Mahesh Babu : మహేష్ పక్కన ఉన్న ఈ బుడ్డోడిని గుర్తుపట్టారా .? అమ్మాయిల డ్రీమ్ బాయ్ అతను

రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు నయా లుక్ లోకి మారిపోయాడు. అలాగే బాడీని కూడా డవలప్ చేశారు. అలాగే ఈ సినిమాలో చాలా మంది స్టార్స్ నటించనున్నారని తెలుస్తోంది.

Mahesh Babu : మహేష్ పక్కన ఉన్న ఈ బుడ్డోడిని గుర్తుపట్టారా .? అమ్మాయిల డ్రీమ్ బాయ్ అతను
Mahesh Babu
Follow us
Rajeev Rayala

|

Updated on: Oct 24, 2024 | 7:41 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ జనవరి నుంచి ప్రారంభం కానుంది. ఈ సినిమాను యాక్షన్ అడ్వాంచరల్ కథతో తెరకెక్కిస్తున్నారు జక్కన్న. దాంతో ఈ సినిమా కోసం మహేష్ బాబు నయా లుక్ లోకి మారిపోయాడు. అలాగే బాడీని కూడా డవలప్ చేశారు. అలాగే ఈ సినిమాలో చాలా మంది స్టార్స్ నటించనున్నారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే మహేష్ బాబు త్రో బ్యాక్ ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పైన కనిపిస్తున్న ఫోటో చూశారా.? ఆ ఫొటోలో మహేష్ బాబుతో ఉన్నది ఓ స్టార్ హీరో. ఆయన ఎవరో గుర్తుపట్టారా .?

ఇది కూడా చదవండి : Uday Kiran: అంత పెద్ద హీరో.. ఆయన డెడ్ బాడీ మార్చురీ‌లో ఓ మూలన పడేశారు: ఆర్పీ పట్నాయక్ ఎమోషనల్

మహేష్ బాబు రాజమౌళి సినిమా రిలీజ్ అవ్వడానికి చాలా సమయం పడుతుంది. ఇంతలో మహేష్ బాబు ఓల్డ్ ఫోటోలు బయటకు తీస్తున్నారు. ఈ క్రమంలోనే మహేష్ కు సంబందించిన ఓ ఓల్డ్ ఫోటో చక్కర్లు కొడుతోంది. ఈ ఫొటోలో మహేష్ బాబుతో ఉన్న హీరో ఎవరో గుర్తుపట్టారా.? అతను టాలీవుడ్ లో క్రేజీ హీరో.. అంతే కాదు ఓ స్టార్ హీరో కొడుకు కూడా.. ఇంతకూ ఆయన ఎవరంటే..

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : Tollywood: శ్రీదేవితో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? స్టార్ హీరోగారి భార్య కూడా ఆమె

పై ఫొటోలో మహేష్ బాబుతో ఉన్నది స్టార్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్. ఈ యంగ్ హీరో నిర్మల కాన్వెంట్ అనే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. ఆతర్వాత పెళ్లి సందడి సినిమాతో ఫుల్ లెన్త్ హీరోగా మారి ప్రేక్షకులను అలరించాడు. పెళ్లి సందడి సినిమా మంచి విజయం సాదించడమతొ రోషన్ క్రేజ్ పెరిగిపోయింది. కాగా రోషన్ ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. కాగా మహేష్ బాబుతో రోషన్ చిన్నప్పుడు దిగిన ఫోటో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ ఫోటో పై నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. మహేష్ బాబు అప్పుడు ఇప్పుడు అలానే ఉన్నారు. ఆయన వయసు పెరగడం లేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

View this post on Instagram

A post shared by Roshann meka (@iamrshn)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.