AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Venu Swamy: వేణుస్వామికి షాక్.. మళ్లీ నోటీసులు పంపిన మహిళా కమిషన్‌.. అరెస్ట్ తప్పదా?

నిత్యం సెల‌బ్రిటీల జాత‌కాలు చెబుతూ వార్తల్లో నిలిచే వేణు స్వామి ఆ మధ్యన వరుసగా వివాదాలు ఎదుర్కొన్నాడు. ముఖ్యంగా నాగ చైతన్య, శోభితల భవిష్యత్ ఇదేనంటూ చెప్పి తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకున్నాడు. అక్కినేని అభిమానులతో పాటు మహిళా సంఘాలు కూడ వేణుస్వామి వ్యాఖ్యలపై మండిపడ్డారు.

Venu Swamy: వేణుస్వామికి షాక్.. మళ్లీ నోటీసులు పంపిన మహిళా కమిషన్‌.. అరెస్ట్ తప్పదా?
Venu Swamy
Basha Shek
|

Updated on: Nov 08, 2024 | 1:46 PM

Share

నాగ చైతన్య, శోభితల వైవాహిక జీవితం మీద కామెంట్స్ చేసిన వేణు స్వామికి భారీ షాక్ తగిలింది. ఈ కేసు విషయంలో మహిళా కమిషన్ ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 14 వ తేదీన కమిషన్ ముందు హాజరవ్వాలని ఆ నోటీసుల్లో కోరింది. దీంతో వేణు స్వామి ఇష్యూ మరోసారి వెలుగులోకి వచ్చింది. కాగా వేణు స్వామికి మహిళా కమిషన్ నోటీసులు పంపడం ఇది రెండోసారి. గతంలో ఇదే విషయంలో నోటీసులు పంపగా వేణు స్వామి విచారణకు హాజరు కాలేదు. అంతేకాదు హైకోర్టును ఆశ్రయించి స్టేను తెచ్చుకున్నాడు. అయితే ఇటీవల ఆ స్టేను కోర్టు ఎత్తివేసింది. మహిళా కమిషన్ కు నోటీసులు జారీ చేసే అధికారముందని తీర్పు చెప్పింది. దీంతో రెండో సారి వేణు స్వామికి నోటీసులు జారీ చేసిన మహిళా కమిషన్ ఈ నెల 14 వ తేదీన విచారణకు హజరవ్వాలని ఆదేశించింది. మ‌రి ఈసారైనా వేణు స్వామిక‌మిష‌న్ విచారణకు హాజరవుతారో? లేదో? చూడాలి.

కాగా ఈ ఏడాది ఆగస్టులో నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ల నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. నాగచైతన్య-శోభిత ల ఎంగేజ్ మెంట్ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అందరితో పంచుకున్నారు నాగార్జున. అయితే ఈ ఎంగేజ్ మెంట్ జరిగిన రెండో రోజులకే ప్రముఖ జ్యోతిష్కుడు వేణుస్వామి ఈ జంటపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో సమంత – చైతన్య విడిపోయినట్లే నాగచైతన్య – శోభిత కూడా విడాకులు తీసుకుంటారని జోస్యం చెప్పాడు. వేణు స్వామి వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో నెట్టింట బాగా వైరల్ గా మారింది. దీంతో అక్కినేని అభిమానులు స్వామిజీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక శోభిత, సమంతల మీద కామెంట్స్ చేసినందుకు గానూ వేణు స్వామిపై మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసింది ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ . ఈ మేరకు మహిళా కమిషన్ వేణుస్వామికి నోటీసులు ఇచ్చి విచారణకు హాజరవ్వాలని ఆదేశాలిచ్చింది.

ఇవి కూడా చదవండి

వేణు స్వామి లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..

తల్లి ద్వాదశ దినకర్మ కార్యక్రమాల్లో వేణు స్వామి..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

'ధురంధర్'లో విలన్‌ రోల్‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ హీరో ఎవరంటే?
'ధురంధర్'లో విలన్‌ రోల్‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ హీరో ఎవరంటే?
చచ్చాంరా బాబోయ్...అసలే ఉప్పు తినొద్దంటుంటే అందులోనూ కల్తీనా?
చచ్చాంరా బాబోయ్...అసలే ఉప్పు తినొద్దంటుంటే అందులోనూ కల్తీనా?
కష్టాలను తట్టుకుని పట్టుదలే పెట్టుబడిగా.. పర్పుల్ డ్రీమ్స్‌తో..
కష్టాలను తట్టుకుని పట్టుదలే పెట్టుబడిగా.. పర్పుల్ డ్రీమ్స్‌తో..
రథ సప్తమి నుంచి వారి జీవితాల్లో కొత్త వెలుగులు..!
రథ సప్తమి నుంచి వారి జీవితాల్లో కొత్త వెలుగులు..!
వివాదాల సుడిగుండంలో టాక్సిక్ టీజర్
వివాదాల సుడిగుండంలో టాక్సిక్ టీజర్
ఫేక్.. ప్లాస్టిక్ కోడి గుడ్లను ఎలా గుర్తించాలో తెలుసా?
ఫేక్.. ప్లాస్టిక్ కోడి గుడ్లను ఎలా గుర్తించాలో తెలుసా?
వాహనదారులకు కేంద్రం బిగ్ షాక్.. ఇకపై టోల్ చెల్లించాలంటే..
వాహనదారులకు కేంద్రం బిగ్ షాక్.. ఇకపై టోల్ చెల్లించాలంటే..
హైదరాబాద్‌లో ఇల్లు కట్టాలంటే కొత్త రూల్స్.. 10 అంతస్తులు దాటితే..
హైదరాబాద్‌లో ఇల్లు కట్టాలంటే కొత్త రూల్స్.. 10 అంతస్తులు దాటితే..
తీపి తిన్నా షుగర్ పెరగదా? డయాబెటిస్ బాధితులకు బంపర్ గిఫ్ట్!
తీపి తిన్నా షుగర్ పెరగదా? డయాబెటిస్ బాధితులకు బంపర్ గిఫ్ట్!
మగవాళ్లకు ఫ్రీ బస్ స్కీమ్.. ఆడవారికి నెలకు రూ.2వేలు.. ఎక్కడో..
మగవాళ్లకు ఫ్రీ బస్ స్కీమ్.. ఆడవారికి నెలకు రూ.2వేలు.. ఎక్కడో..