AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శ్రీ వెంకటేశ్వరుడి క్షేత్రాన్ని కాపాడేది ఎవరు? తిరుమల క్షేత్రపాలకుడికి రుద్రాభిషేకం సీక్రెట్ ఇదే..!

Tirumala Kshetrapalakudu: తిరుమల క్షేత్రం అనేది కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు; అది అనేక ఆధ్యాత్మిక రహస్యాలు, పురాణ గాథలు, విశేష సంప్రదాయాలు నిండిన దివ్యస్థలం. అలాంటి ఈ పవిత్ర క్షేత్రాన్ని ఎల్లప్పుడూ రక్షిస్తూ కాపాడే ఒక ప్రత్యేక శక్తి ఉందని పురాణాలు చెబుతాయి. ఆ శక్తిని “క్షేత్రపాలకుడు” అని అంటారు. క్షేత్రపాలకుడు అనగా ఆ ఆలయం లేదా పుణ్యక్షేత్రాన్ని రక్షిస్తూ, అక్కడి పవిత్రతను కాపాడే దైవశక్తి. మరి తిరుమల క్షేత్రానికి క్షేత్రపాలకుడిగా ఎవరు ఉన్నారు? ఆ విశేషాలు ఏమిటో తెలుసుకుందాం.

Rajashekher G
|

Updated on: Mar 08, 2026 | 12:37 PM

Share
కలియుగంలో భక్తులకు ప్రత్యక్ష దైవంగా భావించబడే శ్రీ వేంకటేశ్వర స్వామి వెలసిన పవిత్ర స్థలం తిరుమల. ఈ పుణ్యక్షేత్రం “కలియుగ వైకుంఠం”గా విశేష ఖ్యాతిని పొందింది. ప్రపంచ నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు ప్రతి రోజు ఈ పవిత్ర క్షేత్రానికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటూ తమ జీవితాలను ధన్యంగా భావిస్తారు. “నిత్యకళ్యాణం పచ్చతోరణం” అనే మాటకు సాక్ష్యంగా, ఈ క్షేత్రంలో ఎల్లప్పుడూ మంగళకరమైన వాతావరణం   నెలకొని ఉంటుంది. భక్తుల నమ్మకాల ప్రకారం ఇక్కడ జరిగే ప్రతి ఉత్సవం, ప్రతి సేవ ప్రత్యేకమైన ఆధ్యాత్మిక శక్తిని ప్రసరిస్తుంది.

కలియుగంలో భక్తులకు ప్రత్యక్ష దైవంగా భావించబడే శ్రీ వేంకటేశ్వర స్వామి వెలసిన పవిత్ర స్థలం తిరుమల. ఈ పుణ్యక్షేత్రం “కలియుగ వైకుంఠం”గా విశేష ఖ్యాతిని పొందింది. ప్రపంచ నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు ప్రతి రోజు ఈ పవిత్ర క్షేత్రానికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటూ తమ జీవితాలను ధన్యంగా భావిస్తారు. “నిత్యకళ్యాణం పచ్చతోరణం” అనే మాటకు సాక్ష్యంగా, ఈ క్షేత్రంలో ఎల్లప్పుడూ మంగళకరమైన వాతావరణం నెలకొని ఉంటుంది. భక్తుల నమ్మకాల ప్రకారం ఇక్కడ జరిగే ప్రతి ఉత్సవం, ప్రతి సేవ ప్రత్యేకమైన ఆధ్యాత్మిక శక్తిని ప్రసరిస్తుంది.

1 / 8
తిరుమల క్షేత్రం అనేది కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు; అది అనేక ఆధ్యాత్మిక రహస్యాలు, పురాణ గాథలు, విశేష సంప్రదాయాలు నిండిన దివ్యస్థలం. ఇక్కడ ప్రతి రాయి, ప్రతి కొండ, ప్రతి తీర్థం వెనుక ఒక కథ ఉంది. అలాంటి ఈ పవిత్ర క్షేత్రాన్ని ఎల్లప్పుడూ రక్షిస్తూ కాపాడే ఒక ప్రత్యేక శక్తి ఉందని పురాణాలు చెబుతాయి. ఆ శక్తిని “క్షేత్రపాలకుడు” అని అంటారు. క్షేత్రపాలకుడు అనగా ఆ ఆలయం లేదా పుణ్యక్షేత్రాన్ని రక్షిస్తూ, అక్కడి పవిత్రతను కాపాడే దైవశక్తి. మరి తిరుమల క్షేత్రానికి క్షేత్రపాలకుడిగా ఎవరు ఉన్నారు? ఆ విశేషాలు ఏమిటో తెలుసుకుందాం.

