Kiran Abbavaram: ‘క’ సినిమాకు సూపర్ హిట్ టాక్.. అంధులతో కలిసి కిరణ్ అబ్బవరం సెలబ్రేషన్స్.. వీడియో చూడండి

  టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నాడు. కొన్ని నెలల క్రితమే మనసుకు నచ్చిన అమ్మాయితో కలిసి మూడు ముళ్ల బంధంలోకి అడుగు పెట్టాడీ ట్యాలెంటెడ్ హీరో. ఇప్పుడు అతను నటించిన మొదటి పాన్ ఇండియా సినిమా క సూపర్ హిట్ టాక్ తో దూసుకెళుతోంది.

Kiran Abbavaram: 'క' సినిమాకు సూపర్ హిట్ టాక్.. అంధులతో కలిసి కిరణ్ అబ్బవరం సెలబ్రేషన్స్.. వీడియో చూడండి
Kiran Abbavaram
Follow us
Basha Shek

|

Updated on: Oct 31, 2024 | 10:00 PM

పెళ్లి తర్వాత టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన మొదటి సినిమా క. ఇది అతని మొదటి పాన్ ఇండియా సినిమా కూడా. రిలీజ్ కు ముందే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్స్, ట్రైలర్ కిరణ్ అబ్బవరం సినిమాపై అంచనాలను పెంచేశాయి. దీనికి తోడు ప్రమోషన్లలో కిరణ్ అబ్బవరం చేసిన కామెంట్స్ కూడా బాగా వైరలయ్యాయి. అందుకు తగ్గట్టుగానే దీపావళి కానుకగా గురువారం (అక్టోబర్ 31) న విడుదలైన క సినిమాకు సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. రిలీజైన ప్రతి చోట నుంచి పాజిటవ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. దీంతో చిత్ర బృందం ఫుల్ హ్యాపీ మూడ్ లో ఉంది. ఇక కిరణ్ అబ్బవరం చాలా రోజుల తర్వాత  మనసుకు సంతోషంగా ఉందంటూ సినిమా విజయంపై స్పందించాడు. కాగా క సినిమాకు సూపర్ హిట్ టాక్ వచ్చిన నేపథ్యంలో చిత్ర బృందం వినూత్నంగా సెలబ్రేషన్స్ నిర్వహించుకుంటున్నారు. తాజాగా హీరో కిరణ్ అబ్బవరం దేన్ వార్ ఫౌండేషన్ లోని అంధులతో కలిసి తన సంతోషాన్ని షేర్ చేసుకున్నాడు. వారితో కాసేపు ముచ్చటించి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతోంది. దీనిని చూసిన అభిమానులు, నెటిజన్లు కిరణ్ అబ్బవరం పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. హీరో అయినా చాలా సింప్లిసిటీగా ఉన్నారంటూ క్రేజీ కామెంట్స్ పెడుతున్నారు.

క సినిమాకు సుజీత్, సందీప్ దర్శకులుగా వ్యవహరించారు.  ఇందులో కిరణ్ అబ్బవరం సరసన నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్లు గా నటించారు. అచ్యుత్ కుమార్, బలగం జయరామ్, రాడిన్ కింగ్ స్లే తదితరులు ఈ మూవీలో ప్రధాన పాత్రలు పోషించారు. చింతా గోపాల్ కృష్ణ రెడ్డి నిర్మాతగా వ్యవహరించారు. సామ్ సీఎస్ స్వరాలు సమకూర్చారు.  సతీష్ రెడ్డి మసాన్, డేనియల్ విశ్వాస్ సినిమాటోగ్రాఫర్లుగా వ్యవహరించారు.

ఇవి కూడా చదవండి

అంధులతో సెలబ్రేషన్స్.. వీడియో

మల్లికార్జున థియేటర్ లో కిరణ్ అబ్బవరం.. వీడియో

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.