Jabardasth Rakesh: భద్రకాళి అమ్మవారి సన్నిధిలో రాకింగ్ రాకేష్ కూతురి నామకరణ మహోత్సవం.. ఏం పేరు పెట్టారంటే?

జబర్దస్త్ రాకింగ్ రాకేష్ ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నాడు. అటు పర్సనల్ లైఫ్ పరంగానూ, ఇటు ప్రొఫెషనల్ లైఫ్ పరంగానూ అతనికి అన్నీ శుభ శకునాలే ఎదురవుతున్నాయి. ఇటీవలే రాకింగ్ రాకేష్ తండ్రిగా ప్రమోషన్ పొంఆడు. మరోవైపు అతను హీరోగా నటిస్తోన్న మొదటి సినిమా రిలీజ్ కు సిద్ధమైంది.

Jabardasth Rakesh: భద్రకాళి అమ్మవారి సన్నిధిలో రాకింగ్ రాకేష్ కూతురి నామకరణ మహోత్సవం.. ఏం పేరు పెట్టారంటే?
Jabardasth Rocking Rakesh
Follow us
Basha Shek

|

Updated on: Nov 07, 2024 | 10:42 AM

జబర్దస్త్ కపుల్ రాకింగ్ రాకేష్, జోర్దార్ సుజాతలు ఇటీవలే అమ్మానాన్నలుగా ప్రమోషన్ పొందారు. రాకింగ్ రాకేష్ సతీమణి సుజాత పండంటి ఆడ బిడ్డను ప్రసవించింది. బుల్లితెర ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు జబర్దస్త్ కపుల్ కు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. ఇక పండంటి మహాలక్ష్మి తమ ఇంట అడుగు పెట్టడంతో రాకేష్- జోర్దార్ సుజాతల ఆనందానికి అవధుల్లేవు. ఇటీవల జరిగిన కేసీఆర్ ట్రైలర్ లాంఛింగ్ ఈవెంట్ లో తమ కూతురిని అందరికీ పరిచయం చేశారీ లవ్లీ కపుల్. అలాగే దసరా సందర్భంగా నిర్వహంచిన ఓ టీవీ షోలోనూ తమ బిడ్డతో కలిసి హాజరయ్యారు. తాజాగా ఓరుగల్లు భద్రకాళీ అమ్మవారి సన్నిధిలో తమ కూతురి నామకరణ మహోత్సవం నిర్వహించారు రాకేష్- సుజాత దంపతులు. తమ ఇంటి మహలక్ష్మకి ఖ్యాతికి అని పేరు పెట్టుకున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వారే పంచుకున్నారు. ఈ సందర్భంగ భద్రకాళీ అమ్మవారి దర్శనానికి సంబంధించిన ఫొటోలను షేర్ చేసుకున్నారీ జబర్దస్త్ కపుల్. అయితే ఇందులో తమ కూతురి ముఖం కనిపించకుండ ఎమోజీలతో కవర్ చేశారు రాకింగ్ రాకేష్- జోర్దార్ సుజాత

ఇవి కూడా చదవండి

ఇక జబర్దస్త్ తదితర టీవీ షోలతో బుల్లితెరపై బిజీ బిజీగా గడిపేస్తోన్న రాకింగ్ రాకేష్ ఇప్పుడు వెండితెర పై అలరించడానికి కూడా సిద్ధమయ్యాడు. అతను హీరోగా నటిస్తోన్న మొదటి సినిమా కేసీఆర్ (కేశవ చంద్ర రమావత్) విడుదలకు సిద్ధమైంది. ఇందులో సత్య కృష్ణన్ కూతురు అన్నన్య కృష్ణన్ కథానాయికగా నటిస్తోంది. గ్రీన్ ట్రీ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ మూవీకి గరుడవేగ అంజి దర్శకత్వం వహించారు.

భద్రకాళీ అమ్మవారి సన్నిధిలో జబర్దస్త్  కపుల్..

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న కేసీఆర్ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు రాకింగ్ రాకేష్ నే నిర్మాతగా వ్యవహరిస్తుండడం విశేషం. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉంటున్నాడు రాకింగ్ రాకేష్

కేసీఆర్ సినిమాలో రాకింగ్ రాకేష్, అనన్యా కృష్ణన్..

కేసీఆర్ సినిమా ప్రమోషన్లలో రాకింగ్ రాకేష్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!