Sandeep Raj: ‘కలర్ ఫొటో’ కలిపింది ఇద్దరినీ.. తిరుమల శ్రీవారి సాక్షిగా పెళ్లిపీటలెక్కనున్న దర్శకుడు, నటి

టాలీవుడ్‌లో మరో పెళ్లి సందడి మొదలైంది. కలర్ ఫొటో సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ దర్శకుడు సందీప్ రాజ్ త్వరలోనే తన కొత్త జీవితంలో కొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టనున్నాడు. తన తొలి సినిమాలోనే ఓ కీలక పాత్రలో మెరిసిన నటితోనే అతను ఏడడుగులు వేయనున్నాడీ ట్యాలెంటెడ్ డైరెక్టర్.

Sandeep Raj: 'కలర్ ఫొటో' కలిపింది ఇద్దరినీ.. తిరుమల శ్రీవారి సాక్షిగా పెళ్లిపీటలెక్కనున్న దర్శకుడు, నటి
Sandeep Raj, Chandini Rao
Follow us
Basha Shek

|

Updated on: Oct 30, 2024 | 2:52 PM

యూట్యూబ్ ఛానెల్ చాయ్ బిస్కెట్‌లో కొన్ని షార్ట్ ఫిల్మ్‌లకు దర్శకత్వం వహించాడు సందీప్ రాజ్. తన టేకింగ్ తో బోలెడంత మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత 2020లో కలర్ ఫొటో సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. సుహాస్, చాందిని చౌదరి హీరో, హీరోయిన్లు గా తెరకెక్కిన ఈ లవ్ స్టోరీ కరోనా కారణంగా ఓటీటీలోనే విడుదలైంది. అయినా సూపర్ హిట్ గా నిలిచింది. దర్శకుడిగా సందీప్ రాజ్ కు మంచి గుర్తింపు తెచ్చింది. ఇక ఇదే సినిమాకు గానూ జాతీయ అవార్డును సైతం అందుకున్నాడీ ట్యాలెటెండ్ డైరెక్టర్. ప్రస్తుతం సందీప్ రాజ్ చేతిలో పలు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ క్రేజీ డైరెక్టర్ త్వరలోనే బ్యాచిలర్ లైఫ్ కు బై బై చెప్పనున్నాడు. కలర్ ఫొటో సినిమాలోనే ఒక కీలక పాత్రలో మెరిసిన చాందిని రావు తో కలిసి తిరుపతి వేదికగా ఏడడుగులు నడవనున్నాడు సందీప్ రాజ్. ఈ సినిమా షూటింగ్ లోనే వీరిద్దరి మధ్య ప్రేమ మొదలైంది. ఇప్పుడు ఇరు పెద్దలు కూడా వీరి ప్రేమకు ఆశీర్వాదం తెలిపారు. దీంతో త్వరలోనే తిరుమల ఏడుకొండల వాడి సాక్షిగా ఏడడుగులు నడవనున్నారీ లవ్ బర్డ్స్.

సందీప్ రాజ్ గురించి చాలా మందికి తెలుగుసు కానీ.. చాందిని రావు గురించి చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. కలర్ ఫొటోతో సందీప్ రాజ్ కథ అందించిన ‘హెడ్స్ అండ్ టేల్స్’ వెబ్ సిరీస్‌లో ఓ పాత్ర చేసింది. ‘రణస్థలి’తో పాటు మరికొన్ని సినిమాల్లోనూ కనిపించిందీ అందాల తార. సందీప్ రాజ్, చాందిని రావుల నిశ్చితార్థం నవంబర్ 11న విశాఖ పట్టణంలో జరుగుతుందని సమాచారం. ఆ తర్వాత డిసెంబర్ 7న ఏడు కొండల వెంకటేశ్వర స్వామి పాదాల చెంత తిరుపతిలో వీరు పెళ్లి చేసుకోనున్నారు.

ఇవి కూడా చదవండి

వైజాగ్ లో ఎంగేజ్ మెంట్..

చాందినీ రావుతో డైరెక్టర్ సందీప్ రాజ్..

View this post on Instagram

A post shared by Chandni Rao (@_chandnirao)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి