Tollywood: తల్లి బ్యాంక్ లోన్ తీర్చేందుకు సినిమాల్లోకి.. ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా హీరో.. గుర్తు పట్టారా?

'సినిమా పరిశ్రమలోకి వస్తానని ఎప్పుడూ అనుకోలేదు. కెమెరా ముందు నిలబడాలన్నా, నటుడిని కావాలన్నా కోరిక ఎప్పుడూ లేదు. మా అమ్మకు రూ.25వేలు ఇచ్చేసి.. ‘మీ లోన్‌ అయిపోయింది. ఇక బాధపడొద్దు’ అని చెప్పేద్దామనుకున్నా.. దాని కోసం నా సినిమా కెరీర్‌ ప్రారంభించాను' అని చెప్పుకొచ్చాడీ స్టార్ హీరో.

Tollywood: తల్లి బ్యాంక్ లోన్ తీర్చేందుకు సినిమాల్లోకి.. ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా హీరో.. గుర్తు పట్టారా?
Tollywood Actor
Follow us
Basha Shek

|

Updated on: Oct 24, 2024 | 7:27 PM

పై ఫొటోలో ఉన్న పిల్లాడిని గుర్తు పట్టారా? ఈ అబ్బాయి ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ హీరో. లవ్, రొమాన్స్, కామెడీ, యాక్షన్, ఫ్యామిలీ.. ఇలా అన్నా జానర్ల సినిమాలకు సరిపోతాడీ హ్యాండ్సమ్ హీరో. అందుకే ఈ నటుడికి దక్షిణాదిలో మస్త్ క్రేజ్ ఉంది. భాషతో సంబంధం లేకుండా అశేష అభిమానులను సొంతం చేసుకున్నాడు. తన నటనా ప్రతిభకు ప్రతీకగా జాతీయ అవార్డు కూడా సొంతం చేసుకున్నాడు. త్వరలోనే మరో పాన్‌ ఇండియా మూవీతో ప్రేక్షకులను పలకరించనున్నాడు. అయితే ఈ స్టార్ హీరో సినిమా జర్నీనే చాలా ఆసక్తికరం. ఎందుకంటే ఈ నటుడు కూడా ఒక సామాన్యుడిలానే కెరీర్ ప్రారంభించారు. రూ.750 జీతానికి ఒక గార్మెంట్ ఫ్యాక్టరీలో పని చేశాడు. అదే సమయంలో తన తల్లి బ్యాంక్ లోన్ తీర్చేందుకు అనుకోకుండా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాడు. ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా సూపర్ స్టార్ గా ఎదిగిపోయాడు. అతను మరెవర కాదు త్వరలోనే కంగువాతో మనల్ని పలకరించేందుకు వస్తోన్న కోలీవుడ్ స్టార్ హీరో సూర్య. ప్రస్తుతం తన సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్నాడీ ట్యాలెంటెడ్ హీరో. ఈ సందర్భంగా తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

నటుడు కాకముందు సూర్య శిక్షణ పొందుతూ గార్మెంట్ కంపెనీలో పని చేసేవాడు. 15 రోజులకు 750 రూపాయలు సంపాదించేవాడు. అక్కడే పని కొనసాగించి ఉంటే మూడేళ్ల తర్వాత ప్రతినెలా 8 వేల రూపాయల జీతం వచ్చేది. అయితే ఏదో ఒకరోజు సొంతంగా కంపెనీ పెట్టాలనేది అతని ఆలోచన. ఇక సూర్య తండ్రి శివకుమార్ కూడా నటుడే. అయితే శివకుమార్‌కు తెలియకుండా తల్లి లక్ష్మి రూ.25 వేలు బ్యాంకులో రుణం తీసుకుంది. 90వ దశకంలో అది భారీ మొత్తం. ఆ రుణం ఎలాగైనా తీర్చాలనే ఉద్దేశంతో సినిమాల్లో నటించేందుకు అంగీకరించాడు సూర్య. అలా 1997లో విడుదలైన ‘నెరుక్కు నాయర్’ చిత్రంలో తొలిసారిగా సిల్వర్ స్క్రీన్ పై కనిపించాడు సూర్య. విక్రమ్ శివ పుత్రుడు తదితర సినిమాల్లో తన నటనతో ఆడియెన్స్ ను మెస్మరైజ్ చేశాడు. ఈక్రమంలోనే స్టార్ హీరోగా ఎదిగిపోయాడు.

