AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shravya Varma: RGV మేనకోడలిని మనువాడిన కిదాంబి శ్రీకాంత్.. పెళ్లి వేడుకలో రష్మిక, విజయ్ దేవరకొండ సందడి.. వీడియో

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మేన కోడలు సెలబ్రిటీ ఫ్యాషన్ డిజైనర్ శ్రావ్య వర్మ మూడు ముళ్ల బంధంలోకి అడుగు పెట్టింది. బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ కిదాంబి శ్రీకాంత్ తో కలిసి వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. హైదరాబాద్ లో వీరి వివాహం వేడుకగా జరిగింది.

Shravya Varma: RGV మేనకోడలిని మనువాడిన కిదాంబి శ్రీకాంత్.. పెళ్లి వేడుకలో రష్మిక, విజయ్ దేవరకొండ సందడి.. వీడియో
Srikanth Kidambi, Shravya V
Basha Shek
|

Updated on: Nov 10, 2024 | 9:43 AM

Share

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రామ్‌ గోపాల్ వ‌ర్మ మేన‌కోడ‌లు, సినీ నిర్మాత, సెలబ్రిటీ ఫ్యాషన్ డిజైనర్ శ్రావ్య వర్మ, బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ కిదాంబి శ్రీకాంత్ ల పెళ్లి అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది. హైద‌రాబాద్‌లోని ఓ ప్రైవేట్ రిసార్ట్‌ వేదికగా జరిగిన ఈ వివాహ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, సన్నిహితులతో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. నూతన దంపతులను మనసారా ఆశీర్వదించారు. స్టార్ హీరోయిన్ రష్మిక, విజయ్ దేవరకొండ ఫ్యామిలీ, ‘కల్కి’ దర్శకుడు నాగ్ అశ్విన్, దర్శకుడు వంశీ పైడిపల్లి, కీర్తి సురేష్.. ఇలా పలువురు టాలీవుడ్ ప్రముఖులు శ్రావ్య- శ్రీకాంత్ పెళ్లి వేడుకల్లో తళుక్కుమన్నారు. ప్రస్తుతం ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్నాయి. సినీ సెలబ్రిటీలతో పాటు అభిమానులు, నెటిజన్లు నూతన దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా శ్రావ్య వర్మ, కిదాంబీ శ్రీకాంత్ గత కొంత కాలంగా ప్రేమలో ఉన్నారు. పెద్దలు కూడా వీరి ప్రేమను ఆశీర్వదించడంతో ఈ ఏడాది ఆగస్టులో ఇరు పెద్దల సమక్షంలో సింపుల్ గా నిశ్చితార్థం చేసుకున్నారు. ఇప్పుడు పెళ్లితో తమ బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లారీ లవ్ బర్డ్స్.

కాగా సెలబ్రిటీ ఫ్యాషన్ డిజైనర్ గా శ్రావ్య వర్మకు సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉంది. అక్కినేని నాగార్జున, విజయ్‌ దేవరకొండ, వైష్ణవ్‌ తేజ్‌, విక్రమ్‌, ధ్రువ్ ,రష్మిక మందన్నా తదితర స్టార్స్‌కు ఆమె స్టైలిస్ట్‌గా పని చేశారు. ఇక చిలసౌ, మ్యాస్ట్రో సినిమాలకు శ్రావ్య కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా ప‌ని చేయడం విశేషం.

ఇవి కూడా చదవండి

శ్రావ్య వర్మ పెళ్లిలో రష్మిక మందన్నా.. వీడియో..

ప్ర‌స్తుతం రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోన్న లేడీ ఓరియంటెడ్ మూవీ ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’ మూవీకి కూడా వర్క్ చేస్తోంది. ఇక గతంలో. కీర్తిసురేశ్ ప్ర‌ధాన పాత్ర‌లో నటించిన ‘గుడ్‌ లఖ్‌ సఖి’ చిత్రానికి సహ నిర్మాతగా వ్య‌వ‌హ‌రించింది శ్రావ్య వర్మ.

నూతన దంపతులను ఆశీర్వదించిన సినీ ప్రముఖులు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..