Bigg Boss 8 Telugu: ముగిసిన ఓటింగ్.. ఈ వారం బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయ్యేది ఎవరో క్లారిటీ వచ్చేసిందిగా

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఎనిమిదో వారం ఎండింగ్ కు చేరుకుంది. ఇక వీకెండ్ అంటే.. హౌస్ లో ఎంటర్ టైన్మెంట్ నెక్ట్స్ లెవెల్ ఉంటుంది. అదే సమయంలో ఎలిమినేషన్ కత్తి కూడా కంటెస్టెంట్స్ మెడపై వేలాడుతూ ఉంటుంది. అలా ఈ వారం ఎలిమినేట్ అవుతారన్నది ఆసక్తికరంగా మారింది.

Bigg Boss 8 Telugu: ముగిసిన ఓటింగ్.. ఈ వారం బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయ్యేది ఎవరో క్లారిటీ వచ్చేసిందిగా
Bigg Boss 8 Telugu
Follow us
Basha Shek

|

Updated on: Nov 02, 2024 | 10:56 AM

బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 8 రోజు రోజుకూ రసవత్తరంగా మారుతోంది. సెప్టెంబర్ 1న అట్టహాసంగా ప్రారంభమైన ఈ సెలబ్రిటీ గేమ్ షో ఇప్పుడు ఎనిమిదో వారం ఎండింగ్ కు వచ్చేసింది. ఇక మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ అడుగు పెట్టగా గత ఏడు వారాల్లో ఏకంగా ఎనిమిది మంది ఎలిమినేట్ అయ్యారు. బేబక్క, శేఖర్ భాషా, అభయ్, సోనియా, ఆదిత్య, నైనికా, సీత, మణికంఠ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్లిపోయారు. ఇక ఆరోవారంలో మరో ఎనిమది మంది కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీతో హౌస్ లోకి అడుగు పెట్టారు. మొత్తానికి పాత, కొత్త కంటెస్టెంట్లతో గతంలో కంటే మరింత ఎంటర్ టైనింగ్ గా మారింది బిగ్ బాస్ హౌస్. ఇక వీకెండ్ వచ్చింది కాబట్టి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది ఆసక్తి గా మారింది. ఈ వారంలో మొత్తం ఆరుగురు నిఖిల్, పృథ్వీ, ప్రేరణ, విష్ణుప్రియ, మెహబూబ్, నయని పావని లు నామినేష‌న్స్ లో ఉన్నారు. వీరికి శుక్రవారం అర్ధరాత్రి వరకు కూడా ఓటింగ్ జరిగింది. ఎనిమిదో వారం ఓటింగ్‌లో నిఖిల్ టాప్ ప్లేస్‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. అలాగే ప్రేర‌ణ రెండో స్థానంలో కొన‌సాగుతోంది. ఇక టాప్ కంటెస్టెంట్, కొత్త మెగా చీఫ్ విష్ణు ప్రియ మూడో స్థానంలో కంటిన్యూ అవుతోంది. అలాగే పృథ్వీ నాలుగో ప్లేస్ లో ఉన్నట్లు సమాచారం.

అయితే వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ గా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టిన మెహ‌బూబ్ దిల్ సే, న‌య‌ని పావ‌నిలు వరుసగా ఐదు, ఆరు స్థానాల్లో ఉన్నారు. వీరిద్ద‌రికీ అతి త‌క్కువ‌గా ఓట్లు పడ్డాయని, దీంతో డేంజర్ జోన్ లో ఉన్నారని సమచారం. ఈ వారం వీరిద్ద‌రిలో ఒక‌రు ఎలిమినేట్ కానున్నారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే గ‌త వారం నాగ మ‌ణికంఠ ఎలిమినేష‌న్ స‌మ‌యంలో హోస్ట్ నాగార్జున ఒక సంచలన విషయం బయట పెట్టారు. వచ్చే వారం ఎలిమినేషన్ లో ఊహించని ట్విస్ట్ ఉంటుందని మెలిక పెట్టారు. దీంతో నాగార్జున ఎలాంటి ట్విస్ట్ ఇస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.