Nikki Galrani: ‘నీ జ్ఞాపకాలు ఎప్పటికీ చెరిగిపోవు.. మళ్లీ తిరిగొస్తావుగా’.. హీరో ఆది భార్య ఎమోషనల్.. ఏమైందంటే?

టాలీవుడ్ హీరో ఆది పినిశెట్టి, హీరోయిన్ నిక్కీ గల్రానీలు 2022 మేలో వివాహం చేసుకున్నారు. అంతకు ముందు ప్రేమలో మునిగి తేలిన వీరు పెద్దల అనుమతితో పెళ్లిపీటలెక్కారు. తాజాగా వీరి ఇంట్లో విషాదం చోటు చేసుకుంది.

Nikki Galrani: 'నీ జ్ఞాపకాలు ఎప్పటికీ చెరిగిపోవు.. మళ్లీ తిరిగొస్తావుగా'.. హీరో ఆది భార్య ఎమోషనల్.. ఏమైందంటే?
Nikki Galrani Family
Follow us
Basha Shek

|

Updated on: Nov 11, 2024 | 7:56 PM

టాలీవుడ్ క్రేజీ హీరో ఆది భార్య, హీరోయిన్‌ నిక్కీ గల్రానీల ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. నిక్కీ ప్రాణంగా పెంచుకునే పెంపుడు కుక్క ఆదివారం చనిపోయింది. దీంతో ఆమె పుట్టెడు దుఃఖంలో మునిగిపోయింది. ఎన్నో ఏళ్లుగా ప్రాణంగా పెంచుకున్న ఛాంపియన ఇక లేదంటూ సోషల్‌ మీడియా వేదికగా తన ఆవేదనను వ్యక్త పరిచింది నిక్కీ. వివిధ సందర్భాల్లో తన పెట్ డాగ్ తో కలిసి దిగిన ఫొటలను షేర్ చేసుకున్న ఆమె.. ‘నీ కాలి ముద్రలు మా మనసుపై స్థిరంగా ఉన్నాయి. అవి ఎప్పటికీ చెరిగిపోవు. మై బేబీ, నీ ఆత్మకు శాంతి కలగాలని మనసారా కోరుకుంటున్నాను. నువ్వు ఎప్పటికీ మంచి అబ్బాయివే! నువ్వు తొమ్మిదేళ్లుగా మాతో ఉన్నావ్. ఎప్పుడూ ఎవరినీ గాయపర్చలేదు. కుక్కలంటే భయపడేవాళ్లు కూడా నిన్ను చూసి ప్రేమలో పడ్డారు. ఆ భయాన్ని వదిలేశారు. అందరితోనూ అంత ఫ్రెండ్లీగా, ప్రేమగా మెలిగావ్. నువ్వు మాకు దూరమైనందుకు చాలా బాధగా ఉంది. మరోసారి కలుసుకుందాం ఛాంప్‌. ఏదో ఒకరోజు ఏదో ఒకరూపంలో మళ్లీ మా దగ్గరకు తిరిగొచ్చేస్తావని ఆశిస్తున్నా’ అని తన ఆవేదనకు అక్షర రూపమిచ్చింది నిక్కీ.

ప్రస్తుతం ఆది భార్య షేర్ చేసిన పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీనిని చూసిన వారంతా రెస్ట్ ఇన్ పీస్ అని కామెంట్లు పెడుతున్నారు. కాగ ప్రముఖ దర్శకుడు రవిరాజా పినిశెట్టి కుమారుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు ఆది పినిశెట్టి. గుండెల్లో గోదారి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆతర్వాత సరైనోడు, నిన్నుకోరి, రంగస్థలం, అజ్ఞాతవాసి తదితర సినిమాల్లో నటించి మెప్పించాడు.

ఇవి కూడా చదవండి

నిక్కీ గల్రానీ ఎమోషనల్ పోస్ట్..

ఇక ఆది పినిశెట్టి భార్య నిక్కీ గల్రానీ కూడా పలు కన్నడ, తమిళ్  సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. బుజ్జిగాడు సినిమాలో సెకెండ్ హీరోయిన్ గా నటించిన సంజనా గల్రానీకి ఈమె సోదరి అవుతుంది. ఇక నిక్కీ, ఆది పలు సినిమాల్లో కలిసి నటించారు. ఈక్రమంలోనే వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఆ తర్వాత పెద్దల అనుమతితో మూడు ముళ్ల బంధంలోకి అడుగు పెట్టారు.

దీపావళి వేడుకల్లో హీరో ఆది, నిక్కీ గల్రానీ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఏపీలో భారీ వర్షాలు.. ఉరుములు, మెరుపులు కూడా..ఈ జిల్లాలకు హెచ్చరిక
ఏపీలో భారీ వర్షాలు.. ఉరుములు, మెరుపులు కూడా..ఈ జిల్లాలకు హెచ్చరిక
ఇందులో ఇన్వెస్ట్‌ చేస్తే కోటి రూపాయలు మీ సొంతం.. ప్రభుత్వ స్కీమ్‌
ఇందులో ఇన్వెస్ట్‌ చేస్తే కోటి రూపాయలు మీ సొంతం.. ప్రభుత్వ స్కీమ్‌
సంధ్య థియేటర్ ఘటనపై స్పందించిన రాములమ్మ
సంధ్య థియేటర్ ఘటనపై స్పందించిన రాములమ్మ
అమ్మాయి వాయిస్‌తో అదరగొడుతున్న ఆద్య హనుమంతు..
అమ్మాయి వాయిస్‌తో అదరగొడుతున్న ఆద్య హనుమంతు..
గేమ్ ఛేంజర్‌లో తెలుగు రాష్ట్రాల రాజకీయాలు.దిల్ రాజు ఒప్పుకున్నారా
గేమ్ ఛేంజర్‌లో తెలుగు రాష్ట్రాల రాజకీయాలు.దిల్ రాజు ఒప్పుకున్నారా
ఎలక్ట్రిక్‌ రైలుకు ఎన్ని వోల్జేజీల విద్యుత్‌ అవసరమో తెలుసా..?
ఎలక్ట్రిక్‌ రైలుకు ఎన్ని వోల్జేజీల విద్యుత్‌ అవసరమో తెలుసా..?
సంధ్య థియేటర్ ఘటన.. ఫిల్మ్ ఛాంబర్ కీలక నిర్ణయం..
సంధ్య థియేటర్ ఘటన.. ఫిల్మ్ ఛాంబర్ కీలక నిర్ణయం..
చోరీ కేసుల కోసం లాయర్‌ని పెట్టుకున్న దొంగ.. చివరకు లాయర్ ఇంట్లోనూ
చోరీ కేసుల కోసం లాయర్‌ని పెట్టుకున్న దొంగ.. చివరకు లాయర్ ఇంట్లోనూ
బాల రామయ్య ప్రాణప్రతిష్ట జరిగి ఏడాది పూర్తి.. ఉత్సవాలు ఎప్పుడంటే
బాల రామయ్య ప్రాణప్రతిష్ట జరిగి ఏడాది పూర్తి.. ఉత్సవాలు ఎప్పుడంటే
ప్రపంచ రికార్డుతో లేడీ కోహ్లీ మూడోసారి అరుదైన ఫీట్..
ప్రపంచ రికార్డుతో లేడీ కోహ్లీ మూడోసారి అరుదైన ఫీట్..
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!