Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jani Master: ‘మనిషి అనేవాడు జైలుకు అసలు పోకూడదు. ఆ ఫుడ్ తినలేకపోయా.. నరకం అనుభవించా’: జానీ మాస్టర్

జైలు నుంచి ఇంటికి చేరుకున్న జానీ మాస్టర్ ఓ ప్రముఖ డైరెక్టర్, కొందరు కొరియోగ్రాఫర్ లతో సమావేశామయ్యాడని తెలుస్తోంది. ఈ సందర్భంగా తన జైలు జీవితానికి సంబంధించి చేదు అనుభవాలను వారితో పంచుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే అన్ని విషయాలు బయట పెడతానని జానీ మాస్టర్ చెప్పారని సమాచారం.

Jani Master: 'మనిషి అనేవాడు జైలుకు అసలు పోకూడదు. ఆ ఫుడ్ తినలేకపోయా.. నరకం అనుభవించా': జానీ మాస్టర్
Jani Master
Basha Shek
|

Updated on: Oct 25, 2024 | 10:57 PM

Share

తన దగ్గర పనిచేసే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటోన్న టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ జైలు నుంచి విడుద‌ల అయ్యారు. ఈ కేసులో తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో శుక్రవారం (అక్టోబర్ 25) చంచల్ గూడ జైలు నుంచి జానీ మాస్టర్ బయటకు వచ్చారు. సుమారు 36 రోజులు పాటు ఆయన చంచల్ గూడ జైల్లో ఉన్నారు. విడుదల తర్వాత నేరుగా ఇంటికీ చేరుకున్న జానీ ఓ ప్రముఖ డైరెక్టర్, కొందరు కొరియోగ్రాఫర్ లతో సమావేశమైనట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా జైలులో తనకెదురైన చేదు అనుభవాలను ఆయన పంచుకున్నట్లు తెలుస్తోంది. ‘నాకు ఇంకా జైలులోనే ఉన్నట్లు అనిపిస్తోంది. అక్కడి ఫుడ్ తినలేక పోయాన. మనిషి అనేవాడు ఎప్పుడూ జైలుకు పోకూడదు. బయట కంటే జైల్లో నరకం ఉంటుంది. ఇది ఎలా జరిగిందో ఇప్పటికీ అర్థం కావడం లేదు. నేను నార్మల్ పరిస్థితికి రావాలంటే కొన్ని రోజులు పడుతుంది. రెండు రోజుల వరకు ఎవరితోనూ మాట్లాడను. ఇప్పట్లో మీడియా ముందుకు వచ్చే ఆలోచన కూడా లేదు. కానీ త్వరలోనే అన్ని విషయాలు బయట పెడతాను’ అనీ జానీ మాస్టర్ చెప్పినట్లు తెలుస్తోంది.

కాగా రిలీజ్ కు ముందు జానీ మాస్టర్ సోషల్ మీడియా ఖాతా నుంచి ఒక ఆసక్తికరమైన పోస్ట్ షేర్ అయ్యింది. అదేంటంటే.. జానీ మాస్టర్ భూల్‌ భులయ్యా 3 అనే హిందీ మూవీ టైటిల్ ట్రాక్ కు కొరియోగ్రఫీ అందించాడు. హరే రామ్.. హరే రామ్ అంటూ సాగే ఈ పాట ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది. యూట్యూబ్ లో ఈ పాటకు మిలియన్ల కొద్దీ వ్యూస్ వస్తున్నాయి. . ఈక్రమంలోనే తన సాంగ్ రికార్డులు సృష్టించడంతో జానీ మాస్టర్ తన సంతోషాన్ని అందరితో పంచుకున్నాడు. ‘నా సాంగ్ స్పూకీ సైడ్‌ను ట్రెండింగ్‌లో ఉంచినందుకు మీ అందరికీ ధన్యవాదాలు’ అని సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ను షేర్ చేశాడు. దీనికి ‘భూల్ భులయ్యా3’ టీమ్‌ను ట్యాగ్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సామజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతోంది. దీనిని చూసిన అభిమానులు, నెటిజన్లు భిన్నరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

 జానీ మాస్టర్ షేర్ చేసిన పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పోస్టల్‌ యూజర్ల కోసం.. సూపర్‌ యాప్‌ వచ్చేసింది!
పోస్టల్‌ యూజర్ల కోసం.. సూపర్‌ యాప్‌ వచ్చేసింది!
సాలరీ సరిపోట్లేదా..? పెట్టుబడి అవసరం లేని ఈ బిజినెస్‌ చేయండి!
సాలరీ సరిపోట్లేదా..? పెట్టుబడి అవసరం లేని ఈ బిజినెస్‌ చేయండి!
ప్రతి ఒక్కరి లైఫ్‌లో విజయ్ దేవరకొండ ఉండటం బ్లెస్సింగ్: రష్మిక
ప్రతి ఒక్కరి లైఫ్‌లో విజయ్ దేవరకొండ ఉండటం బ్లెస్సింగ్: రష్మిక
చైనాపై అంబానీ కంపెనీ ఫిర్యాదు.. రంగంలోని ప్రభుత్వం!
చైనాపై అంబానీ కంపెనీ ఫిర్యాదు.. రంగంలోని ప్రభుత్వం!
దిగి వస్తున్న బంగారం ధర.. తెలుగు రాష్ట్రాల్లో తులం ధర ఎంతంటే..
దిగి వస్తున్న బంగారం ధర.. తెలుగు రాష్ట్రాల్లో తులం ధర ఎంతంటే..
మన దేశంలో ఫస్ట్‌ టైమ్‌ హోమ్‌ లోన్‌ తీసుకున్న వ్యక్తి ఎవరో తెలుసా?
మన దేశంలో ఫస్ట్‌ టైమ్‌ హోమ్‌ లోన్‌ తీసుకున్న వ్యక్తి ఎవరో తెలుసా?
PF డబ్బులు విత్‌డ్రా చేసుకుంటే ట్యాక్స్‌ కట్టాలా?
PF డబ్బులు విత్‌డ్రా చేసుకుంటే ట్యాక్స్‌ కట్టాలా?
Rashi Phalalu: వారికి ఆకస్మిక ధన ప్రాప్తి సూచనలు..
Rashi Phalalu: వారికి ఆకస్మిక ధన ప్రాప్తి సూచనలు..
ఆర్టీసీ బస్సులో ప్రయాణించినంత ఈజీగా విమానాల్లో వెళ్లొచ్చు!
ఆర్టీసీ బస్సులో ప్రయాణించినంత ఈజీగా విమానాల్లో వెళ్లొచ్చు!
శివ మూవీలో విలన్‌గా మోహన్‌బాబును వద్దన్న ఆర్జీవీ. ఎందుకో తెలుసా?
శివ మూవీలో విలన్‌గా మోహన్‌బాబును వద్దన్న ఆర్జీవీ. ఎందుకో తెలుసా?