Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Unstoppable with NBK S4: అరెస్టైన తొలి రోజు రాత్రి జైలులో.. బాలయ్య అన్‌స్టాపబుల్‌లో చంద్రబాబు ఎమోషనల్

ఆహా ఓటీటీ వేదికగా బాలయ్య అన్ స్టాపబుల్ సీజన్ 4 శుక్రవారం (అక్టోబర్ 25) ప్రారంభమైంది. ఈ టాక్ షోకు మొదటి గెస్టుగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. అన్ స్టాపబుల్ షోకు ఆయన రావడం ఇది రెండోసారి. గతంలో ప్రతిపక్షనేతగా ఈ టాక్ షోకు హాజరైన చంద్రబాబు ఇప్పుడు ముఖ్యమంత్రిగా వచ్చారు.

Unstoppable with NBK S4: అరెస్టైన తొలి రోజు రాత్రి జైలులో.. బాలయ్య అన్‌స్టాపబుల్‌లో చంద్రబాబు ఎమోషనల్
Balakrishna, Chandrababu Naidu
Follow us
Basha Shek

| Edited By: Subhash Goud

Updated on: Oct 26, 2024 | 5:25 PM

నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తోన్న టాక్ షో అన్ స్టాపబుల్ విత్ ఎన్‌బీకే. ఇప్పటికే సక్సెస్ ఫుల్ గా మూడు సీజన్లు కంప్లీట్ చేసుకున్న ఈ సెలబ్రిటీ ఛాట్ షో ఇప్పుడు నాలుగో సీజన్‌లోకి అడుగు పెట్టింది. శుక్రవారం (అక్టోబర్ 25) ఆహా వేదికగా అన్‌స్టాపబుల్ సీజన్ 4 మొదలైంది. మొదటి ఎపిసోడ్ కి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గెస్ట్ గా హాజరయ్యారు. కొన్ని గంటల క్రితమే ఈ ఎపిసోడ్ ఆహాలో స్ట్రీమింగ్ కు వచ్చేసింది. బాలయ్య టాక్ షోలో చంద్ర బాబు ప్రస్తుతం రాజకీయాలు, పవన్ కల్యాణ్ పార్టీతో పొత్తు తదితర విషయాలపై పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అలాగే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తనన అరెస్ట్ చేయడంపై స్పందించిన చంద్రబాబు కాస్త ఎమోషనల్ అయ్యారు. ‘నంద్యాలలో మీటింగ్ పూర్తి చేసుకొని బయటకి వచ్చాను. అక్కడ బస చేస్తే రాత్రంతా డిస్టర్బెన్స్ చేసారు. ఎలాంటి నోటిస్, అరెస్ట్ వారెంట్ లేకుండా అదుపులోకి తీసుకున్నారు. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అంటే తర్వాత నోటిస్ ఇస్తాం అని చెప్పారు. ఆ రోజు రాత్రంతా విచారణ పేరుతో ఎక్కడెక్కడో తిప్పారు. ‘చేయని తప్పుకు శిక్ష అనుభవించడమే కాకుండా అరెస్ట్ చేసిన పద్దతితో నా గుండె తరుక్కుపోయింది’

‘ప్రజాస్వామ్యంలో ఎక్కడా ఇలా జరగదు. తప్పు ఎవరు చేసినా ఎక్కడ చేసాడో చెప్పి అతని సమాధానం విని నోటిస్ ఇచ్చి అప్పుడు దానిని బట్టి అరెస్ట్ చేస్తారు. కానీ ఇలాంటివేవీ లేకుండా, ఇన్వెస్టిగేషన్ అధికారి కాకుండా ఎవరో సూపర్ వైజర్ ఆఫీసర్ అరెస్ట్ చేయడానికి వచ్చారు. నేను అరెస్టైన రోజును ఇప్పటికి కూడా జీర్ణించుకోలేకపోతున్నాను. అయితే నాకు బాధ్యత గుర్తు కొస్తుది. నిరుత్సాహ పడకుండా అన్నిటినీ సమర్థంగా ఎదుర్కొన్నాను. ఆశయం కోసం పనిచేయడమే శాశ్వతమని, ముందుకెళ్లాలని భావించాను. నేను అప్పుడు, ఇప్పుడు ఎప్పుడూ తప్పు చేయలేదు. నిప్పులాగా బతికాను. ప్రజలే నన్ను గెలిపించారు’ అంటూ చంద్రబాు ఎమోషనల్ అయ్యారు.

ఇవి కూడా చదవండి

తన జైలు జీవితం గురించి అన్‌స్టాపబుల్‌లో చంద్రబాబు కామెంట్స్

బాలయ్య అన్ స్టాపబుల్ షో లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.