Rajpal Yadav: సహనం కోల్పోయిన స్టార్ కమెడియన్.. ఆ ప్రశ్న అడిగినందుకు ఫోన్ లాక్కున్న వైనం.. వీడియో

బాలీవుడ్ ప్రముఖ నటుడు రాజ్ పాల్ యాదవ్ సహనం కోల్పోయారు. దీపావళి పండగకు సంబంధించి గతంలో అతను చేసిన ఒక ప్రకటనపై ప్రశ్నించడంపై కోపోద్రిక్తుడయ్యాడు. ప్రశ్న వేసిన జర్నలిస్టు మొబైల్ ఫోన్ లాక్కున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కమెడియన్ ప్రవర్తనను పలువురు ఖండిస్తున్నారు .

Rajpal Yadav: సహనం కోల్పోయిన స్టార్ కమెడియన్.. ఆ ప్రశ్న అడిగినందుకు ఫోన్ లాక్కున్న వైనం.. వీడియో
Rajpal Yadav
Follow us

|

Updated on: Nov 04, 2024 | 1:28 PM

బాలీవుడ్ స్టార్ కమెడియన్ రాజ్‌పాల్ యాదవ్‌కు ఇప్పుడు మంచి డిమాండ్ ఉంది. వరుసగా సినిమాల్లో నటిస్తున్నాడు. ఇటీవల విడుదలైన ‘భూల్ భూలయ్య 3’ చిత్రంలోనూ ఆయన కీలక పాత్ర పోషించాడు. తాజాగా సినిమా ప్రమోషన్లకు సంబంధించి ఆయన విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. తన సినిమా ప్రయాణం గురించి అడిగిన దానికి రాజ్‌పాల్ చాలా కూల్ గా రిప్లై ఇచ్చారు. అయితే దీపావళి పండుగ గురించి గతంలో తాను చేసిన ప్రకటనను ప్రశ్నించడంపై రాజ్‌పాల్ యావద్ ఫైర్ అయ్యారు . ప్రశ్న అడిగిన జర్నలిస్టు మొబైల్ ఫోన్ లాక్కోని విసిరేశారు. అంతకుముందు రాజ్‌పాల్ యావద్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. ‘ఎక్కువగా బాణాసంచా కాల్చకండి. దాని వల్ల వాయుకాలుష్యం ఏర్పడుతుంది’ అని అందులో రాసుకొచ్చారు. అయితే ఈ వీడియోను కొందరు వ్యతిరేకించారు. దీంతో రాజ్‌పాల్ యాదవ్ ఆ వీడియోను డిలీట్ చేసి క్షమాపణలు చెప్పాడు. తాజాగా మీడియా సమావేశంలో ఇదే అంశంపై ఓ ప్రశ్న ఎదురైంది.

రాజ్‌పాల్ యాదవ్ మాట్లాడుతూ, ‘ప్రేక్షకులు ప్రతి నెలన్నరకోసారి నా కొత్త సినిమా ఒకటి చూస్తారు. తర్వాత దీపావళి గురించి ఒక ప్రశ్న వచ్చింది. దీపావళి పండుగ ముందు, మీరు ఒక ప్రకటన చేశారు. జర్నలిస్టు ప్రశ్న పూర్తి చేసేలోపే రాజ్‌పాల్ యాదవ్ మొబైల్ ఫోన్ లాక్కున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతోంది. రాజ్ పాల్ యాదవ్ సహనం కోల్పోకుండా ఉండాల్సిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ వీడియోను పెట్టుకుని కొందరు స్టార్ కమెడియన్ ను ట్రోల్ చేస్తున్నారు. ‘పటాకులు కాల్చకండి’ అని రాజ్‌పాల్ యాదవ్ చెప్పడం సరైనదేనని పలువురు సమర్థించారు. మొత్తానికి సోషల్ మీడియాలో ఈ విషయంపై చర్చ నడుస్తోంది.

ఇవి కూడా చదవండి

నెట్టింట వైరలవుతోన్న వీడియో ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.