తిరుమల క్షేత్రం అనేది కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు; అది అనేక ఆధ్యాత్మిక రహస్యాలు, పురాణ గాథలు, విశేష సంప్రదాయాలు నిండిన దివ్యస్థలం. ఇక్కడ ప్రతి రాయి, ప్రతి కొండ, ప్రతి తీర్థం వెనుక ఒక కథ ఉంది. అలాంటి ఈ పవిత్ర క్షేత్రాన్ని ఎల్లప్పుడూ రక్షిస్తూ కాపాడే ఒక ప్రత్యేక శక్తి ఉందని పురాణాలు చెబుతాయి. ఆ శక్తిని “క్షేత్రపాలకుడు” అని అంటారు. క్షేత్రపాలకుడు అనగా ఆ ఆలయం లేదా పుణ్యక్షేత్రాన్ని రక్షిస్తూ, అక్కడి పవిత్రతను కాపాడే దైవశక్తి. మరి తిరుమల క్షేత్రానికి క్షేత్రపాలకుడిగా ఎవరు ఉన్నారు? ఆ విశేషాలు ఏమిటో తెలుసుకుందాం.

2 / 8

క్షేత్రపాలక శిల ఎక్కడ ఉంది?..

తిరుమల శ్రీవారి ఆలయంలో ధ్వజస్తంభ మండపం ప్రాంగణంలో, బలిపీఠానికి ఈశాన్య దిశలో బలిపీఠం ఆకారంలోనే సుమారు ఒకటిన్నర అడుగుల ఎత్తులో ఉన్న శిలా పీఠం కనిపిస్తుంది. దీనినే క్షేత్రపాలక శిల అని పిలుస్తారు.
పురాణాల ప్రకారం తిరుమల క్షేత్రానికి క్షేత్రపాలకుడిగా రుద్రుడు (శివుడు) ఉన్నాడు. వేంకటాచల మహత్యం వంటి పురాణాలలో కూడా ఈ విషయాన్ని ప్రస్తావించారు.

క్షేత్రపాలక శిల ఎక్కడ ఉంది?.. తిరుమల శ్రీవారి ఆలయంలో ధ్వజస్తంభ మండపం ప్రాంగణంలో, బలిపీఠానికి ఈశాన్య దిశలో బలిపీఠం ఆకారంలోనే సుమారు ఒకటిన్నర అడుగుల ఎత్తులో ఉన్న శిలా పీఠం కనిపిస్తుంది. దీనినే క్షేత్రపాలక శిల అని పిలుస్తారు. పురాణాల ప్రకారం తిరుమల క్షేత్రానికి క్షేత్రపాలకుడిగా రుద్రుడు (శివుడు) ఉన్నాడు. వేంకటాచల మహత్యం వంటి పురాణాలలో కూడా ఈ విషయాన్ని ప్రస్తావించారు.

3 / 8

క్షేత్రపాలక శిల విశిష్టత..

పూర్వకాలంలో ఈ శిల రుద్రుని పూర్ణాంశంతో ప్రకాశిస్తూ ఆలయం చుట్టూ తిరుగుతూ కాపలా కాస్తూ ఉండేదని చెబుతారు. ప్రతి రాత్రి ఆలయ అర్చకులు ఇంటికి వెళ్లేటప్పుడు ఆలయ తాళాలను ఈ శిలపై ఉంచి నమస్కరించి వెళ్తుండేవారు. తెల్లవారిన తరువాత తిరిగి వచ్చి ఆ శిలకు నమస్కరించి తాళాలను తీసుకుని ఆలయ సేవలను ప్రారంభించేవారు.
ఒకసారి రాత్రివేళ ఈ శిల ఆలయం చుట్టూ తిరుగుతున్న సమయంలో అనుకోని ఘటన జరగడంతో, భవిష్యత్తులో అలాంటి సంఘటనలు జరగకుండా ఆ శిలను ఆలయ ప్రాంగణం నుంచి తీసి గోగర్భ తీర్థం వద్దకు తరలించినట్లు చెబుతారు.

