- Telugu News Photo Gallery Cricket photos Diwali 2024: Smriti Mandhana and Shreyanka Patil Diwali festival celebrations photos go viral
Diwali 2024: దీపావళి వేడుకల్లో మెరిసిన భారత మహిళా క్రికెటర్లు.. ఫొటోస్ చూశారా?
దేశవ్యాప్తంగా దీపావళి సంబరాలు అంబరాన్నంటాయి. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఈ పండగను ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సామాన్యులతో క్రీడా ప్రముఖులు దీపావళి పర్వదినాన్ని అట్టహాసంగా జరుపుకొన్నారు. అనంతరం తమ వేడుకలకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
Updated on: Nov 01, 2024 | 8:04 PM

సామాన్యులతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు దీపావళి పండగను అట్టహాసంగా జరుపుకొన్నారు. ఇక టీమిండియా క్రికెటర్లు తమ కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులతో కలిసి ఈ ఫెస్టివల్ ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు.

మహిళా క్రికెటర్లు స్మృతి మంథాన, ప్రియాంక పాటిల్ తమ దీపావళి సెలబ్రేషన్స్ కు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. దీంతో అవి కాస్తా వైరల్ గా మారాయి.

ఈ ఫొటోల్లో సంప్రదాయ దుస్తుల్లో ఎంతో అందంగా కనిపించారు స్మృతి మంథాన, ప్రియాంక పాటిల్. అలాగే తమ ఇళ్లను కూడా దీపాలతో అందంగా అలంకరించారు.

ప్రస్తుతం మహిళా క్రికెటర్ల దీపావళి సెలబ్రేషన్స్ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. వీటిని చూసిన అభిమానులు, నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు

కాగా స్మృతి మంథాన, ప్రియాంక పాటిల్ వుమెన్ ప్రీమియర్ లీగ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈ ఏడాది ఆర్సీబీ చాంపియన్‌గా నిలవడంలో వీరిద్దరు కీలక పాత్ర పోషించారు.





























