- Telugu News Photo Gallery Cinema photos Tollywood movies like Vishwambhara, game changer nbk 109 shooting updates
సెట్స్ లో కష్టపడుతున్న హీరోలు.. ఫుల్ స్వింగ్‌లో షూటింగ్స్
స్టార్ హీరోలంతా ఫుల్ స్వింగ్‌లో షూటింగ్స్ చేస్తున్నారు. దాదాపు మెయిన్ హీరోల సినిమాలన్నింటికీ రిలీజ్ డేట్స్ లాక్ అవ్వటంతో డెడ్ లైన్ రీచ్ అయ్యేందుకు కష్టపడుతున్నారు. అందుకు తగ్గట్టుగా అందరు హీరోలు సెట్‌లో కష్టపడుతున్నారు. పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ రెండు సినిమాల షూటింగ్స్‌లో బిజీగా ఉన్నారు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాజాసాబ్ షూటింగ్ అజీజ్‌నగర్‌లో జరుగుతోంది.
Updated on: Oct 31, 2024 | 9:50 PM

స్టార్ హీరోలంతా ఫుల్ స్వింగ్‌లో షూటింగ్స్ చేస్తున్నారు. దాదాపు మెయిన్ హీరోల సినిమాలన్నింటికీ రిలీజ్ డేట్స్ లాక్ అవ్వటంతో డెడ్ లైన్ రీచ్ అయ్యేందుకు కష్టపడుతున్నారు. అందుకు తగ్గట్టుగా అందరు హీరోలు సెట్‌లో కష్టపడుతున్నారు.

పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ రెండు సినిమాల షూటింగ్స్‌లో బిజీగా ఉన్నారు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాజాసాబ్ షూటింగ్ అజీజ్‌నగర్‌లో జరుగుతోంది. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫౌజీ షూటింగ్ బీహెచ్ఈఎల్‌లో జరుగుతోంది. ప్రస్తుతం ప్రభాస్ కనిపించని సీన్స్‌ను తెరకెక్కిస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి కూడా విశ్వంభర సినిమాను కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. కోకాపేటలో వేసిన సెట్‌లో ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. పవన్ కల్యాణ్ నటిస్తున్న పీరియాడిక్ మూవీ హరి హర వీరమల్లు షూటింగ్ మంగళగిరిలో జరుగుతోంది.

పోచంపల్లిలో జరుగుతున్న పుష్ప 2 షూటింగ్‌లో బిజీగా ఉన్నారు అల్లు అర్జున్, సుకుమార్. రాజేంద్రనగర్ క్వారీలో యాక్షన్ సీన్ పూర్తి చేసిన బాలయ్య, ముచ్చింతల్ దగ్గరలోని మదనపల్లెలో ఎన్బీకే 109 షూట్‌లో పాల్గొంటున్నారు. ధనుష్, నాగార్జున లీడ్ రోల్స్‌లో తెరకెక్కుతున్న కుబేర షూటింగ్ ఆల్వాల్‌లో జరుగుతోంది. భూత్ బంగ్లా నుంచి ఫలక్‌నుమా ప్యాలెస్‌కు షిప్ట్ అయ్యింది వెంకీ, అనిల్ రావిపూడి టీమ్.

వైజాగ్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న హిట్ 3 టీమ్ ప్రస్తుతం రాజస్థాన్‌లోని జైపూర్‌లో కీలక సన్నివేశాల చిత్రీకరణలో ఉంది. నిఖిల్ హీరోగా తెరకెక్కుతున్న స్వయంభూ షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతోంది. సిద్దూ జొన్నలగడ్డ, బొమ్మరిల్లు భాస్కర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. శర్వానంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కోసం హాలో నేటివ్ స్టూడియోలో భారీ సెట్ వేస్తున్నారు.




