Bigg Boss 8 Telugu: కొంప ముంచిన కమ్యూనిటీ చర్చ! బిగ్ బాస్ హౌస్ నుంచి మెహబూబ్ ఎలిమినేట్

బిగ్ బాస్ తెలుగు సీజన్ సండే ఎపిసోడ్ (అక్టోబర్ 27) ఎంతో ఉత్సాహకరంగా సాగింది. అమరన్ మూవీ టీమ్ సభ్యులు శివ కార్తికేయన్, సాయి పల్లవి అలాగే లక్కీ భాస్కర్ టీమ్ దుల్కర్ సల్మాన్, మీనాక్షి తదితరులు బిగ్ బాస్ వేదికపై సందడి చేశారు.

Bigg Boss 8 Telugu: కొంప ముంచిన కమ్యూనిటీ చర్చ! బిగ్ బాస్ హౌస్ నుంచి మెహబూబ్ ఎలిమినేట్
Bigg Boss 8 Telugu
Follow us
Basha Shek

|

Updated on: Oct 27, 2024 | 11:34 PM

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో మరో వారం ముగిసింది. ఎప్పటిలాగే ఈ వారం కూడా మరొక కంటెస్టెంట్స్ హౌస్ నుంచి బయటకు వెళ్లిపోయాడు. అయితే ఈ వారం నయని పావని ఎలిమినేట్ అవుతుందని చాలా మంది భావించారు. అయితే అనూహ్యంగా మెహ బూబ్ దిల్ సే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాడు. ఎనిమిదో వారంలో మొత్తం ఆరుగురు నిఖిల్, పృథ్వీ, ప్రేరణ, విష్ణుప్రియ, మెహబూబ్, నయని పావని లు నామినేష‌న్స్ లో ఉన్నారు. వీరిలో నయని పావని, మెహబూబ్‌ లకు తక్కువ ఓట్లు పడ్డాయి. అయితే నాగార్జున నయనిని సేవ్‌ చేసి మెహబూబ్‌ ఎలిమినేట్‌ అయినట్లు ప్రకటించాడు. దీంతో మెహబూబ్ నిరాశగా బయటకు వచ్చాడు.  కాగా ఎలిమినేషన్‌ అనంతరం మెహబూబ్‌ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు..

‘‘ఇంతకుముందు దీపావళి సమయంలోనే నేను ఎలిమినేట్‌ అయ్యా. ఇప్పుడు కూడా అదే పండగ వేళ ఎలిమినేట్‌ అయ్యాను. అలా ఎందుకు జరిగిందో నాకు అర్థం కావడంలేదు. ప్రతి టాస్క్‌లోనూ నా బెస్ట్‌ ఇవ్వాలనే బిగ్ బాస్ హౌస్ లోకి  వచ్చాను. కానీ, దురదృష్టవశాత్తూ బయటకు వచ్చేశాను’ అని కన్నీళ్లు పెట్టుకున్నాడు మెహబూబ్.

ఇవి కూడా చదవండి

కాగా గతంలో బిగ్‌బాస్‌ సీజన్‌ 4 కంటెస్టెంట్‌ గా వచ్చాడు మెహబూబ్. అప్పుడు కూడా విజేతగా నిలవలేకపోయాడు. ఇప్పుడు ఎనిమిదో సీజన్ లోనూ వైల్డ్‌కార్డ్‌తో కొత్త సీజన్‌లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా  పలువురు హౌస్‌మేట్స్‌ను టపాసులతో పోల్చుతూ మెహబూబ్‌ వారితో అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.

మద్దుతుగా నిలిచినందుకు అందరికీ ధన్యవాదలు: మెహబూబ్ ఎమోషనల్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మహా కుంభమేళలో నాల్గవ రాజ స్నానం ఎప్పుడు? శుభ సమయం తెలుసుకోండి
మహా కుంభమేళలో నాల్గవ రాజ స్నానం ఎప్పుడు? శుభ సమయం తెలుసుకోండి
ఫీలింగ్స్ సాంగ్ చేయడానికి చాలా భయపడ్డా.. రష్మిక
ఫీలింగ్స్ సాంగ్ చేయడానికి చాలా భయపడ్డా.. రష్మిక
పంట పొలాల్లో కదులుతూ కనిపించిన భారీ ఆకారం.. ఏంటాని చూడగా..!
పంట పొలాల్లో కదులుతూ కనిపించిన భారీ ఆకారం.. ఏంటాని చూడగా..!
ఇంగ్లాండ్‌కు షాక్: గాయం కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీకి ఆ స్టార్ దూరం
ఇంగ్లాండ్‌కు షాక్: గాయం కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీకి ఆ స్టార్ దూరం
దటీజ్ ఉమెన్ పవర్.. 211 పరుగుల తేడాతో ఘన విజయం
దటీజ్ ఉమెన్ పవర్.. 211 పరుగుల తేడాతో ఘన విజయం
మొదటి మహిళా క్రికెటర్‌గా చరిత్ర సృష్టించిన లేడి గంగూలీ..!
మొదటి మహిళా క్రికెటర్‌గా చరిత్ర సృష్టించిన లేడి గంగూలీ..!
ఏపీలో మాత్రమే మిడ్ నైట్ షోలు వేస్తే మరో తలనొప్పి
ఏపీలో మాత్రమే మిడ్ నైట్ షోలు వేస్తే మరో తలనొప్పి
శివయ్య పూజలో పొరపాటున ఈ పనులు చేయవద్దు.. శని దోషం ఏర్పడుతుంది
శివయ్య పూజలో పొరపాటున ఈ పనులు చేయవద్దు.. శని దోషం ఏర్పడుతుంది
భారత్ చేతిలో ఓటమి తర్వాత ఏడ్చిన పాకిస్తాన్ ఆటగాళ్లు..వీడియో వైరల్
భారత్ చేతిలో ఓటమి తర్వాత ఏడ్చిన పాకిస్తాన్ ఆటగాళ్లు..వీడియో వైరల్
పశ్చిమ గాలుల ప్రభావంతో.. దిశను మార్చుకుంటోన్న తీవ్ర అల్పపీడనం
పశ్చిమ గాలుల ప్రభావంతో.. దిశను మార్చుకుంటోన్న తీవ్ర అల్పపీడనం