క్షేత్రపాలక శిల విశిష్టత.. పూర్వకాలంలో ఈ శిల రుద్రుని పూర్ణాంశంతో ప్రకాశిస్తూ ఆలయం చుట్టూ తిరుగుతూ కాపలా కాస్తూ ఉండేదని చెబుతారు. ప్రతి రాత్రి ఆలయ అర్చకులు ఇంటికి వెళ్లేటప్పుడు ఆలయ తాళాలను ఈ శిలపై ఉంచి నమస్కరించి వెళ్తుండేవారు. తెల్లవారిన తరువాత తిరిగి వచ్చి ఆ శిలకు నమస్కరించి తాళాలను తీసుకుని ఆలయ సేవలను ప్రారంభించేవారు. ఒకసారి రాత్రివేళ ఈ శిల ఆలయం చుట్టూ తిరుగుతున్న సమయంలో అనుకోని ఘటన జరగడంతో, భవిష్యత్తులో అలాంటి సంఘటనలు జరగకుండా ఆ శిలను ఆలయ ప్రాంగణం నుంచి తీసి గోగర్భ తీర్థం వద్దకు తరలించినట్లు చెబుతారు.

4 / 8

గోగర్భంలో పూర్ణ స్వరూపం..

ప్రస్తుతం క్షేత్రపాలక శిల పూర్ణ స్వరూపంలో గోగర్భ తీర్థం (పాండవ తీర్థం) వద్ద ఉంది. అలాగే దాని అంశ స్వరూపం తిరుమల శ్రీవారి ఆలయంలో ధ్వజస్తంభ మండపంలో దర్శనమిస్తుంది. భక్తులు ఆనందనిలయంలో ఈ అంశ స్వరూపాన్ని దర్శించవచ్చు.

గోగర్భంలో పూర్ణ స్వరూపం.. ప్రస్తుతం క్షేత్రపాలక శిల పూర్ణ స్వరూపంలో గోగర్భ తీర్థం (పాండవ తీర్థం) వద్ద ఉంది. అలాగే దాని అంశ స్వరూపం తిరుమల శ్రీవారి ఆలయంలో ధ్వజస్తంభ మండపంలో దర్శనమిస్తుంది. భక్తులు ఆనందనిలయంలో ఈ అంశ స్వరూపాన్ని దర్శించవచ్చు.

5 / 8

మహాశివరాత్రి రోజున ప్రత్యేక అభిషేకం..

ప్రతి సంవత్సరం మహాశివరాత్రి రోజున అర్చకులు, ఆలయ అధికారులు, భక్తులు మంగళవాయిద్యాలతో గోగర్భ తీర్థానికి వెళ్తారు. అక్కడ ఏకాదశ రుద్రంతో క్షేత్రపాలకుడైన రుద్రునికి శాస్త్రోక్తంగా అభిషేకం నిర్వహిస్తారు. అనంతరం ఆ శిలకు వెండి నామాలు, కండ్లు అమర్చి పుష్పాలతో అలంకరిస్తారు. ధూపదీపాలతో అర్చనలు చేసి వడపప్పు, పండ్లు, పానకం వంటి నైవేద్యాలను సమర్పించి భక్తులకు ప్రసాదంగా పంచుతారు.

మహాశివరాత్రి రోజున ప్రత్యేక అభిషేకం.. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి రోజున అర్చకులు, ఆలయ అధికారులు, భక్తులు మంగళవాయిద్యాలతో గోగర్భ తీర్థానికి వెళ్తారు. అక్కడ ఏకాదశ రుద్రంతో క్షేత్రపాలకుడైన రుద్రునికి శాస్త్రోక్తంగా అభిషేకం నిర్వహిస్తారు. అనంతరం ఆ శిలకు వెండి నామాలు, కండ్లు అమర్చి పుష్పాలతో అలంకరిస్తారు. ధూపదీపాలతో అర్చనలు చేసి వడపప్పు, పండ్లు, పానకం వంటి నైవేద్యాలను సమర్పించి భక్తులకు ప్రసాదంగా పంచుతారు.

