Tollywood: వేణుమాధవ్‌, ఉదయభానులతో ఉన్న ఈ బక్కపల్చని అబ్బాయిని గుర్తు పట్టారా? జబర్దస్త్ స్టార్ కమెడియన్

వన్స్‌ మోర్‌ ప్లీజ్‌.. 2000 వ దశకంలో బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నట్యాలెంట్ హంట్ షో. ఓ ప్రముఖ ఛానెల్‌లో ప్రసారమైన ఈ షోకు దివంగత నటుడు వేణుమాధవ్‌, ఉదయభాను యాంకర్లుగా వ్యవహరించారు. ఈ టీవీ షోతో వచ్చిన క్రేజ్ తోనే వేణు మాధవ్ కెరీర్ స్పీడ్ అందుకుంది.

Tollywood: వేణుమాధవ్‌, ఉదయభానులతో ఉన్న ఈ బక్కపల్చని అబ్బాయిని గుర్తు పట్టారా? జబర్దస్త్ స్టార్ కమెడియన్
Tollywood Actors
Follow us
Basha Shek

|

Updated on: Nov 02, 2024 | 12:53 PM

వన్స్ మోర్ ప్లీజ్.. ఇప్పటి జనరేషన్ కు ఈ టీవీషో గురించి పూర్తి తెలయకపోవచ్చు. కానీ ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటీనటులుగా వెలుగొందుతోన్న వారికి తమ ట్యాలెంట్ ను పరిచయం చేసుందుకు ఈ షో చక్కని వేదికగా ఉపయోగపడింది. ఈ టీవీ షోతోనే వేణు మాధవ్‌ కెరీర్ ఆరంభించాడు. ఆ తర్వాత సినిమాల్లోకి అడుగు పెట్టి స్టార్ కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఉదయభాను కూడా స్టార్‌ యాంకర్‌గా తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువైంది. ఇక ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ కమెడియన్లుగా వెలుగొందుతోన్న నటీనటులు, మిమిక్రీ ఆర్టిస్టుల్లో చాలా మంది ఈ టీవీ ప్రోగ్రామ్ లో కనిపించారు. అందులో ఒక జబర్దస్త్ కమెడియన్‌ కూడా ఉన్నాడు. కెరీర్‌ ప్రారంభంలో అతను మిమిక్రీ ఆర్టిస్టుగా వన్స్‌ మోర్‌ ప్లీజ్‌ టీవీషోలో పాల్గొని అదృష్టం పరీక్షించుకున్నాడు. షోకు వచ్చినప్పుడే యాంకర్లు ఉదయభాను, వేణుమాధవ్‌లతో సరదాగా ఫొటోలు దిగాడు. పై ఫొటో అదే. మరి ఇందులో ఉదయభాను వేణు మాధవ్ ల మధ్య ఉన్నదెవరో గుర్తు పట్టారా? బక్కపల్చటి దేహంతో కనిపిస్తున్న అతను ఇప్పుడు టాలీవుడ్‌లోస్టార్ కమెడియన్‌. జబర్దస్త్‌ కామెడీ షోతో బుల్లితెర ఆడియెన్స్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. అదే క్రమంలో సినిమాల్లోకి అడుగు పెట్టాడు. ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తున్నాడు. మరి ఈ అబ్బాయెవరో గుర్తు పట్టారా? కొంచెం కష్టంగా ఉందా? అయితే మీకో క్లూ .. ‘ఆగుతావా ఓ రెండు నిమిషాలు’ అంటూ సిగ్నేచర్ డైలాగ్ తో ఈ కమెడియన్ బాగా ఫేమస్.

ఇవి కూడా చదవండి

యస్.. ఇందులో ఉన్నది మరెవరో కాదు రచ్చ రవి. గతేడాది బలగం, భగవంత్ కేసరితో పాటు ఏకంగా అరడజనకు పైగా సినిమాల్లో నటించాడు రచ్చరవి. ఇక ఈ ఏడాది కిస్మత్, భీమా, ఓం భీమ్ బుష్, పురుషోత్తముడు, భలే ఉన్నాడే, లగ్గం, ఉత్సవం అంటూ ఇప్పటికే అరడజనుకు పైగా సినిమాల్లో యాక్ట్ చేశాడు.

దీపావళి వేడుకల్లో రచ్చ రవి..

View this post on Instagram

A post shared by Racha Ravi (@meracharavi)

తన కామెడీతో అందరినీ కడుపుబ్బా నవ్వించిన రచ్చ రవిలో మిమిక్రీ ట్యాలెంట్‌ కూడా ఉంది. అందులో భాగంగానే కెరీర్‌ ప్రారంభంలో వన్స్‌ మోర్‌ ప్లీజ్‌ షోకు హాజరయ్యాడు. మిమిక్రీ ఆర్టిస్ట్‌గా తన అదృష్టం పరీక్షించుకున్నాడు. జెమినీ టీవీలో వన్స్ మోర్ ప్లీజ్ అనే పోగ్రాంలో వేణు మాధవ్ ,ఉదయభాను యాంకర్ గా ఉన్నప్పుడు మిమిక్రీ ఆర్టిస్ట్ గా చేశా’ అంటూ తన మధుర జ్ఞాపకాన్ని పంచుకున్నాడు రచ్చ రవి.

నాగ బాబుతో రచ్చ రవి..

View this post on Instagram

A post shared by Racha Ravi (@meracharavi)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?