AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhakar: కొత్తింట్లోకి అడుగుపెట్టిన కాలకేయుడు.. సందడి చేసిన సినీ ప్రముఖులు.. ఫొటోస్ వైరల్

పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన బాహుబలి సినిమాలో కాలకేయుడిగా నటించాడు ప్రభాకర్. విచిత్రమైన ఆహార్యం, వేషధారణ, భాష, యాసతో తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువయ్యాడు. ప్రస్తుతం విలన్ గా , క్యారెక్టర్ ఆర్టిస్టుగా బిజీ బిజీగా ఉంటున్నాడీ యాక్టర్.

Prabhakar: కొత్తింట్లోకి అడుగుపెట్టిన కాలకేయుడు.. సందడి చేసిన సినీ ప్రముఖులు.. ఫొటోస్ వైరల్
Bahubali Prabhakar
Basha Shek
|

Updated on: Nov 06, 2024 | 12:50 PM

Share

బాహుబలి ప్రభాకర్ కొత్త ఇంట్లోకి అడుగు పెట్టాడు. తన సొంత గ్రామం హుస్నాబాద్ లోనే నూతన గృహం నిర్మించుకున్నాడు. ఇక తాజాగా గృహ ప్రవేశ కార్యక్రమం ఘనంగా జరిగింది. తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీనివాస్, నటుడు దిల్ రమేష్ లు హాజరయ్యారు. వారిని ప్రభాకర్, సతీమణి రాజ్యలక్ష్మిలు సాదరంగా ఆహ్వానించారు. ఇక ఈ గ్రామానికి దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ రావడంతో ఆయనను చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో వచ్చారు. ఆలాగే వారితో ఫొటోలు దిగేందుకు ఎగబడ్డారు. ఇక బోయపాటి కూడా చాలా సహనంతో అభిమానులతో ముచ్చటించారు. అడిగిన వారికి ఫొటోలు, సెల్ఫీలు ఇచ్చారు. అనంతరం భోజనం చేసి హైదరాబాద్ కు వెళ్లిపోయారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.

తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రభాకర్ 2007 నుంచి సినిమాల్లో ఉన్నాడు. ఇప్పటి వరకు 5 భాషల్లో 120 కు పైగా సినిమాల్లో నటించాడు. 2007లో మహేష్ బాబు నటించిన అతిథి సినిమాతో సినిమా కెరీర్ ప్రారంభించాడు ప్రభాకర్. ఆ తర్వాత పరుగు, బుజ్జిగాడు, మర్యాద రామన్న, సీమ టపాకాయ్, దూకుడు, వీర, దమ్ము, లవ్లీ, గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది, లెజెండ్, ఆగడు, లౌక్యం, బాహుబలి, సరైనోడు, దువ్వాడ జగన్నాథం, జై సింహా, దేవదాస్, నారప్ప, అఖండ, హీరో, తదితర హిట్ సినిమాల్లో నటించాడు. అయిత వీటన్నిటికన్నా బాహుబలిలో అతను పోషించిన కాలకేయుడి పాత్ర అందరికీ గుర్తుండిపోతుంది. వీటితో పాటు కన్నడ, తమిళం, మలయాళం, భోజ్ పురి, హిందీ సినిమాల్లో నటించాడు ప్రభాకర్.

ఇవి కూడా చదవండి

గృహప్రవేశం వేడుకలో బోయపాటి శీను, తదితరులు..

Bahubali Prabhakar 1

Bahubali Prabhakar 1

ప్రభాస్ తో బాహుబలి ప్రభాకర్

హీరో సుమన్ తో బాహుబలి ప్రభాకర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..