Sneha Ullal: జూనియర్ ఐశ్వర్యరాయ్ స్నేహ ఉల్లాల్ గుర్తుందా? ఇప్పుడెలా మారిపోయిందో చూశారా? లేటెస్ట్ ఫొటోస్ వైరల్

ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించింది నటి స్నేహ ఉల్లాల్. చూడడానికి అచ్చం ఐశ్వర్యారాయ్ లా ఉండే ఈ ముద్దుగుమ్మను చూసి స్టార్ హీరోయిన్ అయిపోతుందనుకున్నారు. అయితే అదేమీ జరగలేదు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటోన్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది.

Sneha Ullal: జూనియర్ ఐశ్వర్యరాయ్ స్నేహ ఉల్లాల్ గుర్తుందా? ఇప్పుడెలా మారిపోయిందో చూశారా? లేటెస్ట్ ఫొటోస్ వైరల్
Sneha Ullal
Follow us
Basha Shek

|

Updated on: Nov 01, 2024 | 8:52 PM

విదేశాల్లో పుట్టి పెరిగిన స్నేహ ఉల్లాల్ చూడడానికి అచ్చం ఐశ్వర్యారాయ్ లా ఉంటుంది. ఐష్ లాగే నీలిరంగు కళ్లు, ముఖ వర్చస్సు ఉండడంతో ఆమెను అభిమానులు జూనియర్ ఐశ్వర్యగా పిలిచారు. తెలుగు కంటే ముందే బాలీవుడ్ లో కొన్ని సినిమాలు చేసింది స్నేహ ఉల్లాల్. సల్మాన్‌ ఖాన్ లాంటి స్టార్ హీరోతో కలిసి హిందీ డెబ్యూ ఇచ్చింది. ఇక 2007లో ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టిందీ అందాల తార. ఫస్ట్ మూవీతోనే అందం, అభినయంతో మెప్పించింది. ముఖ్యంగా యూత్ లో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ముఖ్యంగా తన నీలికళ్లతో ఐశ్వర్యను గుర్తు చేస్తూ కుర్రకారును ఆగం చేసింది. ఆ తర్వాత కరెంట్ మూవీలో యంగ్ హీరో సుశాంత్ తో జతకట్టింది. ఈ సినిమా కూడా యూత్ ను బాగానే ఆకట్టుకుంది. అలాగే నందమూరి బాలకృష్ణ నటించిన సింహా సినిమాలోనూ హీరోయిన్ గా మెరిసింది. అయితే ఈ సినిమాల తర్వాత స్నేహ ఉల్లాల్ కు సినిమా అవకాశాలు కనుమరుగైపోయాయి. వరుడు, అలా మొదలైంది సినిమాల్లో క్యామియో రోల్స్ కే పరిమితమైంది.

చాలా గ్యాప్ తర్వాత అల్లరి నరేష్ తో కలిసి నటించిన మడత కాజా సినిమా కూడా పరాజయం పాలైంది. అలాగే యాక్షన్ త్రీడీ, అంతా నీమాయలోనే సినిమాల్లో మెరిసినా అవి కూడా ప్లాఫ్ లుగానే మిగిలిపోయాయి. కన్నడ, హిందీ సినిమాల్లోనూ అదృష్టం పరీక్షించుకున్నా స్టార్ హీరోయిన్ మాత్రం కాలేకపోయింది. చివరిసారిగా 2022లో లవ్యూ లోక్ తంత్ర అనే హిందీ సినిమాలో నటించింది స్నేహ ఉల్లాల్.

ఇవి కూడా చదవండి

స్నేహ ఉల్లాల్ లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..

View this post on Instagram

A post shared by Sneha Ullal (@snehaullal)

చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న స్నేహా ఉల్లాల్.. ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన లేటెస్ట్ అండ్ గ్లామరస్ ఫొటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తోంది. అయితే అందం విషయంలో ఏ మాత్రం తగ్గడం లేదీ బ్యూటీ. అప్పుడు ఎలా ఉందో, ఇప్పుడు కూడా అంతే అందంగా ఉంది. ప్రస్తుతం ఈ అమ్మడుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

ట్రెడిషినల్ లుక్ లో స్నేహ … వీడియో

View this post on Instagram

A post shared by Sneha Ullal (@snehaullal)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.