని పరిచయం చేసింది యష్మీ. నమస్కారం అంకుల్ అని అవినాష్ భయపడుతూ అన్నాడు అవినాష్. రోహిణి చేసే కామెడీ బాగుంటుందని.. డ్యాన్సర్ తేజ అంటూ ఆటపట్టించారు. ఒక్కొక్కరిని పలకరించిన యష్మీ తండ్రి.. ఆ తర్వాత కూతురిగా ఒంటరిగా కూర్చొని సలహాలు ఇచ్చారు. నువ్వు బాగా ఆడుతున్నావు.. చాలా రోజులు అయింది కదా చూసి.. టాస్కులలో ఎందుకు నీ ఆట తగ్గింది అంటూ అడిగారు. ఆడుతున్నాను అని యష్మీ అంటే లేదు ఎప్పుడూ అలా కూర్చొని ఉంటున్నావు.. వేరే ఏమో ఆలోచిస్తున్నావు.. ఇప్పుడు ఇండివీడ్యూవల్ గేమ్ ఆడాలి.. నీ కోసం నువ్వు ఆడు.. నాలుగు వారాలే ఇంకా.. బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుంది బయట అన్నట్లు మాట్లాడారు.

ఏం ఆలోచించకు. ఏమన్నా ఉంటే ఉంటే బయట చూసుకో.. ఇక్కడేం నీ మనసులో ఉన్న మాటలు చెప్పకు.. వేరే వాళ్లతో డిస్కస్ చేయకు అంటూ సున్నితంగా వార్నింగ్ ఇచ్చారు. నిన్ను స్టేజ్ మీద చూడాలి. కప్పు నీ చేతిలో చూస్తే ఆ కథే వేరు అంటూ చెప్పుకొచ్చారు. ఆ తర్వాత కూతురి కోసం ఓ గేమ్ ఆడారు. ఆ తర్వాత కూతురికి ఫుడ్ తినిపిస్తూ ఎమోషనల్ అయ్యారు. వెళ్తు వెళ్తూ తన కూతురి తరుపున హౌస్మేట్స్ అందరికీ క్షమాపణలు చెప్పి వెళ్లిపోయాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్.. ఎన్ని వేల కోట్లతో నిర్మిస్తున్నారంటే
హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్.. ఎన్ని వేల కోట్లతో నిర్మిస్తున్నారంటే
తొలి టెస్టుతోనే కెరీర్ క్లోజ్.. ఈ 5గురి స్టోరీ తెలిస్తే షాకే..!
తొలి టెస్టుతోనే కెరీర్ క్లోజ్.. ఈ 5గురి స్టోరీ తెలిస్తే షాకే..!
సూర్యగ్రహణం సమయంలో ఈ పనులు చేయొద్దు.. గ్రహణం తర్వాత తప్పక ఇలా..
సూర్యగ్రహణం సమయంలో ఈ పనులు చేయొద్దు.. గ్రహణం తర్వాత తప్పక ఇలా..
బుక్ చేసిన 45 గంటల్లోనే ఇంటికి గ్యాస్ సిలిండర్.. సేవలు ప్రారంభం
బుక్ చేసిన 45 గంటల్లోనే ఇంటికి గ్యాస్ సిలిండర్.. సేవలు ప్రారంభం
కూతురిపై అఘాయిత్యానికి తల్లి సపోర్ట్..!
కూతురిపై అఘాయిత్యానికి తల్లి సపోర్ట్..!
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏ ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంటే?
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏ ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంటే?
చుక్కల అమావాస్య.. ఈరోజు ఒక్క దీపం వెలిగిస్తే ఇంట్లో చీకట్లు తొలగి
చుక్కల అమావాస్య.. ఈరోజు ఒక్క దీపం వెలిగిస్తే ఇంట్లో చీకట్లు తొలగి
ఓటీటీలో రచ్చ చేస్తున్న హారర్ సినిమా..
ఓటీటీలో రచ్చ చేస్తున్న హారర్ సినిమా..
‘విశ్వనాథ్ & సన్స్’ సినిమాతో ప్రతి ఒక్కరూ ప్రేమలో పడతారు: సూర్య
‘విశ్వనాథ్ & సన్స్’ సినిమాతో ప్రతి ఒక్కరూ ప్రేమలో పడతారు: సూర్య
జస్ట్ 3 రోజుల్లోనే ఇంట్లో కొత్తిమీర పెంచండి.. ఈ చిన్న ట్రిక్..
జస్ట్ 3 రోజుల్లోనే ఇంట్లో కొత్తిమీర పెంచండి.. ఈ చిన్న ట్రిక్..