AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Guruprasad: సినిమా ఇండస్ట్రీలో విషాదం.. ఫ్యాన్‌కు ఉరేసుకుని స్టార్ డైరెక్టర్ ఆత్మహత్య.. కారణమేంటంటే?

సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. కన్నడ సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా, నటుడిగా మంచి గుర్తింపు సాధించుకున్న గురు ప్రసాద్ (50) అనుమానాస్పదంగా కన్నుమూశారు. అయితే ఆయన ఆత్మహత్యకు పాల్పడినట్లు పలువురు అనుమానిస్తున్నారు.

Guruprasad: సినిమా ఇండస్ట్రీలో విషాదం.. ఫ్యాన్‌కు ఉరేసుకుని స్టార్ డైరెక్టర్ ఆత్మహత్య.. కారణమేంటంటే?
Guruprasad
Basha Shek
|

Updated on: Nov 03, 2024 | 12:55 PM

Share

కన్నడ భాషలో పలు సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించి, కొన్ని సినిమాల్లో కూడా నటించిన గురుప్రసాద్ అనుమానాస్పదంగా కన్నుమూశారు. మదనాయకహళ్లిలోని అపార్ట్‌మెంట్‌లో అతని మృతదేహం వేలాడుతూ కనిపించింది. అప్పులకు భయపడి గురుప్రసాద్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని స్థానికులు చెబుతున్నారు. గురుప్రసాద్ ఇటీవల దర్శకత్వం వహించిన ‘రంగనాయక’ చిత్రం ఘోర పరాజయం పాలైంది. దీంతో అతను పూర్తిగా అప్పుల పాలయ్యాడు. అంతే కాకుండా కొన్ని నెలల క్రితం గురుప్రసాద్ రెండో పెళ్లి చేసుకున్నట్లు సమాచారం. గురుప్రసాద్ గత ఎనిమిది నెలలుగా బెంగళూరు ఉత్తర తాలూకాలోని మదనాయకనహళ్లి సమీపంలోని టాటా న్యూ హావెల్ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నాడు. ఇప్పుడు అక్కడే గురుప్రసాద్ మృతదేహం కనిపించింది. ఇంట్లో నుంచి దుర్వాసన వస్తోందని గమనించిన స్థానికులు తిరిగి చూడగా ఫ్యానీకి వేలాడుతున్న గురుప్రసాద్ మృతదేహం కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో మదనాయకనహళ్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. గురుప్రసాద్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా ఈ వార్త తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. గురు ప్రసాద్ మృతికి నివాళి అర్పిస్తున్నారు.

కన్నడ సినీ ప్రముఖ దర్శకుల్లో గురుప్రసాద్ ఒకరు. ‘మఠం’ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన గురుప్రసాద్ తొలి సినిమాతోనే రాష్ట్రస్థాయి అవార్డు అందుకున్నాడు. ఆ తర్వాత దర్శకత్వం వహించిన ‘ఎద్దేలు మంజునాథ’ భారీ హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత ‘డైరెక్టర్స్ స్పెషల్’ సినిమా చేశాడు. ఈ సినిమా ద్వారా డాలీ ధనంజయ్ హీరోగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత 2017లో ‘అడ్రడ సాల్’ చిత్రానికి దర్శకత్వం వహించారు. సినిమా ఓ మోస్తరు విజయం సాధించింది. ‘ఎరదనే సాలా’ సినిమా తర్వాత పెద్ద బ్రేక్ తీసుకున్న గురుప్రసాద్.. అదే ఏడాది జగ్గేష్ తో ‘రంగనాయక’ సినిమా చేశాడు. ఆ సినిమా థియేటర్లలో అట్టర్ ఫ్లాప్ అయింది. ‘రంగనాయక’ సినిమా పరాజయంతో డిస్టర్బ్ అయిన గురుప్రసాద్ చాలా అప్పుల్లో కూరుకుపోయాడు. ఇక కుటుంబ కలహాల కారణంగా గురుప్రసాద్ మొదటి భార్యతో విడిపోయాడు. కొన్ని నెలల క్రితమే రెండో పెళ్లి కూడా చేసుకున్నాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ములక్కాడ గుజ్జు కర్రీ.. అన్నం, చపాతీల్లోకి టేస్ట్ అదిరిపోతోంది
ములక్కాడ గుజ్జు కర్రీ.. అన్నం, చపాతీల్లోకి టేస్ట్ అదిరిపోతోంది
మెట్రోలో సాంకేతిక సమస్య.. ఆ రూట్‌లో రాకపోకలకు అంతరాయం!
మెట్రోలో సాంకేతిక సమస్య.. ఆ రూట్‌లో రాకపోకలకు అంతరాయం!
మాల్దీవులు కాదు..అందమైన డంపింగ్ యార్డ్.. షుటింగ్స్‌తో బిజీబిజీ
మాల్దీవులు కాదు..అందమైన డంపింగ్ యార్డ్.. షుటింగ్స్‌తో బిజీబిజీ
ఆ ఒక్కడు రిటైర్ అయ్యాక.. టీమిండియా పరిస్థితి తలుచుకుంటే
ఆ ఒక్కడు రిటైర్ అయ్యాక.. టీమిండియా పరిస్థితి తలుచుకుంటే
ఈ టాలీవుడ్ నటుడు మొన్నటివరకు HYD ఎలక్ట్రిసిటీ బోర్డులో వర్కర్
ఈ టాలీవుడ్ నటుడు మొన్నటివరకు HYD ఎలక్ట్రిసిటీ బోర్డులో వర్కర్
ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే.. చుట్టకు నిప్పు కావాలన్నట్టుంది..
ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే.. చుట్టకు నిప్పు కావాలన్నట్టుంది..
వాడు ఆడుతోన్న తీరు చూస్తే వణుకొస్తోంది.. గేల్ కంటే డేంజరస్
వాడు ఆడుతోన్న తీరు చూస్తే వణుకొస్తోంది.. గేల్ కంటే డేంజరస్
పురుషులకు నో ఎంట్రీ! పూర్తిగా మహిళల పాలనలోనే ఈ రైల్వే స్టేషన్..
పురుషులకు నో ఎంట్రీ! పూర్తిగా మహిళల పాలనలోనే ఈ రైల్వే స్టేషన్..
కొత్త ఆదాయపు పన్ను విధానం! CTCపై పన్ను..?
కొత్త ఆదాయపు పన్ను విధానం! CTCపై పన్ను..?
పక్కా మాస్ సాంగ్.. యూట్యూబ్‏ను ఊపేస్తున్న ఫోక్ సాంగ్..
పక్కా మాస్ సాంగ్.. యూట్యూబ్‏ను ఊపేస్తున్న ఫోక్ సాంగ్..