6 / 8

అనాదిగా కొనసాగుతున్న సంప్రదాయం..

తిరుమల దర్శనానికి వెళ్లే అనేక మంది భక్తులు గోగర్భ తీర్థానికి వెళ్లి క్షేత్రపాలక శిలను దర్శించుకుంటారు. అలాగే ప్రతిరోజూ తెల్లవారుజామున ప్రధాన అర్చకులు ఆలయ సేవలకు వచ్చే సమయంలో తాళాల గుత్తిని, కుంచెకోలను క్షేత్రపాలక శిలకు తాకించి నమస్కరించి తరువాతే ఆలయంలోకి ప్రవేశిస్తారు. రాత్రి ఏకాంత సేవ అనంతరం కూడా అర్చకులు తమ బీగాలు, కుంచెకోలను ఈ శిలకు తాకించి నమస్కరించిన తరువాతనే ఇంటికి వెళ్తారు. ఈ సంప్రదాయం ప్రాచీన కాలం నుంచి నేటి వరకు కొనసాగుతోంది.

అనాదిగా కొనసాగుతున్న సంప్రదాయం.. తిరుమల దర్శనానికి వెళ్లే అనేక మంది భక్తులు గోగర్భ తీర్థానికి వెళ్లి క్షేత్రపాలక శిలను దర్శించుకుంటారు. అలాగే ప్రతిరోజూ తెల్లవారుజామున ప్రధాన అర్చకులు ఆలయ సేవలకు వచ్చే సమయంలో తాళాల గుత్తిని, కుంచెకోలను క్షేత్రపాలక శిలకు తాకించి నమస్కరించి తరువాతే ఆలయంలోకి ప్రవేశిస్తారు. రాత్రి ఏకాంత సేవ అనంతరం కూడా అర్చకులు తమ బీగాలు, కుంచెకోలను ఈ శిలకు తాకించి నమస్కరించిన తరువాతనే ఇంటికి వెళ్తారు. ఈ సంప్రదాయం ప్రాచీన కాలం నుంచి నేటి వరకు కొనసాగుతోంది.

7 / 8
శివకేశవులకు భేదం లేదు..

కలియుగ వైకుంఠమైన తిరుమలలో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అయిన శ్రీ వేంకటేశ్వర స్వామి సన్నిధిలో క్షేత్రపాలకుడిగా శివుడు ఉండటం శివకేశవుల అభేదాన్ని తెలియజేస్తుంది. అందుకే తిరుమల యాత్రకు వెళ్లినప్పుడు ఆనందనిలయంలో ఉన్న అంశా స్వరూప క్షేత్రపాలక శిలను, అలాగే గోగర్భంలో ఉన్న ప్రధాన క్షేత్రపాలక శిలను తప్పకుండా దర్శించుకోవడం ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు.

(Disclaimer: ఈ వార్తలోని సమాచారం వివిధ వనరుల నుంచి సేకరించి పాఠకుల ఆసక్తి మేరకు అందించడం జరిగింది. దీనిని సంస్థ ధృవీకరించదు.)

శివకేశవులకు భేదం లేదు.. కలియుగ వైకుంఠమైన తిరుమలలో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అయిన శ్రీ వేంకటేశ్వర స్వామి సన్నిధిలో క్షేత్రపాలకుడిగా శివుడు ఉండటం శివకేశవుల అభేదాన్ని తెలియజేస్తుంది. అందుకే తిరుమల యాత్రకు వెళ్లినప్పుడు ఆనందనిలయంలో ఉన్న అంశా స్వరూప క్షేత్రపాలక శిలను, అలాగే గోగర్భంలో ఉన్న ప్రధాన క్షేత్రపాలక శిలను తప్పకుండా దర్శించుకోవడం ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. (Disclaimer: ఈ వార్తలోని సమాచారం వివిధ వనరుల నుంచి సేకరించి పాఠకుల ఆసక్తి మేరకు అందించడం జరిగింది. దీనిని సంస్థ ధృవీకరించదు.)

8 / 8
Follow Us