AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sai Kiran: 46 ఏళ్ల వయసులో మళ్లీ పెళ్లి.. నిశ్చితార్థం చేసుకున్న ‘నువ్వే కావాలి’ నటుడు.. వధువు ఎవరంటే?

నువ్వే కావాలి సినిమాతో తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువైపోయాడు నటుడు సాయి కిరణ్. ఆ తర్వాత ప్రేమించు సినిమాతో సోలో హీరోగా సక్సెస్ కొట్టాడు. ప్రస్తుతం బుల్లితెరపై బిజీ బిజీగా ఉంటున్న ఈ నటుడు రెండో పెళ్లికి రెడీ అయ్యాడు.

Basha Shek
|

Updated on: Nov 10, 2024 | 1:06 PM

Share
లెజెండరీ సింగర్ పి.సుశీలకు మనవడు వరసయ్యే సాయికిరణ్ తల్లిదండ్రులు కూడా సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్లే.  తండ్రి అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ సినిమాల్లో పాటలు ఆలపించారు.

1 / 6
 ఇలా తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ సాయికిరణ్ కూడా సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టాడు. నటుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.

2 / 6
 'నువ్వే కావాలి' మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు సాయి కిరణ్. ఆ  తర్వాత 'ప్రేమించు', 'మనసుంటే చాలు', 'ఎంత బావుందో' తదితర చిత్రాల్లో హీరోగా నటించి మెప్పించాడు.

3 / 6
 కొన్ని సినిమాల్లోనూ సహాయక నటుడిగానూ మెప్పించిన సాయి కిరణ్ ఇప్పుడు టాలీవుడ్ బుల్లితెరపై సత్తా చాటుతున్నాడు. గుప్పెడంత మనసు, కోయిలమ్మ, పడమటి సంధ్యరాగం సీరియల్స్ అతనికి మంచి గుర్తింపు తీసుకొచ్చాయి

4 / 6
 సినిమాలు, సీరియల్స్ సంగతి పక్కన పెడితే.. 2010లోనే సాయికిరణ్‌కి ఆల్రెడీ వైష్ణవి అనే అమ్మాయితో పెళ్లయిందని, ఓ పాప కూడా ఉందని తెలుస్తోంది. అయితే వీరిద్దరూ విడిపోయారని తెలుస్తోంది.

5 / 6
 ఈ నేపథ్యంలో తనతో పాటు 'కోయిలమ్మ' సీరియల్‌లో నటించిన స్రవంతితో నిశ్చితార్థం చేసుకున్నాడు సాయికిరణ్. ఇప్పుడు వీరి ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతున్నాయి.

6 / 6