సూర్య నటించిన ‘కంగువా’ నవంబర్ 14న విడుదల కానుంది. ఈ తమిళ చిత్రం పలు భాషల్లోకి డబ్ అవుతోంది. ఈ సినిమాలో బాబీ డియోల్, దిశా పటానీ వంటి బాలీవుడ్ నటులు కూడా కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రంలో సూర్య ప్రత్యేక గెటప్‌లో కనిపిస్తున్నాడు. దీంతో అభిమానులపై భారీ అంచనాలు ఉన్నాయి.

కంగువా ప్రమోషన్లలో సూర్య..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

భారత్‌-జర్మనీ మధ్య సుస్థిర అభివృద్ధికి రోడ్‌మ్యాప్‌..!
భారత్‌-జర్మనీ మధ్య సుస్థిర అభివృద్ధికి రోడ్‌మ్యాప్‌..!
రాజకీయాలకు పోసాని గుడ్‌బై.. ఇకపై ఆఖరి శ్వాస వరకు..
రాజకీయాలకు పోసాని గుడ్‌బై.. ఇకపై ఆఖరి శ్వాస వరకు..
పుష్ప2 కోసం ఏకంగా నలుగురు మ్యూజిక్ డైరెక్టర్స్.! సుక్కు దెబ్బ అది
పుష్ప2 కోసం ఏకంగా నలుగురు మ్యూజిక్ డైరెక్టర్స్.! సుక్కు దెబ్బ అది
మనబొమ్మ అదుర్స్.. బాలీవుడ్‌ బెదుర్స్.! ఫిల్మ్ ఇండస్ట్రీ పై టాలీవు
మనబొమ్మ అదుర్స్.. బాలీవుడ్‌ బెదుర్స్.! ఫిల్మ్ ఇండస్ట్రీ పై టాలీవు
మీ రివ్యూ మీ ఇష్టమైతే.. మా సినిమా మా ఇష్టం.! రివ్యూవర్స్‌పై
మీ రివ్యూ మీ ఇష్టమైతే.. మా సినిమా మా ఇష్టం.! రివ్యూవర్స్‌పై
జక్కన్న సంగతి తెలిసిందేగా.. SSMB29 ఇప్పట్లో లేనట్లేనా.?
జక్కన్న సంగతి తెలిసిందేగా.. SSMB29 ఇప్పట్లో లేనట్లేనా.?
బన్నీ,సుకుమార్‌ దేవీశ్రీ ని పక్కన పెట్టేశారా? మధ్యలో తమన్ ఎందుకు?
బన్నీ,సుకుమార్‌ దేవీశ్రీ ని పక్కన పెట్టేశారా? మధ్యలో తమన్ ఎందుకు?
వామ్మో.. అనుష్క.! వయసు 43ఏళ్లే.. కానీ సంపాదన 140 కోట్లు.!
వామ్మో.. అనుష్క.! వయసు 43ఏళ్లే.. కానీ సంపాదన 140 కోట్లు.!
ఇండియాలోనే పరమ చెత్త సినిమా.. 45కోట్లు పెడితే 70 వేల కలెక్షన్స్‌.
ఇండియాలోనే పరమ చెత్త సినిమా.. 45కోట్లు పెడితే 70 వేల కలెక్షన్స్‌.
శివునికి నమస్కరిస్తూ కుప్పకూలిపోయిన వ్యక్తి... CPR చేసినా..
శివునికి నమస్కరిస్తూ కుప్పకూలిపోయిన వ్యక్తి... CPR చేసినా..