- Telugu News Photo Gallery Cinema photos Nani's Bheemili Kabaddi Jattu Movie Heroine Saranya Mohan Beautifull Photos
Tollywood: ఈ నాట్యమయూరి ఎవరో గుర్తుపట్టారా..? హీరో నానితో సూపర్ హిట్ అందుకున్న బ్యూటీ..
తెలుగు తక్కువ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. గ్లామర్ షో చిత్రాలు కాకుండా ఎక్కువగా నటన ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. న్యాచురల్ స్టార్ నాని జోడిగా నటించిన ఈ హీరోయిన్.. ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. ఇంతకీ ఆ నాట్యమయూరి ఎవరో గుర్తుపట్టారా..?
Updated on: Oct 31, 2024 | 8:44 PM

పైన ఫోటోను చూశారు కదా.. అందులో ఎంతో పద్దతిగా కనిపిస్తున్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టరా.. ? తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరంలేని ముద్దుగుమ్మ. టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది.

ఆమె మరెవరో కాదు.. తెలుగులో హిట్ చిత్రాల్లో నటించి జనాలకు దగ్గరైన హీరోయిన్ శరణ్య మోహన్. తెలుగులో ఈ అమ్మడు నటించింది తక్కువ సినిమాలే అయినా అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. తెలుగు, తమిళం, మలయాళంలో ఎక్కువగా నటించింది.

అలాగే కన్నడ, హిందీలోనూ నటించింది. తెలుగులో కృష్ణుడు హీరోగా నటించిన విలేజ్ లో వినాయకుడు మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత న్యాచురల్ స్టార్ నాని సరసన భీమిలి కబడ్డీ చిత్రంలో నటించి హిట్ అందుకుంది.

ఆ తర్వాత హ్యాపీ హ్యాపీగా, కళ్యాణ్ రామ్ కత్తి చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత మళ్లీ తెలుగులో సినిమా చేయలేదు. కానీ తమిళం, మలయాళంలో వరుస సినిమాలు చేసింది. కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడే తన చిన్ననాటి స్నేహితుడు డాక్టర్ అరవింద్ కృష్ణన్‌ను ఆమె 2015 లో వివాహం చేసుకుంది.

వీరికి ఇద్దరూ పిల్లలు ఉన్నారు. పెళ్లి తర్వాత సినిమాలకు దూరం అయిన శరణ్య మోహన్ నృత్యకారిణి. ప్రస్తుతం సొంతం డ్యాన్స్ క్లాసెస్ చెబుతుంది. అలాగే సోషల్ మీడియాలో ఫోటోస్ షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరవుతుంది. తాజాగా శరణ్య ఫోటోస్ చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్.




