Devara OTT: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఓటీటీలో దేవర.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన తాజా చిత్రం దేవర : పార్ట్ 1. బాలీవుడ్ అందాల తార జాన్వీ కపూర్ ఈ సినిమాతోనే తెలుగు ఆడియెన్స్ కు పరిచయమైంది. అభిమానుల భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 27న రిలీజైన ఈ సినిమా రికార్డు కలెక్షన్లు సాధించింది.

Devara OTT: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఓటీటీలో దేవర.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Devara Movie
Follow us
Basha Shek

|

Updated on: Oct 28, 2024 | 8:50 PM

ఆర్ఆర్ఆర్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన సినిమా దేవర. ఎన్టీఆర్ కు గతంలో జనతా గ్యారేజ్ లాంటి బ్లాక్ బస్టర్ ను అందించిన కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. దివంగత నటి శ్రీదేవి గారాల పట్టి జాన్వీ కపూర్ ఈ సినిమాతోనే టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అలాగే బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ ఇందులో విలన్ గా నటించాడు. దసరా కానుకగా సెప్టెంబర్ 27న విడుదలైన దేవర టాలీవుడ్ రికార్డులు తిరగరాసింది. తెలుగుతో పాటు అన్ని భాషల్లోనూ భారీ కలెక్షన్లు సాధించింది. ఇప్పటివరకు దేవర సినిమా రూ.500 కోట్లకు పైగానే వసూళ్లు రాబట్టింది. ఇప్పటికీ చాలా చోట్ల ఈ మూవీ థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. అదే సమయంలో ఓటీటీ ఆడియెన్స్ కూడా దేవర సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ సినిమా ఓటీటీ రిలీజ్ గురించి సామాజిక మాధ్యమల్లో ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. త్వరలోనే ఈ బ్లాక్ బస్టర్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కు రానున్నట్లు టాక్ వినిపిస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ దేవర సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను కొనుగోలు చేసింది. ఈ నేపథ్యంలో నవంబర్ 8 నుంచి లేదా నవంబర్ 10 నుంచి ఎన్టీఆర్ సినిమా స్ట్రీమింగ్ కు తీసుకు రానుందని సమాచారం. తెలుగుతో పాటు హిందీ, కన్నడ, మలయాళ, తమిళ్ భాషల్లోనూ ఒకేసారి దేవర మూవీ స్ట్రీమింగ్ కు రానుందని తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుందని సమాచారం.

ఇవి కూడా చదవండి

యువసుధ ఆర్ట్స్ , ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై సుధాకర్ మిక్కిలినేని , కొసరాజు హరికృష్ణ దేవర సినిమాను నిర్మించారు. ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ మేకా, శ్రుతి మరాటే, షైన్ టామ్ చాకో, మురళీ శర్మ, నరేన్, కలైయరసన్, చైత్ర రాయ్ , అభిమన్యు సింగ్ తదితరులు ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించారు. అనిరుధ్ అందించిన పాటలు చార్ట్ బస్టర్ గా నిలిస్తే బీజీఎమ్ సినిమాను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లింది. ఇక దేవరలో అద్భుతమైన విజువల్స్ కూడా ఉన్నాయి. మొత్తానికి థియేటర్లలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన దేవర త్వరలోనే ఓటీటీలో రికార్డుల వేటకు రెడీ అవుతోంది.\

నవంబర్ 8 నుంచి ఓటీటీలో దేవర..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఓ మై డ్రైవరన్నా.. ఒక చేత్తో డ్రైవింగ్.. మరో చేత్తో మహిళ బ్యాగ్‌లో
ఓ మై డ్రైవరన్నా.. ఒక చేత్తో డ్రైవింగ్.. మరో చేత్తో మహిళ బ్యాగ్‌లో
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!