- Telugu News Photo Gallery Cinema photos Do You Know Actress Radikaa Sarathkumar Son in law Is Team India Cricketer Abhimanyu Mithun
Radhika: ఏంటి.. ఈ టీమిండియా క్రికెటర్ ప్రముఖ నటి రాధిక అల్లుడా? ఫొటోస్ వైరల్
టాలీవుడ్ సీనియర్ నటి రాధికా శరత్ కుమార్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. అప్పట్లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ఆమె ఇప్పుడు సహాయక నటిగా మెప్పిస్తున్నారు. అంతేకాదు రాజకీయాల్లోనూ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు.
Updated on: Oct 31, 2024 | 9:19 PM

నటి రాధిక పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి చాలా మందికి తెలుసు. అయితే ఆమెకు సంబంధించిన ఒక విషయం చాలా మందికి తెలియదు. అదేంటంటే.. ఆమె అల్లుడు ఒక టీమిండియా క్రికెటర్.

కర్ణాటక క్రికెటర్ అభిమన్యు మిథున్ దక్షిణాఫ్రికా 2009-10 టెస్టు సిరీస్ సందర్భంగా భారత జట్టుకు ఎంపికయ్యాడు. అలాగే 2010లో అహ్మదాబాద్ వేదికగా సౌతాఫ్రికా తో మ్యాచ్ ద్వారా వన్డే అరంగేట్రం కూడా చేశాడు.

టీమిండియా తరఫున మొత్తం 4 టెస్టులు, 5 వన్డేలు ఆడిన అభిమన్యు మిథున్ ఆయా ఫార్మాట్లలో వరుసగా 9, 3 వికెట్లు తీశాడు. ఐపీఎల్-2009 సీజన్ లోఆర్సీబీ తరఫున కూడా ఆడాడు అభిమన్యు.

అభిమన్యు రేయన్ అనే అమ్మాయితో కలిసి 2016 ఆగష్టు 28న పెళ్లిపీటలెక్కాడు. రేయన్ మరెవరో కాదు.. సీనియర్ నటీమణి రాధికా శరత్‌కుమార్ కూతురు.

అభిమన్యు మిథున్ - రేయన్ దంపతులకు కూతురు రాయనే హార్డీ, కుమారుడు రాహుల్ శరత్‌కుమార్ ఉన్నారు

రాధికకు తన రెండో భర్త, బ్రిటిష్ జాతీయుడు అయిన రిచర్డ్ హార్డీ ద్వారా రేయన్ జన్మించింది. అయితే అతని నుంచి విడిపోయిన రాధిక 2001లో నటుడు శరత్‌కుమార్‌ను పెళ్లి చేసుకుంది




