AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jr NTR: ఈ బుడ్డోడు ఇప్పుడు హీరో అయిపోయాడు.. ఈ ఫొటోలో జూనియర్ ఎన్టీఆర్‌తో ఉన్నదెవరో గుర్తు పట్టారా?

జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉన్నాడు. అతను నటించిన దేవర సినిమా 500 కోట్లకు పైగానే వసూళ్లు రాబట్టింది. ప్రస్తుతం ఓటీటీలో రికార్డులు సృష్టించేందుకు సిద్ధమయ్యాడు దేవర. అయితే జూనియర్ ఎన్టీఆర్ కు సంబంధించిన ఫొటో ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

Jr NTR: ఈ బుడ్డోడు ఇప్పుడు హీరో అయిపోయాడు.. ఈ ఫొటోలో జూనియర్ ఎన్టీఆర్‌తో ఉన్నదెవరో గుర్తు పట్టారా?
Jr NTR
Basha Shek
|

Updated on: Nov 09, 2024 | 10:59 AM

Share

పై ఫొటోలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ఉన్నదెవరో గుర్తు పట్టారా? ఈ పిల్లాడు త్వరలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలోకి హీరోగా అడుగు పెడుతున్నాడు. గతంలో పలు సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కంచిన ఓ సీనియర్ డైరెక్టర్ మార్గదర్శకత్వంలో ఇండస్ట్రీకి పరిచయం కానున్నాడు. ఇటీవలే ఈ కొత్త సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. అంతేకాదు ఈ కొత్త హీరోకు సంబంధించిన లుక్ ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ఫొటోల్లో మ్యాన్లీ లుక్ తో ఎంతో అందంగా కనిపించాడీ హీరో. దీంతో పలువురు సినీ ప్రముఖులు కూడ ఈ అప్ కమింగ్ హీరోకు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పట్టాలెక్కనుందని సమాచారం. ప్రస్తుతం నందమూరి అభిమానుల నోళ్లల్లో బాగా నానుతోన్న ఈ అప్ కమింగ్ హీరోను గుర్తు పట్టారా? యస్..అతను మరెవరో కాదు నందమూరి హరికృష్ణ మనవడు, దివంగత జానకిరామ్ కొడుకు నందమూరి తారక రామారావు అలియాస్ రామ్. ఇది అతని చిన్ననాటి ఫొటో. ఒక ఫంక్షన్ లో భాగంగా ఇలా బాబాయి ఎన్టీఆర్ తో ఫొటోలు దిగాడు జానకీ రామ్ కొడుకు. రామ్ సినిమా ఎంట్రీ నేపథ్యంలో ప్రస్తుతం ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతున్నాయి.

హరికృష్ణ ముగ్గురు కొడుకులు కాగా జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ హీరోలుగా రాణిస్తున్నారు.పెద్ద కొడుకు జానకిరామ్ మాత్రం నిర్మాణానికే పరిమితమయ్యారు. అయితే దురదృష్టవశాత్తూ ఆయన 2014 లో రోడ్డు ప్రమాదానికి గురై కన్నుమూశారు. అయితే ఇప్పుడు జానకిరామ్ పెద్ద కుమారుడు హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. గత 18 నెలలుగా సీనియర్ దర్శకుడు వైవీఎస్ చౌదరి పర్యవేక్షణలో నటనలో శిక్షణ తీసుకుంటున్నాడు రామ్. ఇప్పుడు ఆయన దర్శకత్వంలోనే తెరకు పరిచయం అవుతున్నారు. కాగా ఇప్పటికే ఎన్టీఆర్ ఆల టైమ్ క్లాసిక సినిమ దానవీర శూర కర్ణ సినిమాలో కృష్ణుడి పాత్రలో బాల నటుడిగా మెప్పించారు రామ్‌. ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. దీంతో నందమూరి అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.

ఇవి కూడా చదవండి

సినిమాల్లోకి మరో ఎన్టీఆర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్